AP Welfare Pensions: ఏపీలో బోగస్ పెన్షన్ల ఏరివేత షురూ, అర్హులకే సంక్షేమం అందించాలన్న మంత్రి డోలా-bogus ration cards in ap should be stopped minister dola orders to provide welfare to the deserving ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Welfare Pensions: ఏపీలో బోగస్ పెన్షన్ల ఏరివేత షురూ, అర్హులకే సంక్షేమం అందించాలన్న మంత్రి డోలా

AP Welfare Pensions: ఏపీలో బోగస్ పెన్షన్ల ఏరివేత షురూ, అర్హులకే సంక్షేమం అందించాలన్న మంత్రి డోలా

Sarath chandra.B HT Telugu
Aug 21, 2024 10:38 AM IST

AP Welfare Pensions ఏపీలో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించాలనే ప్రభుత్వ లక్ష్యసాధనకు అనుగుణంగా అధికారులు బాధ్యతతో పనిచేయాలని, ట్రాన్స్ జెండర్లకు ప్రత్యేకంగా రేషన్ కార్డులు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి చెప్పారు.బోగస్ కార్డుల్ని ఏరివేయాలని సూచించారు.

బోగస్ పెన్షన్లు ఏరివేయాలని సూచిస్తున్న మంత్రి డోలా
బోగస్ పెన్షన్లు ఏరివేయాలని సూచిస్తున్న మంత్రి డోలా

AP Welfare Pensions ఏపీలో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించాలని, ప్రభుత్వ లక్ష్యసాధనకనుగుణంగా అధికారులు బాధ్యతతో పనిచేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు.

విభిన్న ప్రతిభావంతులు, వయో వయోవృద్దులు,ట్రాన్స్ జెండర్స్ సంక్షేమంపై అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం దివ్యాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్ జెండర్స్ కి కల్పిస్తున్న సౌకర్యాలు, అందిస్తున్న సంక్షేమ పథకాలపై విస్తృత ప్రచారం నిర్వహించాలని అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించాలన్నారు.

అంద విద్యార్థులకు ఒకేషనల్, స్కిల్ కోర్సులు కూడా ప్రవేశపెట్టాలి. పాఠశాలలు ప్రారంభించే సమయానికే వారికి పాఠ్య పుస్తకాలు అందించాలని సూచించారు. ట్రాన్స్ జెండర్లు గుర్తింపు కార్డులు తీసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. ట్రాన్స్ జెండర్లకి ప్రత్యేకంగా రేషన్ కార్డులు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామన్నారు.

ట్రాన్స్ జెండర్ లతో స్వయం సహాయక బృందాల ఏర్పాటుకు ప్రోత్సహించాలి. వారికి స్వయం ఉపాధి కల్పించి సమాజంలో గౌరవంగా బతికేలా చర్యలు చేపట్టాలి. దివ్యాంగులకు బ్యాటరీ ట్రై సైకిల్లు ఇచ్చేందుకు ప్రణాళిక రూపొందించాలని సూచించారు.

దివ్యాంగులకు సేవ చేసే అదృష్టం రావడం గొప్ప భాగ్యమని, అధికారులు అలసత్వం వీడి బాధ్యతతో పని చేయాలన్నారు. అధికారులు సంబంధిత శాఖలపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ ఉండాలని, జిల్లా కలెక్టరేట్లలో జరిగే గ్రీవెన్స్ కి ఆయా శాఖల అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలన్నారు.

బోగస్ సర్టిఫికెట్లతో పింఛన్ల పంపిణీకి అడ్డుకట్ట వేయాలని ఆదేశించారు. ఆర్దిక ఇబ్బందులు ఉన్నా చెప్పిన హామీ ప్రకారం అధికారంలోకి వచ్చిన మొదటి నెల రూ.7000 పింఛన్ ఇచ్చామని, అర్హత ఉన్న చివరి వ్యక్తి వరకు పింఛన్లు అందించాలని, బోగస్ కార్డుల్ని ఏరివేయాలని అధికారులకు సూచించారు

డిఎస్సీకి ఉచిత శిక్షణ..

సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా డిఎస్సీ పరీక్షలకు హాజరయ్యే వారికి ఉచిత శిక్షణ అందించనున్నట్టు చెప్పారు. గురుకుల పాఠశాలలు, వసతి గృహాల్లో ప్రతి నెల హెల్త్ చెకప్ లు నిర్వహించాలని, ఉపాధ్యాయులు విద్యార్థులను సొంత పిల్లల్లా చూసుకోవాలన్నారు.

విద్యార్థులపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని, చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారికి ప్రత్యేక తరగతులు నిర్వహించాలన్నారు. అధికారులు తరచుగా తనిఖీలు నిర్వహించాలని రిమోట్ ఏరియాల్లోని గురుకుల పాఠశాలల్లో కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ పద్ధతిలో సిబ్బందిని నియమిస్తామన్నారు.

జిల్లా కేంద్రాల్లో ఎస్సీ విద్యార్థులకు మూడు నెలల పాటు ఉచితంగా డీఎస్సీ శిక్షణ అందిస్తాంమని, అంబేద్కర్ ఓవర్సీస్ విదేశీ విద్యతో పాటు గత టిడిపి ప్రభుత్వ హయాంలో అమలైన ఎస్సి సంక్షేమ పథకాలన్నీ పునరుద్ధరిస్తామన్నారు.

రాష్ట్రంలోని 1051 హాస్టల్స్ లో 86 వేల సీట్లలో 32 వేల సీట్లు ఖాళీలు ఉన్నాయని వాటిని సెప్టెంబర్ లోగా భర్తీ చేస్తామన్నారు. గురుకుల పాఠశాలలు, వసతి గృహాల్లో రూ.143 కోట్లతో మైనర్, మేజర్ రిపేర్లు చేయాల్సి ఉందన్నారు.ప్రతి వసతి గృహంలో 6 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్థామన్నారు.

అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి, ఎన్టీఆర్ విద్యోన్నతి, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్, కార్పొరేట్ కాలేజెస్ స్కీం, బుక్ బ్యాంకు టీం వంటి పథకాలన్నీ పునరుద్ధ రిస్తామన్నారు. గత ఐదేళ్లలో హాస్టల్ విద్యార్థులకు కాస్మోటిక్ ఛార్జీలు కూడా అందించలేదని, వాటిని తిరిగి విద్యార్థులకే అందిస్తామన్నారు. రూ.190 కోట్లతో గురుకుల పాఠశాలలు, వసతి గృహాల్లో డార్మెటరీలు కిచెన్లు పునర్నిర్మానం చేయాల్సి ఉందన్నారు. కొన్నిచోట్ల నాన్ టీచింగ్ స్టాఫ్ ని భర్తీ చేయాల్సి ఉందన్నారు. నరేగా నిధులతో గురుకులాల్లో కాంపౌండ్ వాల్స్, మరుగుదొడ్లు నిర్మించేందుకు చర్యలు చేపడతామన్నారు.