BJP Praja Poru : ఎయిమ్స్‌కు నీరివ్వకపోతే ఉద్యమిస్తామన్న సోము వీర్రాజు-bjp president somu veerraju demands for water supply for aiims mangalagiri ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Bjp President Somu Veerraju Demands For Water Supply For Aiims Mangalagiri

BJP Praja Poru : ఎయిమ్స్‌కు నీరివ్వకపోతే ఉద్యమిస్తామన్న సోము వీర్రాజు

B.S.Chandra HT Telugu
Oct 03, 2022 07:21 AM IST

BJP Praja Poru మంగళగిరి ఎయిమ్స్‌AIIMS నీటి సమస్యను తీర్చకపోతే పోరాటం ఉధృతం చేస్తామని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు హెచ్చరించారు. దాదాపు రెండేళ్లుగా మంగళగిరి ఎయిమ్స్‌కు కావాల్సిన నీటిని సరఫరా చేయకపోవడం వల్ల వైద్య సేవలకు అంతరాయం కలుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడంపై సోము ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నిర్వహించిన ప్రజాపోరు యాత్రల ముగింపు సందర్భంగా సోము వీర్రాజు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు
బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కంత్రీ రాజకీయాలు నడుస్తున్నాయని సోము వీర్రాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ లెనిన్ సెంటర్ లో ప్రజాపోరు ముగింపు సభలో వైసీపీపై Somu Veerraju తీవ్ర విమర్శలు చేశారు.

ట్రెండింగ్ వార్తలు

మంగళగిరి ఎయిమ్స్ AIIMS ఆసుపత్రికి మంచినీరు ఇవ్వాలని డిమాండ్ చేస్తే ఆరోగ్యశాఖ మంత్రి స్పందించారని, ఇది చాలదని ఎయిమ్స్ కు నీరు అందించక పోతే ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామన్నారు. ఈ నెల 10 వతేదీ వరకు గడువు ఇస్తున్నానని తర్వాత ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.కేంద్రం కట్టిన ఎయిమ్స్‌కు జగన్‌ నీళ్ళివ్వడని, ఈనెల 10 లోపల ఎయిమ్స్ లేదో నీటికి ఏర్పాటు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మెడికల్ కాలేజీల Medical Colleges నిర్మాణం కూడా కేంద్రం చేస్తున్నదేనన్నారు.

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి విషయంలో చర్చకు తాను సిద్దమని వైసీపి, టిడిపి చర్చకు రావడానికి దమ్ముందా అని ప్రశ్నించారు. ఎనిమిది సంవత్సరాలుగా రాష్ట్రానికి రాజధాని లేక పోవడానికి టీడీపీ, వైసీపీలు కారణం కాదా అని ప్రశ్నించారు.

రాష్ట్రంలో వర్గ పోరు నడుస్తోందని, ఒకరు పాదయాత్ర అంటే మరొకరు పోటీ పాదయాత్ర అంటారు తప్ప రాజధాని సమస్య పై మాట్లాడరని విమర్శించారు. లక్షల కోట్లుతో అమరావతి రాజధానిగా కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న విషయాన్ని ప్రజలకు తెలియ చేయడానికి ప్రజా పోరు సభలు నిర్వహిస్తున్నామని చెప్పారు.

హెల్త్ యూనివర్శీటీ(Health University) కి ఎన్టీఆర్ పేరు తీసేయడం అన్యాయమని ఈ విషయంలో బిజెపి కి మాత్రమే పోరాటం చేసే హక్కు ఉందన్నారు. ఎన్టీఆర్‌ పేరు విషయంలో పోరాటం చేసే హక్కు బీజేపీకి ఉందని చెప్పారు. ఎన్టీఆర్ కష్టకాలంలో ఉన్న ప్పడు బిజెపి అండగా ఉందని, అదే విధంగా ఎన్టీఆర్ ఎప్పడు కాంగ్రెస్ తో చేతులు కలప లేదని చెప్పారు.

రాష్ట్ర విభజన జరిగి 8 ఏళ్ళు పూర్తయ్యాయని, 13 జిల్లాలు అభివృద్ధి మోదీ చేస్తున్నారని అభివృద్ధిని వికేంద్రీకరించింది మోదీ మాత్రమే అన్నారు. సీఎం జగన్ తండ్రి అధికారంలో ఉన్నపుడు ఏపీకి విద్యుత్ లేదని చంద్రబాబు వచ్చాక మోదీ ఏపీ కి విద్యుత్ ఇచ్చారని, 7వేల కోట్లు మోదీ సబ్ స్టేషన్ల కోసం ఇచ్చారని Somu Veerraju చెప్పారు.

ఉద్యోగాలు అమ్ముకుని అవినీతి చేసిన పార్టీలు టిడిపి, వైసీపీలని ఆరోపించారు. విద్యుత్ Electricity రావడం వలన మనకు నిరుద్యోగం తగ్గిందని, కుటుంబ పార్టీలు రెండిటికి విద్యుత్‌తో సంబంధం లేదని రాజధానిని రావణ కాష్టం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

రాజధాని కట్టకుండా ఊరేగింపులు పెడతారని ఎద్దేవా చేశారు. టీడీపీ, వైసీపీలది వర్గపోరని తమది ప్రజాపోరని చెప్పారు. రాజధాని లేకుండా చేసే రాజకీయాలు చేస్తున్నారని బిజెపి అభివృద్ధి చేస్తేనే ఇక్కడి ప్రజలకు ఉపయోగం ఉంటుందన్నారు. 1.6 కోట్ల మందికి మోదీ బియ్యం ఇస్తున్నారని, జగన్ వ్యాన్ లో పంపే బియ్యం మోదీ ఇచ్చేవని, బియ్యం వ్యాన్‌ల మీద మోదీ బొమ్మ లేదని ఆరోపించారు.

మోదీ 9 వేల కోట్లు ఇచ్చి కట్టిన టిడ్కో( TIDCO Housing) ఇళ్ళు ఇంకా జగన్ లబ్ధిదారులకు ఇవ్వలేదని ఆరోపించారు. మోదీ పిల్లలకు యూనీఫాం, మధ్యాహ్న భోజనం ఇస్తున్నాడని, మోదీ ఇచ్చే వాటికి జగన్ బొమ్మేసుకుని ఇస్తున్నాడని ఆరోపించారు. పాలు, పౌష్టికాహారం మోదీ ఇస్తున్నారని వాటి మీద మోదీ బొమ్మలు లేవన్నారు. బూం బూం బీర్‌ల మీద జగన్ బొమ్మ వేసుకోవాలని సోము వీర్రాజు సలహా ఇచ్చారు. పారిశుధ్య వ్యాన్ లు మోదీ ఇచ్చినవేనని చెప్పారు. ఏపీలో బీరు, మద్యం బాటిల్ తాగితే జగన్ కి డబ్బులిచ్చినట్టేనని విమర్శించారు. ఏపీలో బంగారం దొరుకుతుంది కానీ ఇసుక దొరకదని ఆరోపించారు.

ఏపీకిరైల్వే జోన్ ఇస్తున్నామని, నోటి దగ్గర కూడు పోతుందని దడదడ లాడి పోతున్నారని మోదీ చేస్తున్న అభివృద్ధి ప్రజలకు తెలియనివ్వడం లేదని ఆరోపించారు. మోదీ వస్తేనే అభివృద్ధి వస్తుందని మొత్తం అందరికీ సన్న బియ్యం ఇచ్చే బాధ్యత మోదీదేనన్నారు. బిజెపి ప్రభుత్వం వస్తే లారీ ఇసుక 4 వేలకే ఇస్తామని, రోడ్లు వెంటనే వేయించే బాధ్యత బిజెపీదని చెప్పారు.

IPL_Entry_Point