BJP On Kanna Issue : రాజకీయ దురుద్దేశాలతోనే కన్నా విమర్శలంటున్న జివిఎల్-bjp mp gvl says that kanna allegations on bjp with political intentions only ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Bjp Mp Gvl Says That Kanna Allegations On Bjp With Political Intentions Only

BJP On Kanna Issue : రాజకీయ దురుద్దేశాలతోనే కన్నా విమర్శలంటున్న జివిఎల్

HT Telugu Desk HT Telugu
Feb 16, 2023 01:35 PM IST

BJP On Kanna Issue బీజేపీని వీడుతూ రాష్ట్ర పార్టీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చేసిన వ్యాఖ్యల్ని ఎంపీ జివిఎల్ తప్పు పట్టారు. కన్నా వ్యవహారంపై బీజేపీ కేంద్ర నాయకత్వం అనుమతించిన తర్వాత తన స్పందన తెలియ చేస్తున్నట్లు జివిఎల్ వెల్లడించారు. బీజేపీలో కన్నాకు అత్యున్నత గౌరవ మర్యాదలు దక్కాయని చెప్పారు. పార్టీని వీడుతూ కన్నా చేసిన వ్యాఖ్యలు రాజకీయ దురుద్దేశాలతో చేసినవేనన్నారు.

ఎంపీ జివిఎల్ నరసింహరావు
ఎంపీ జివిఎల్ నరసింహరావు

BJP On Kanna Issue రాజకీయ దురుద్దేశాలతోనే కన్నా లక్ష్మీనారాయణ బీజేపీపై విమర్శలు చేస్తున్నారని ఎంపీ జీవిఎల్ ఆరోపించారు. కన్నా వ్యవహారంపై కేంద్ర పార్టీ నుంచి అనుమతించిన తర్వాత తాను స్పందిస్తున్నానని చెప్పారు.

ట్రెండింగ్ వార్తలు

కన్నా లక్ష్మీనారాయణకు బీజేపీలో సముచిత గౌరవం ఇచ్చారని, రాష్ట్ర అధ్యక్షుడిగా, జాతీయ కార్యవర్గ సభ్యుడిగా కన్నాను పార్టీ నియమించినట్లు ఎంపీ జివిఎల్ చెప్పారు. బీజేపీలో అత్యంత ప్రధానమైన హోదాలను కన్నాకు కల్పించినట్లు జివిఎల్ చెప్పారు.

పార్టీ నుంచి రాజీనామా చేస్తూ సోము వీర్రాజుపై చేసిన వ్యాఖ్యలు సముచితం కాదని భావిస్తున్నామని చెప్పారు. కన్నా వ్యాఖ్యలు రాజకీయ దురుద్దేశమైనవన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో సోము తీసుకున్న నిర్ణయాలన్ని కేంద్ర పార్టీ అనుమతితో చేసినవేనని, పార్టీలో పదవుల నుంచి ఎవరిని తొలగించినా, నియమించినా అవి ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాలు , సొంతంగా తీసుకున్న నిర్ణయాలు కాదన్నారు.

బీజేపీని వీడుతూ సోము వీర్రాజుపై కన్నా చేసిన వ్యాఖ్యలు సముచితం కాదన్నారు. తనపై కన్నా చేసిన వ్యాఖ్యలపై స్పందించనని జివిఎల్ చెప్పారు. ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలు వారికి ఉన్నాయని, ఎంపీగా తనకు ఉన్న అవకాశాల మేరకు తాను పని చేస్తానని చెప్పారు. బీజేపీలో రాష్ట్ర అధ్యక్ష పదవి అత్యున్నతమైనదని, బయటి నుంచి వచ్చిన వారికి బీజేపీలో అధ్యక్ష పదవి ఇచ్చిన సందర్భం అత్యంత అరుదైనదని చెప్పారు. ఇతర పార్టీల నుంచి బీజేపీలోకి వచ్చినా కన్నాకు బీజేపీ అలాంటి అవకాశం ఇచ్చిందని, జాతీయ కార్యవర్గ సభ్యుడిగా కూడా పూర్తి స్థాయి గౌరవాన్ని బీజేపీ ఇచ్చిందన్నారు.

అంతకు ముందు బందర్ రోడ్ లో వంగవీటి మోహనరంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. రంగా వ్యక్తిత్వం గురించి , బడుగుబలహీనవర్గాల సేవల గురించి పార్లమెంట్ లో ప్రస్తావించానని భారతదేశ చరిత్రలో రంగా చరిత్ర అరుదైన సంఘటన అని చెప్పారు. 3 ఏళ్లలోనే 35 ఏళ్ల ఖ్యాతి సంపాదించారని, రాజకీయాలు అనేవి పార్టీలకు ,కులాలకు సంబంధించినవి కాదన్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇద్దరిపేర్లేనా... మిగిలినవారి పేర్లు కనిపించవా అని నిలదీశారు. ఎదోక జిల్లాకు రంగా పేరు పెట్టాలంటే రాష్ట్రప్రభుత్వం ఎందుకు స్పందించలేదన్నారు. రాష్ట్రంలో ప్రతి పధకానికి రెండు కుటుంబాల పేర్లు తప్ప మిగిలినవారి పేర్లు పెట్టరా అన్నారు. సబ్ కా విశ్వాస్ అనే నినాదంతో అందర్ని గౌరవించుకోవాలన్నారు.

IPL_Entry_Point

టాపిక్