Somu Veerraju : ఏపీ మాజీ సీఎం జగన్, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ పై...ఏపీ బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఒక పెద్ద గుంట నక్క అంటూ వ్యాఖ్యానించారు. బీజేపీ నేతలపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు సోము వీర్రాజు కౌంటర్ ఇచ్చారు. రాత్రి పూట నిద్రపోని, ఊగిపోయే గుంట నక్క కేసీఆర్ అంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్.... కొడుకు, కూతురు, మేనల్లుడి అభివృద్ధినే కేసీఆర్ కోరుకుంటారని అన్నారు. బీజేపీ నేతలు గుంట నక్కలు కాదని, రాష్ట్రాలను అభివృద్ధి చేసేందుకు కళ్లల్లో ఒత్తులేసుకుని ఎదురు చూస్తుంటారన్నారు. బీజేపీ ఎప్పుడూ అభివృద్ధి చేసేందుకు అధికారం సాధించాలని కోరుకుంటుందన్నారు.
"కేసీఆర్ కల్లబొల్లి కబుర్లు చెప్పి తెలంగాణను పదేళ్లు పాలించారు. మాయ మాటల మరాఠీ కేసీఆర్. ఇప్పుడు జనం నమ్మకపోవడంతో బీజేపీపై అసత్య ఆరోపణలు చేస్తున్నారు. బీజేపీ నేతలను గుంట నక్కలు అన్న కేసీఆర్.. తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలి.కేసీఆరే గుంట నక్క" -సోము వీర్రాజు
వైసీపీ అధినేత, మాసీ సీఎం జగన్ పై సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. కూటమి లక్ష్యం వైసీపీని ఖాళీ చేయడమేనన్నారు. ఈసారి వైసీపీకి 20 శాతం ఓట్లు కూడా రాకుండా చూస్తామన్నారు. మళ్లీ సీఎం అవుతానని జగన్ పగటి కలలు కంటున్నారని, అధికారులను బెదిరిస్తున్నారన్నారు. ఏపీలో ప్రతిపక్ష నేత శాసనసభకు వెళ్లడం లేదని, ప్రజలు ఇవ్వని ప్రతిపక్ష హోదా కావాలని జగన్ డిమాండ్ చేస్తున్నారన్నారు. 2014లో వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇస్తే జగన్ సభకు వెళ్లలేదని గుర్తుచేశారు. 2024లో ప్రజలు వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదన్నారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభకు వస్తానని అనడం చాలా విడ్డూరంగా ఉందన్నారు. వైఎస్ జగన్ ది రెండు నాలుకల ధోరణి అని సోము వీర్రాజు విమర్శించారు.
వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అన్ని విధాలుగా నాశనం చేసిందని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఫైర్ అయ్యారు. అందుకే ప్రజలు జగన్‌ను దూరం పెట్టారన్నారు. ఆసెంబ్లీలో వైసీపీ ప్రభుత్వంలో జరిగిన దురాగతాలను, అక్రమాలను బయటపెట్టామన్నారు. వైసీపీ హయాంలో సీఎం రిలీఫ్ ఫండ్ పూర్తి స్థాయిలో ఎవరికి అందలేదన్నారు. టిడ్కో ఇళ్లను వైసీపీ హయాంలో దుర్మార్గంగా నిలిపివేశారని ఆరోపించారు. దీంతో లబ్దిదారులపై భారం పడుతోందన్నారు. ఒక సెంటూ పనికిరాని భూములు పేదలకు కేటాయించారన్నారు. ఆ భూములు వద్దని చెప్తే తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవిస్తామని ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు.
సంబంధిత కథనం