AP BJP On Janasena : కలిసి రావాలని అడిగినా పవన్ స్పందించ లేదు.. ఏపీ బీజేపీ-bjp leader madhav sensational comments on bjp and janasena alliance ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Bjp On Janasena : కలిసి రావాలని అడిగినా పవన్ స్పందించ లేదు.. ఏపీ బీజేపీ

AP BJP On Janasena : కలిసి రావాలని అడిగినా పవన్ స్పందించ లేదు.. ఏపీ బీజేపీ

HT Telugu Desk HT Telugu
Mar 21, 2023 06:33 PM IST

బీజేపీ జనసేన మధ్య దూరం పెరిగిందా అనే విషయంపై చర్చ నడుస్తూనే ఉంది. దీనిపై తాజాగా బీజేపీ నేత మాధవ్ కామెంట్స్ చేశారు. ఇవి కాస్త హాట్ టాపిక్ అయ్యాయి.

జనసేనపై బీజేపీ కామెంట్స్
జనసేనపై బీజేపీ కామెంట్స్

ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నిక(MLC Elections)ల్లో బీజేపీకి జనసేన మద్దతు ఇవ్వలేదని బీజేపీ నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారు. పవన్ కల్యాణ్(Pawan Kalyan) బీజేపీకి మద్దతుపై చాలా రోజులుగా చర్చ నడుస్తోంది. బీజేపీ నేత మాధవ్ చేసిన వ్యాఖ్యలు మరింత ఊతన్నిచ్చాయి. తమతో పవన్ కల్యాణ్ కలిసి రావడం లేదని.. మాధవ్ ఆరోపణలు చేశారు. జనసేన(Janasena)తో పొత్తు ఉన్న కూడా.. లేనట్టుగానే ఉందని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైన మాధవ్ అసంతృప్తి వ్యక్తం చేశఆరు.

yearly horoscope entry point

'ఎమ్మెల్సీ ఎన్నికలలో సహకరించాలని కోరినా పవన్‌(Pawan) స్పందించలేదు. పైగా కమ్యూనిస్టులు తమకు సపోర్ట్‌ చేస్తున్నట్లు సోషల్‌ మీడియా(Social Media)లో ప్రచారం చేశారు. దాన్ని ఖండించాలని కోరినా పవన్‌ కల్యాణ్‌ ఖండించలేదు. గతంలోనూ.. తమ పార్టీ ఓటమి చెందినా.. పుంజుకున్న ఘటనలు ఉన్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికలలో గతంలో కంటే బీజేపీ(BJP)కి మెరుగైన ఓట్లు వచ్చాయి. ఉత్తరాంధ్రలో మాత్రం బీజేపీ వైఫల్యం చెందింది. భవిష్యత్ లో ఎలాంటి అంశాలపై దృష్టిపెట్టాలో మా పెద్దలు చెప్పారు.' అని మాధవ్ అన్నారు.

పొత్తుల విషయం తమ జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకుంటుందని మాధవ్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో పొత్తుల మీద అనేక రకాలుగా ప్రచారం జరుగుతుందన్నారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని స్పష్టం చేశారు. పవన్ చెప్పినట్టుగా ఇరు పార్టీల కార్యకర్తలు పని చేస్తే.. ఫలితాలు ఉంటాయని మాధవ్ చెప్పారు. ఆ విధంగా.. పవన్ కల్యాణ్(Pawan Kalyan), మనోహర్ ఆలోచన చేయాలని కోరుతున్నామని తెలిపారు.

'ఆంధ్రప్రదేశ్ లో పవన్ కల్యాణ్ కు మంచి అవకాశం ఉంది. సభకు వచ్చిన జనాన్ని అందరూ చూశారు. బీజేపీ, జనసేన(BJP and Janasena) కలిసి పని చేస్తే.. ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. రాష్ట్రంలో ప్రభంజనం సృష్టించొచ్చు. ప్రస్తుతం.. బీజేపీ, జనసేన పొత్తుతో ముందుకు వెళ్తున్నాయి. బీజేపీ చేపట్టే చాలా కార్యక్రమాలకు జనసేనను ఆహ్వానించాం. కానీ వారు రాలేదు. ఏదైనా అసంతృప్తి ఉంటే.. అంతర్గతంగా పరిష్కరించుకుంటాం. వైసీపీ ప్రభుత్వ(YCP Govt) అవినీతిపై బీజేపీ ఎప్పుడూ పోరాటం చేస్తూనే ఉంది.' అని మాధవ్ అన్నారు.

Whats_app_banner