AP BirdFlu: ఏపీలో బర్డ్‌ ఫ్లూ కలకలం, వైరస్‌ నిర్దారణ, గోదావరి జిల్లాల్లో తెగులుకు కారణం గుర్తింపు-bird flu scare in ap virus confirmed cause of outbreak identified in godavari districts ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Birdflu: ఏపీలో బర్డ్‌ ఫ్లూ కలకలం, వైరస్‌ నిర్దారణ, గోదావరి జిల్లాల్లో తెగులుకు కారణం గుర్తింపు

AP BirdFlu: ఏపీలో బర్డ్‌ ఫ్లూ కలకలం, వైరస్‌ నిర్దారణ, గోదావరి జిల్లాల్లో తెగులుకు కారణం గుర్తింపు

Bolleddu Sarath Chandra HT Telugu
Published Feb 11, 2025 07:59 AM IST

AP BirdFlu: ఆంధ్రప్రదేశ్‌లో లక్షల సంఖ్యలో కోళ్ల చావులకు బర్డ్‌ఫ్లూ‌గా భోపాల్‌ హై సెక్యూరిటీ ల్యాబరేటరీ నిర్దారించింది. కొన్ని వారాలుగా గోదావరి జిల్లాల్లో పెద్ద సంఖ్యలో కోళ్లు చనిపోతున్నాయి. కొల్లేరు పరివాహక ప్రాంతాలకు వలస వచ్చిన పక్షులతో వైరస్‌ విస్తరించినట్టు ఏపీ పశు సంవర్ధక శాఖ స్పష్టత ఇచ్చింది.

ఏపీలో రెండు జిల్లాల్లో బర్డ్‌ ఫ్లూ నిర్ధారణ
ఏపీలో రెండు జిల్లాల్లో బర్డ్‌ ఫ్లూ నిర్ధారణ (pixabay)

AP BirdFlu: ఆంధ్రప్రదేశ్‌ కోళ్ల ఆకస్మిక మరణాలకు కారణం తెలిసింది. గోదావరి జిల్లాల్లో గత కొద్ది వారాలుగా లక్షల సంఖ్యలో కోళ్లు చనిపోవడంతో కలకలం రేగింది. ఏపీ తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వైరస్‌ ప్రభావంతో భారీగా కోళ్లు చనిపోయాయి. ఖమ్మం, సత్తుపల్లితో పాటు ఉభయ గోదావరి జిల్లాల్లో పెద్ద సంఖ్యలో కోళ్లు చనిపోయాయి.

ఈ క్రమంలో చనిపోయిన కోళ్ల నమూనాలను పశు సంవర్థక శాఖ అధికారులు వ్యాధి నిర్థారణ కోసం భోపాల్‌కు పంపించారు. పశ్చిమగోదావరి జిల్లాలోని రెండు ప్రాంతాల్లో కోళ్ల మరణాలకు ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజా (హెచ్ఎన్1 -బర్డ్‌ ఫ్లూ వైరస్‌ను గుర్తించారు. ఏపీలోని పలు ప్రాంతాల్లో చనిపోయిన కోళ్ల నుంచి తీసిన నమూనాలను మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఉన్న నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హైసెక్యూ రిటీ యానిమల్ డిసీజెస్‌ పరీక్షలకు పంపారు.

పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం వేల్పూరు, తూర్పు గోదావరి జిల్లా పెరవలి మండలం కానూరు అగ్రహారంలోని కోళ్ల ఫారంల నుంచి పంపిన నమూనాలు పాజిటివ్ గుర్తించారు. పశుసంవర్ధక శాఖ అధికారులు రెండు జిల్లాల్లోని కోళ్ల ఫారాల్లో కోళ్లను పూడ్చి పెట్టారు.

కోళ్ల ఫారంలకు కిలోమీటరు దూరం వరకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. పరిసర ప్రాంతా ల్లో వైరస్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. రెడ్ జోన్‌లో ప్రత్యేక బృందాలతో నిఘా ఏర్పాటు చేవారు. కోళ్ల ఫారాల్లో పనిచే స్తున్న కార్మికుల ఆరోగ్య పరిస్థితిని గమనిస్తున్నారు. కోళ్లకు సంక్రమిస్తున్న వ్యాధులపై రైతులకు అవగాహన సదస్సులు నిర్వ హిస్తున్నారు.

వలస పక్షులతో వైరస్‌ వ్యాప్తి…

ఏటా కొల్లేరు ప్రాంతానికి వివిధ దేశాల నుంచి వచ్చే వలస పక్షుల్లో ఉండే వైరస్ ద్వారా బర్డ్‌ ఫ్లూ వ్యాప్తి చెందినట్టు భావిస్తున్నారు. కొల్లేరుకు వచ్చిన పక్షులు నీటిలో రెట్టలు వేసే సమయంలో ఆ వైరస్‌ జలాశయాల్లోకి చేరు తోంది. నీటి ప్రవాహంతో కోళ్లకు సంక్రమిస్తున్నట్టు అంచనా వేశారు.

నవంబరు, డిసెంబరు, జనవరి నెలల్లో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండటంతో వైరస్ వేగంగా వ్యాప్తి చెందిందని పశు సంవర్థక శాఖ అధికారులు చెబుతున్నారు. మొదట్లో చనిపోయిన వాటిని పూడ్చి పెట్టకుండా బయట పడేయడంతో వైరస్‌ వ్యాప్తి చెందినట్టు గుర్తించారు. ఉష్ణోగ్రతలు 32 నుంచి 34 డిగ్రీల మధ్య ఉంటే బర్డ్‌ ఫ్లూ వైరస్ జీవించలేదని ప్రస్తుతం రాష్ట్రంలోని అధిక శాతం ప్రాంతాల్లో 34 డిగ్రీల పైనే నమోదవుతున్నందున వైరస్‌ వ్యాప్తి చెందలేదని భావిస్తున్నారు.

బర్డ్ ఫ్లూగా గుర్తించిన రెండు పారాల్లోని కోళ్లు, గుడ్లను పూడ్చి పెట్టాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలిచ్చినట్టు ఏపీ పశు సంవర్థక శాఖ ప్రకటించింది. పూడ్చి పెట్టే ఒక్కో కోడికి రూ.90 చొప్పున పరిహారం అందిస్తామని చెప్పారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా రెండు కోళ్ల ఫారాల చుట్టూ కిలోమీటరు పరిధిలో రెడ్ అలర్ట్ ప్రక టించారని అక్కడ మాత్రమే చికెన్ దుకాణాలు మూసివేయాలని మిగిలిన చోట్ల ఆంక్షలు లేవని స్పష్టత ఇచ్చారు.

వైరస్‌ వ్యాపించిన 10 కిలోమీటర్ల పరిధి లోనూ నిఘా పెట్టి పర్యవేక్షిస్తున్నట్టు పశుసంవర్థక శాఖ డైరెక్టర్ దామోదర్ నాయుడు తెలిపారు. . రాష్ట్రంలోని మిగి లిన ప్రాంతాల్లో కోళ్లకు ఇబ్బంది లేదన్నారు. కోడి మాంసాన్ని అధిక ఉష్ణోగ్రతల వద్ద ఉడికిస్తున్నందున ఎలాంటి భయం లేకుండా తినొచ్చని చెబుతున్నారు.

Whats_app_banner