Prabhas Birthday : 'బిల్లా'లో ప్రభాస్ గన్స్ పేల్చాడు.. థియేటర్లో ఫ్యాన్స్ టపాసులు పేల్చారు-billa re release prabhas fans burst fire crackers in andhra pradesh theatre ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Billa Re Release Prabhas Fans Burst Fire Crackers In Andhra Pradesh Theatre

Prabhas Birthday : 'బిల్లా'లో ప్రభాస్ గన్స్ పేల్చాడు.. థియేటర్లో ఫ్యాన్స్ టపాసులు పేల్చారు

HT Telugu Desk HT Telugu
Oct 23, 2022 04:47 PM IST

Prabhas Billa Movie Re Release : సిని నటుడు ప్రభాస్ బర్త్ డే. ఈ సందర్భంగా బిల్లా సినిమాను చాలా థియేటర్లలో ప్రదర్శించారు. కొంతమంది ఫ్యాన్స్ అత్యుత్సాహంతో థియేటర్లోనే టపాసులు పేల్చారు.

బిల్లా సినిమాలో ప్రభాస్
బిల్లా సినిమాలో ప్రభాస్ (twitter)

నటుడు ప్రభాస్(Billa) బిల్లా సినిమా ప్రదర్శన సందర్భంగా అభిమానులు పటాకులు పేల్చడంతో ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లోని ఓ థియేటర్‌లో ఆదివారం అగ్నిప్రమాదం జరిగింది . ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో చోటుచేసుకుంది. వెంకట్రమణ థియేటర్‌లో ‘బిల్లా’ సినిమా ప్రదర్శన సందర్భంగా ప్రభాస్ అభిమానులు(Prabhas Fans) అత్యుత్సాహం ప్రదర్శిస్తూ పటాకులు పేల్చారు.

ట్రెండింగ్ వార్తలు

ప్రభాస్ పుట్టినరోజును జరిపేందుకు ప్లాన్ చేశారు అభిమానులు(Fans). ఈ సందర్భంగా టపాసులు థియేటర్లో పేల్చారు. దీంతో సీట్లకు మంటలు అంటుకున్నాయి. మంటలు వేగంగా వ్యాపించడంతో ప్రేక్షకులు భయంతో బయటకు పరుగులు తీశారు. అదృష్టవశాత్తూ ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. థియేటర్ సిబ్బంది.. సినిమా చూస్తున్న కొంతమంది సహాయంతో మంటలను ఆర్పివేశారు.

ఇటీవల మరణించిన కృష్ణం రాజు(Krishnam Raju) కూడా ఈ సినిమాలో ఉన్నారు. దీంతో బిల్లా సినిమా చూసేందుకు పెద్ద ఎత్తున థియేటర్ల వద్దకు అభిమానులు వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలోని చాలా థియేటర్లలో బిల్లా సినిమా రీ రిలిజ్ చేశారు. అనుష్క శెట్టి(Anushka Shetty) కథానాయికగా నటించిన 'బిల్లా' 2009లో విడుదలైంది. కృష్ణంరాజు సొంత బ్యానర్‌ 'గోపీకృష్ణా మూవీస్‌'పై దీన్ని నిర్మించారు.

టపాసులను టెస్ట్ చేసిన వ్యక్తి.. ఆపై

తిరుపతి(Tirupati) జిల్లాలోని వడవలపేట మండలంలోని నారాయణదాసు తోట ఓ వ్యక్తి క్రాకర్స్ టెస్ట్ చేశాడు. కొనుగోలు చేసిన టపాసులు ఎలా పేలుతున్నాయని పరీక్షించాడు. క్రాకర్స్ దుకాణం దగ్గరే ఇలా చేశాడు. దీంతో స్థానికులు అందరూ పరుగుపెట్టారు. అదే సమయంలో టపాసుల నుంచి నిప్పు రవ్వలు దగ్గరలోని దుకాణాల్లో ఎగిసిపడ్డాయి. ఈ కారణంగా స్థానికంగా ఉన్న దుకాణాలన్నింటిలోనూ మంటలు చెలరేగాయి.

ఈ ఘటనతో దుకాణాల్లోని టపాసులు అన్నీ పేలిపోయాయి. బాధితుల ద్వారా పోలీసులకు విషయం తెలిసింది. పోలీసులు(Police), అగ్ని మాపక సిబ్బంది వెంటనే వచ్చారు. మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో సుమారు 20 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్టుగా తెలుస్తోంది. టపాసుల దుకాణాల యజమానుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

IPL_Entry_Point