ఏపీ సీఎం చంద్రబాబుకు మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ లేఖ రాశారు. దిల్లీలో గేట్స్ ఫౌండేషన్‌తో జరిగిన ఒప్పంద సమావేశాన్ని ప్రస్తావిస్తూ బిల్ గేట్స్ లేఖ రాశారు. ఈ ఒప్పందం కోసం సీఎం చంద్రబాబు చూపిన చొరవను అభినందించారు.
సీఎం చంద్రబాబు తన బృందంతో దిల్లీకి వచ్చినందుకు ధన్యవాదాలు చెప్పారు. మంచి వాతావరణంలో చంద్రబాబుతో సంప్రదింపులు జరిపామన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల అభివృద్ధికి, పేదల విద్య, ఆరోగ్యంపై ఒప్పందం చేసుకోవడాన్ని అభినందిస్తున్నానని బిల్‌గేట్స్ తన లేఖలో ప్రస్తావించారు.
సీఎం చంద్రబాబు ఇటీవల దిల్లీలో బిల్‌గేట్స్‌తో సమావేశమయ్యారు. ఏపీ అభివృద్ధి, సంక్షేమానికి గేట్స్ ఫౌండేషన్ సహకారంపై చర్చించారు. ఆరోగ్య సంరక్షణ, విద్య, వ్యవసాయం, ఉపాధి కల్పన వంటి కీలక రంగాల్లో ఏఐ, అధునాతన సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై చర్చించినట్లు అప్పట్లో సీఎం చంద్రబాబు ఎక్స్ వేదికగా తెలిపారు.
సంబంధిత కథనం