వల్లభనేని వంశీకి బిగ్ రిలీఫ్, కిడ్నాప్ కేసులో బెయిల్ మంజూరు-big relief for vallabhaneni vamsi bail grant in kidnapping case but remand continues ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  వల్లభనేని వంశీకి బిగ్ రిలీఫ్, కిడ్నాప్ కేసులో బెయిల్ మంజూరు

వల్లభనేని వంశీకి బిగ్ రిలీఫ్, కిడ్నాప్ కేసులో బెయిల్ మంజూరు

వైసీపీ నేత వల్లభనేని వంశీకి భారీ ఊరట దక్కింది. సత్యవర్థన్ కిడ్నాప్ కేసులో విజయవాడ ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం వంశీకి బెయిల్ మంజూరు చేసింది. అయితే గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో బెయిల్ రాకపోవడంతో ఇంకా ఆయన రిమాండ్ లోనే ఉన్నారు.

వల్లభనేని వంశీకి బిగ్ రిలీఫ్, కిడ్నాప్ కేసులో బెయిల్ మంజూరు

వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి భారీ ఊరట లభించింది. విజయవాడ ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం వల్లభనేనికి బెయిల్ మంజూరు చేసింది. సత్యవర్ధన్‌ కిడ్నాప్, బెదిరింపుల కేసులో వల్లభనేని వంశీకి బెయిల్ మంజూరు ఇచ్చింది కోర్టు.

ఎస్సీ, ఎస్టీ కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో వంశీ ఇప్పటికే రెండు సార్లు బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే కోర్టు రెండు సార్లు బెయిల్‌ తిరస్కరించింది. మూడోసారి బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా...ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు, ఇవాళ బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో వల్లభనేని వంశీతో పాటు మరో నలుగురు నిందితులకు బెయిల్ మంజూరు చేసింది.

బెయిల్ వచ్చిన ఇంకా జైలులోనే

వల్లభనేని వంశీపై... గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి, సత్యవర్ధన్‌ కిడ్నాప్‌, బెదిరింపులు...ఇలా మొత్తం ఆరు కేసులు నమోదు అయ్యాయి. ఐదు కేసుల్లో వల్లభనేని వంశీ మోహన్‌ బెయిల్ పొందారు. గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో ఇంకా వంశీకి బెయిల్‌ మంజూరు కాలేదు. ఈ కేసులోనే వంశీ ప్రస్తుతం రిమాండ్ లో ఉన్నారు.

దీంతో సత్యవర్ధన్‌ కిడ్నాప్‌ కేసులో బెయిల్‌ వచ్చినా, వంశీ జైలులో ఉండాల్సిన పరిస్థితి ఉంది. సత్య వర్ధన్ కిడ్నాప్ కేసులో ఫిబ్రవరి 13న హైదరాబాద్‌లో వల్లభనేని వంశీ మోహన్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. అప్పటి నుంచి ఆయన రిమాండ్ లోనే ఉన్నారు.

ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంది

సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వైసీపీ నేత వల్లభనేని వంశీని పోలీసులు మంగళవారం ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా తనకు అనారోగ్యంగా ఉందని వంశీ కోర్టుకు విన్నవించుకున్నారు. ఊపిరి తీసుకోవడానికి తీవ్ర ఇబ్బంది పడుతున్నానని కోర్టుకు వివరించారు.

రేపటి వరకు రిమాండ్ పొడిగింపు

ఈ నేపథ్యంలో వల్లభనేని వంశీని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించాలని కోర్టు పోలీసులను ఆదేశించింది. వల్లభనేని వంశీ ఆరోగ్య పరిస్థితిపై మెమో దాఖలు చేయాలని అతడి న్యాయవాదిని కోర్టు ఆదేశించింది. వల్లభనేని వంశీ రిమాండ్‌ను రేపటి వరకు కోర్టు పొడిగించింది. ఈ కేసులో వంశీకి బెయిల్ మంజూరు చేసింది.

బండారు.సత్యప్రసాద్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలు, పొలిటికల్ వార్తలను రాస్తారు. అలాగే ఆరోగ్యం, విద్యా ఉద్యోగ, లైఫ్ స్టైల్ వార్తలు రాస్తారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజం(MJMC) పీజీ చేశారు. గతంలో ఈటీవీ భారత్, ఇన్ షార్ట్స్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు. సత్యప్రసాద్ 2023లో హెచ్.టి.తెలుగులో చేరారు.

సంబంధిత కథనం