Nara Bhuvaneswari: బాబుతో ములాఖత్‌కు భువనేశ్వరికి దక్కని అనుమతి-bhuvaneshwari is not allowed to mulakat with babu ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Nara Bhuvaneswari: బాబుతో ములాఖత్‌కు భువనేశ్వరికి దక్కని అనుమతి

Nara Bhuvaneswari: బాబుతో ములాఖత్‌కు భువనేశ్వరికి దక్కని అనుమతి

HT Telugu Desk HT Telugu
Sep 15, 2023 08:16 PM IST

Nara Bhuvaneswari: టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు రిమాండ్‌ ఖైదీగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో అడుగుపెట్టి ఐదు రోజులు గడిచిపోయాయి. శుక్రవారం బాబుతో భేటీకి భువనేశ్వరి దరఖాస్తును జైలు అధికారులు తిరస్కరించారు.

బాబుతో ములాఖత్‌కు భువనేశ్వరి దరఖాస్తు తిరస్కరణ
బాబుతో ములాఖత్‌కు భువనేశ్వరి దరఖాస్తు తిరస్కరణ

Nara Bhuvaneswari: రాజమండ్రి సెంట్రల్ జూలెలో ఉన్న చంద్రబాబును పరామర్శించేందుకు బాబు సతీమణి భువనేశ్వరి చేసుకున్న దరఖాస్తును జైళ్ల శాఖ అధికారులు తిరస్కరించారు. వారానికి మూడుసార్లు ములాఖత్‍కు అవకాశం ఉన్నా తిరస్కరించారని టీడీపీ నాయకులు ఆరోపించారు. చంద్రబాబు అరెస్టు తర్వాత రాజమండ్రిలోనే ఉంటున్న నారా భువనేశ్వరి 12వ తేదీన బాబుతో భేటీ అయ్యారు. గురువారం మరోమారు ఆమె చంద్రబాబును కలిసేందుకు దరఖాస్తు చేసుకున్నారు. ఆమె దరఖాస్తును జైళ్ల శాఖ అధికారులు తిరస్కరించారు. ములాఖత్‍పై సైతం ప్రభుత్వం అవమానీయంగా వ్యవహరిస్తోందని భువనేశ్వరి ఆరోపించారు. నిబంధనల ప్రకారం ములాఖత్ ఇచ్చేందుకు అవకాశం ఉన్నా కాదనడంపై భువనేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు.

చంద్రబాబుతో భేటీ అయ్యేందుకు సెప్టెంబర్‌ 14వ తేదీన భువనేశ్వరి ములాఖత్‌ కోసం దరఖాస్తుకు చేసుకున్నారు. గురువారం చంద్రబాబుతో పవన్ కళ్యాణ్‌, బాలకృష్ణ, లోకేష్ భేటీ అయ్యారు. శుక్రవారం బాబుతో భేటీ అయ్యేందుకు భువనేశ్వరి గురువారమే దరఖాస్తు చేసుకున్నారు. అయితే నిబంధనల ప్రకారశం ఆమె దరఖాస్తును తిరస్కరించారు.

రిమాండ్ ఖైదీలకు వారానికి రెండు ములాఖత్‌లకు మాత్రమే అనుమతిస్తారని జైళ్ల శాఖ డిఐజి స్పష్టం చేశారు. ఒక ములాఖత్‌లో ముగ్గురిని మాత్రమే రిమాండ్‌ ఖైదీతో భేటీ అయ్యేందుకు అనుమతిస్తారని స్పష్టం చేశారు.

చంద్రబాబు నాయుడును ఈ నెల 11వ తేదీన ఖైదీగా అడ్మిట్ చేసుకున్నారని, 12వ తేదీన నారా లోకేష్‌, భువనేశ్వరి, నారా బ్రహ్మణి ఆయనతో భేటీ అయ్యారని జైళ్ల శాఖ అధికారులు వివరించారు. 14వ తేదీన పవన్ కళ్యాణ్‌, బాలకృష్ణ, లోకేష్ భేటీ అయ్యారని వారంలో రెండు ములాఖత్‌లు పూర్తయ్యాయని డిఐజి వివరణ ఇచ్చారు.

అత్యవసర కారణాలతో ఎవరైనా సందర్శకులు రిమాండు ఖైదీలతో మాట్లాడటానికి లిఖితపూర్వకంగా అనుమతి కోరితే ఆ కారణాలను పరిశీలించుకుని, జైలు సూపరింటెండెంట్ విచక్షణాధికారాల ఆదారంగా మూడో ములాఖత్ మంజూరు చేస్తారని వివరించారు. భువనేశ్వరి దరఖాస్తులో అత్యవరస కారణాలు లేకపోవడంతో మూడో ములాఖత్‌కు అనుమతించ లేదన్నారు. దీనిపై కొన్ని పత్రికల్లో దుష్ప్రచారం చేస్తున్నారని జైళ్ల శాఖ అధికారులు వివరణ ఇచ్చారు.

Whats_app_banner