డిసెంబర్ 15 నుంచి 19 వరకు భవాని దీక్ష(Bhavani Deeksha)ల విరమణ ఉంటుందని దుర్గగుడి ఈవో భ్రమరాంబ ప్రకటించారు. భవానీ దీక్షల విరమణకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టుగా చెప్పారు. విరమణలకు 7 లక్షల మంది భవానీ భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. 15వ తేదీ ఉదయం 6 గంటల నుంచి దీక్షల విరమణ మెుదలుకానుంది. ఈ మేరకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు భ్రమరాంబ తెలిపారు. ఉదయం 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు భక్తులకు అమ్మవారి దర్శనం కల్పిస్తారు,డిసెంబరు 15న భవానీ దీక్ష(Bhavani Deeksha) విరమణ మొదటి రోజున ఉదయం 6 గంటలకు హోమగుండ అగ్నిప్రతిష్టతో అమ్మవారి దర్శనం ప్రారంభమవుతుందని, డిసెంబర్ 19న ఉదయం 6:30 గంటలకు మహా పూర్ణాహుతి నిర్వహిస్తామని ఈఓ తెలిపారు. గతంతో పోల్చితే ఈ ఏడాది భక్తులు ఎక్కువగా వస్తారని భ్రమరాంబ అన్నారు. భక్తులు ఘాట్‌రోడ్డుపై క్యూలైన్లలో వచ్చి హోమ గుండం వద్దకు చేరుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు.,భక్తుల సౌకర్యార్థం రూ.100, రూ.300, రూ.500 టిక్కెట్ల(Tickets)ను అందుబాటులో ఉంచుతున్నట్లు ఆమె తెలిపారు. రూ.500 టిక్కెట్లతో భక్తుల కోసం VMC హోల్డింగ్ ఏరియా మరియు మోడల్ గెస్ట్ హౌస్ నుండి బస్సు సౌకర్యం అందుబాటులో ఉంటుంది. వారు ఓం టర్నింగ్ వద్ద ప్రత్యేక క్యూ లైన్ ద్వారా దర్శనం చేసుకోవచ్చు.,భక్తులు(Devotees) అధిక సంఖ్యలో వస్తుండటంతో అన్నదానం ప్యాకెట్ల రూపంలో ఉంటుంది. కనకదుర్గానగర్‌లో 10, బస్టాండ్‌లో ఒకటి, రైల్వేస్టేషన్‌లో ఒకటి చొప్పున ప్రసాదం కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు 20 లక్షల లడ్డూలను సిద్ధం చేస్తున్నామని, 15 లక్షల వాటర్ ప్యాకెట్లను ఏర్పాటు చేశామని ఈవో వివరించారు.,సీతమ్మవారి పాదాలు, భవానీ ఘాట్(Bhavani Ghat), పున్నమి ఘాట్‌లలో మూడు షిప్టులలో 800 మందికి పైగా క్షురకులు భవానీ భక్తుల కోసం అందుబాటులో ఉంటారని ఈఓ తెలిపారు. స్నానాలు చేసేందుకు షవర్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్టాళ్లలో భక్తులు తమ దుస్తులను విడిచిపెట్టాలని కోరారు. వీఎంసీ ఉచితంగా క్లోక్ రూమ్‌ను అందుబాటులోకి తెస్తుంది.,భక్తుల సౌకర్యార్థం డీఎంఅండ్‌హెచ్‌ఓ 20 వైద్య శిబిరాలను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఉన్న 200 సీసీ కెమెరాలకు(CC Camera) అదనంగా 57 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. కలెక్టర్ కార్యాలయం, కంట్రోల్ రూం, మోడల్ గెస్ట్ హౌస్ నుంచి నిరంతర పర్యవేక్షణ ఉంటుంది.