బంగాళాఖాతంలో విస్తరించిన ఉపరిత ఆవర్తనం.. ఏపీలో విస్తారంగా వర్షాలు-bay of bengal circulation triggers widespread ap rains heavy downpour expected in coastal areas ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  బంగాళాఖాతంలో విస్తరించిన ఉపరిత ఆవర్తనం.. ఏపీలో విస్తారంగా వర్షాలు

బంగాళాఖాతంలో విస్తరించిన ఉపరిత ఆవర్తనం.. ఏపీలో విస్తారంగా వర్షాలు

Sarath Chandra.B HT Telugu

పశ్చిమ మధ్య బంగాళాఖాతం సముద్రాన్ని ఆనుకుని ఉన్న దక్షిణ కోస్తా, రాయలసీమ మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఆగ్నేయ బంగాళాఖాతం నుండి ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక వరకు విస్తరించిన ద్రోణి ప్రభావంతో ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.నేడు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది.

ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఏపీలో విస్తారంగా వర్షాలు (Unsplash)

ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత రెండు రోజులుగా ఉరుములతో కూడిన భారీ వర్షాలతో కోస్తా జిల్లాలు తడిచి ముద్దవుతున్నాయి. పశ్చిమమధ్య బంగాళాఖాతంను ఆనుకుని ఉన్న దక్షిణ కోస్తా,రాయలసీమ మీదుగా ఉపరితల ఆవర్తనం వ్యాపించి ఉంది.

ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో ఏపీలో నేడు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. బుధ, గురువారాల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మేఘావృతమైన వాతావరణంతో పాటు భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది.గంటకు 40-50కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ అయ్యాయి.

కంట్రోల్‌రూమ్‌ల ఏర్పాటు..

భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో అత్యవసర సహాయం,సమాచారం కోసంవిపత్తుల నిర్వహణ సంస్థలోని కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్స్ అందుబాటులో ఉంటాయి. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది ఎదురైనా 1070, 112, 18004250101 నంబర్లను సంప్రదించాలని అధికారులు సూచించారు.

గత ఏడాది రుతుపవనాలు సాధారణం కంటే రెండు రోజులు ముందుగా మే 30న కేరళ తీరాన్ని తాకాయి. కేరళ తీరం, ఈశాన్య ప్రాంతాలను ఒకేసారి నైరుతి తాకడం చాలా అరుదైన విషయమని వాతావరణ శాఖ నిపుణులు వివరిస్తున్నారు. గతంలో 2017లోనూ ఇలాంటి సందర్భమే చోటుచేసుకుంది.

ఐఎండీ ప్రకారం 2009లో మే 23న రుతుపవనాలు కేరళను తాకాయి. ఈ సారి అంచనాలకు అనుగుణంగా 24న కేరళలోకి నైరుతు నైరుతి ప్రవేశిస్తే 2009 తర్వాత అత్యంత వేగంగా రుతుపవనాలు రావడం ఇదే తొలిసారి అవుతుంది.

రాష్ట్రానికి అతి భారీ వర్ష సూచన..

మరోవైపు అరేబియా సముద్రంలో గురువారం అల్పపీడనం ఏర్పడుతుందని అంచనా వేస్తున్నారు. ఇటు బంగాళాఖాతంలో దక్షిణ కోస్తాంధ్ర, ఉత్తర తమిళనాడును ఆనుకుని ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. వీటి ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బుధ, గురువారాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచన వేస్తోంది.

బుధవారం డా. బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, కాకినాడ, కృష్ణా, పశ్చిమ గోదావరి, నంద్యాల, వైఎస్సార్ జిల్లాల్లో అతి భారీ వర్షాలకు అవకాశముందని ఐఎండీ ప్రకటించింది.

బుధవారం అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తారు వర్షాలు కురుస్తాయని ప్రకటించారు.

ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తారు వర్షాలు పడనున్నాయి. కర్నూలు, వైఎస్సార్ తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తారు వర్షాలు పడతాయి,.

మిగతా జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశంపశ్చిమ మధ్య బంగాళాఖాతం మరియు దానిని ఆనుకుని ఉన్న దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ మీదుగా సముద్ర మట్టానికి సగటున 1.5 & 5.8 కి.మీ ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని, దీనిపైగా ఆగ్నేయ బంగాళాఖాతం నుండి ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక వరకు ద్రోణి విస్తరించి ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది.

గురువారం) అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. మిగతా జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందన్నారు.

సోమవారం ఉదయం 8.30గంటల నుంచి మంగళవారం ఉదయం 8.30గంటల వరకు బాపట్ల జిల్లా కూచినపూడిలో 78.2మిమీ, విశాఖ రూరల్లో 75.5మిమీ, కృష్ణా జిల్లా ఘంటశాలలో మిమీ, కాకినాడ రూరల్లో 61.7మిమీ, విశాఖ జిల్లా ఎండాడలో 61.5మిమీ వర్షపాతం నమోదైంది..

మంగళవారం సాయంత్రం 5 గంటల నాటికి కాకినాడ జిల్లా కరపలో 65.2మిమీ, చిత్తూరు జిల్లా కటికపల్లిలో 53మిమీ, కోనసీమ జిల్లా మండపేటలో 48.7మిమీ, కాకినాడ జిల్లా ఆర్యావటంలో 46.2మిమీ మధ్యకొంపలులో 44.5మిమీ వర్షపాతం రికార్డైంది.

శరత్‌ చంద్ర హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగు న్యూస్‌ ఎడిటర్‌గా ఉన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ హోదాల్లో 2001 నుంచి పని చేస్తున్నారు. జర్నలిజంలో నాగార్జున యూనివర్శిటీ నుంచి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. గతంలొ ఈనాడు, ఎన్‌టీవీ, టీవీ9, హెచ్‌ఎంటీవీ, టీవీ5లలో వివిధ హోదాలలో విజయవాడ, హైదరాబాద్‌, ఢిల్లీలలో పనిచేశారు. 2022లో హెచ్‌టీ తెలుగులో చేరారు. ఇక్కడ ఏపీ తెలంగాణకు సంబంధించిన వర్తమాన అంశాలు, బ్యూరోక్రసీ, రాజకీయ వార్తలు, క్రైమ్ వార్తలను అందిస్తారు.

సంబంధిత కథనం