Bapatla Kendriya Vidyalaya: బాపట్ల కేంద్రీయ విద్యాలయ సైన్స్ ల్యాబ్ లో ప్రమాదం, 24 మంది విద్యార్థులకు అస్వస్థత
Bapatla Kendriya Vidyalaya : బాపట్ల కేంద్రీయ విద్యాలయలో శనివారం ప్రమాదం జరిగింది. సైన్స్ ల్యాబ్ లో రసాయన వాయువులు విడుదలయ్యాయి. ఈ వాయువులు పీల్చి 24 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వారిని బాపట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Bapatla Kendriya Vidyalaya: బాపట్ల కేంద్రీయ విద్యాలయలో ప్రమాదం జరిగింది. శనివారం సైన్స్ ల్యాబ్ లో ప్రమాదకర వాయువులు విడుదలయ్యాయి. ఈ ఘటనలో ల్యాబ్ లో ఉన్న 24 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వాయువుల తీవ్రతకు ఊపిరి ఆడకపోవడంతో విద్యార్థులు బయటకు పరుగులు తీశారు. ప్రమాదకర వాయువులు పీల్చడంతో కొందరు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వారిని ఉపాధ్యాయులు బాపట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విద్యార్థులకు వైద్యులు చికిత్స ఉందిస్తున్నారు.
సైన్స్ ల్యాబ్ లో ప్రయోగం-విద్యార్థులకు అస్వస్థత
బాపట్ల జిల్లా సూర్యలంకలోని కేంద్రీయ విద్యాలయలో 24 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. సైన్స్ ల్యాబ్‌లో ఓ రసాయన వాయువు పీల్చి విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు ఓ కెమికల్ పౌడర్ కారణమని బాధిత విద్యార్థులు చెబుతున్నారు. విద్యార్థులను బాపట్ల ఏరియా ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న బాపట్ల జిల్లా జాయింట్ కలెక్టర్ బి.సుబ్బారావు ఆసుపత్రిలో విద్యార్థులను పరామర్శించారు. ఈ ఘటన ఎలా జరిగిందన్న విషయంపై అధికారులను ఆరా తీస్తున్నారు. కాఫీ పౌడర్, చక్కెరతో పాటు సోడియం, ఇతర కెమికల్స్ కలిపిన రసాయనాన్ని ఓ విద్యార్థి సహచర విద్యార్థులకు వాసన చూపించాడని దీంతో విద్యార్థులు ఉన్నట్టుండి అస్వస్థతకు గురయ్యారని తెలుస్తోంది.
బాపట్ల కేంద్రీయ విద్యాలయ ప్రమాదంపై సీఎం చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. సైన్స్ ల్యాబ్‌లో విద్యార్థులు రసాయనాలు మిక్స్ చేసిన సమయంలో వాయువుల విడుదలతో విద్యార్థులకు అస్వస్థతకు గురైనట్లు అధికారులు సీఎంకు తెలిపారు. పిల్లల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసిన సీఎం చంద్రబాబు...ఘటనపై సంబంధిత అధికారులతో మాట్లాడారు. విద్యార్థులకు ప్రాణాపాయం లేదని, తగిన వైద్యం అందిస్తున్నామని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు.
అపోలో వర్సిటీలో విద్యార్థులకు అస్వస్థత
చిత్తూరులోని అపోలో మెడికల్ యూనివర్సిటీ, నర్సింగ్ కళాశాల విద్యార్థులు ఫుడ్ పాయిజన్ తో అస్వస్థతకు గురైయ్యారు. బుధవారం అపోలో మెడికల్ యూనివర్సిటీలో మెడికల్, నర్సింగ్ విద్యార్థులు ఒకరి తరువాత ఒకరు వాంతులు, విరోచనాలతో అస్వస్థతకు గురికావడంతో వారికి ప్రాథమిక వైద్యం అందించి చిత్తూరు ప్రభుత్వ, జిల్లా ఆసుపత్రికి తరలించారు. విద్యార్థులకు పుడ్ పాయిజన్ అయిందని తెలుసుకున్న వారి తల్లిదండ్రులు, బంధువులు అసుపత్రి వద్దకు చేరుకొని తమ పిల్లల పరిస్థితిపై ఆరా తీశారు. బర్డ్ డే ఫంక్షన్ కు వెళ్లిన విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని అపోలో యాజమాన్యం తెలిపింది. అపోలో యూనివర్సిటీలో 12 వందల మంది విద్యార్థులు ఉన్నారని, వారు క్యాంటిన్‌లో భోజనం చేశారని మిగిలిన వారికి బాగానే ఉందని, 25 మంది మాత్రమే వాంతులు విరోచనాలు చేసుకున్నట్లు తెలిపారు. అయితే అస్వస్థతకు గురైన విద్యార్థులు తాము ఎలాంటి పార్టీకి వెళ్లలేదని అపోలో క్యాంటిన్‌లో తిన్న ఆహారం వల్లే పుడ్‌పాయిజన్ అయిన్నట్లు తెలిపారు.
సంబంధిత కథనం