Bank Of Baroda Recruitment 2024 : బ్యాంక్ ఆఫ్ బరోడాలో 592 ఉద్యోగ ఖాళీలు, దరఖాస్తులు ప్రారంభం-నవంబర్ 19 లాస్ట్ డేట్
Bank Of Baroda Recruitment 2024 : బ్యాంక్ ఆఫ్ బరోడాలో 592 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన అభ్యర్థులు నవంబర్ 19వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలి. షార్ట్ లిస్టింగ్, వ్యక్తిగత ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
బ్యాంక్ ఆఫ్ బరోడాలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి అక్టోబర్ 30న నోటిఫికేషన్ విడుదలైంది. దేశ వ్యాప్తంగా ఉన్న బ్యాంక్ ఆఫ్ బరోడా కార్యాలయాల్లో 592 ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించింది. అర్హులైన అభ్యర్థులు నవంబర్ 19 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులు ఫైనాన్స్, ఎంఎస్ఎంఈ బ్యాంకింగ్, డిజిటల్ గ్రూప్, రిసీవబుల్స్ మేనేజ్‌మెంట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కార్పొరేట్ ఇన్‌స్టిట్యూషనల్ క్రెడిట్ వంటి వివిధ విభాగాలలో పనిచేయాల్సి ఉంటుంది.
బ్యాంక్ ఆఫ్ బరోడా రిక్రూట్‌మెంట్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ అక్టోబర్ 30న ప్రారంభం అయ్యింది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://www.bankofbaroda.in/ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా బిజినెస్ ఫైనాన్స్ మేనేజర్, ఎంఎస్ఎంఈ రిలేషన్షిప్ మేనేజర్, ఏఐ హెడ్, మార్కెటింగ్ ఆటోమేషన్ హెడ్, టెస్టింగ్ స్పెషలిస్ట్, డేటా ఇంజినీర్, యూఐ,యూఎస్ డిజైనర్, ఎంఎన్సీ సీనియర్ రిలేషన్షిప్ మేనేజర్, కార్పొరేట్ బ్యాంకింగ్ ప్రోడక్ట్ మేనేజర్ మొదలైన పోస్టుల కోసం బీవోబీ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అభ్యర్థులు భారతదేశంలో ఎక్కడైనా తమ సేనలు అందించేందుకు సిద్ధంగా ఉన్న మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని బ్యాంక్ ఆఫ్ బరోడా సూచించింది. మొత్తం ఖాళీల్లో ఏపీలో 9 చోట్ల, తెలంగాణలో 7 చోట్ల ఖాళీలు ఉన్నాయి.
ముఖ్యమైన తేదీలు
- నోటిఫికేషన్ విడుదల- అక్టోబర్ 30, 2024
- ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ తేదీలు - అక్టోబర్ 30 నుంచి నవంబర్ 19 వరకు
- దరఖాస్తు ఫీజు చెల్లింపునకు చివరి తేదీ - నవంబర్ 19, 2024
ఖాళీలు- 592
- ఎంఎస్ఎంఈ బ్యాంకింగ్ - 140
- డిజిటల్ గ్రూప్- 139
- రిసీవబుల్ మేనెజ్మెంట్ - 202
- ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ- 31
- కార్పొరేట్, క్రెడిట్ విభాగం -79
- ఫైనాన్స్- 1
అర్హతలు
- కనీస విద్యా అర్హత -గ్రాడ్యుయేషన్ డిగ్రీ
- వయో పరిమితి - పోస్టులను బట్టి వయోపరిమితి మారుతూ ఉంటుంది.
దరఖాస్తు రుసుము
- జనరల్/ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు- రూ. 600
- ఎస్టీ,ఎస్సీ, పీడబ్ల్యూడీ,మహిళలు -రూ. 100
సెలక్షన్
- షార్ట్ లిస్టింగ్, వ్యక్తిగత ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
యూనియన్ బ్యాంక్ లో 1500 ఖాళీలు
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 1500 పోస్టుల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ విడుదలైంది. దేశంలోని వివిధ శాఖలలో లోకల్ బ్యాంక్ ఆఫీసర్స్(ఎల్బీవో) పోస్టులను భర్తీ చేయనున్నారు. బ్యాంకింగ్ రంగంలో పనిచేయాలనుకునే ఆశావహులకు యూనియన్ బ్యాంక్‌లో ఎల్బీవో నోటిఫికేషన్ ఉత్తమ అవకాశం. ఎల్బీవో ఆన్ లైన్ దరఖాస్తుకు యూబీఐ అధికారిక వెబ్‌సైట్ www.unionbankofindia.co.in ను సందర్శించాలి. అభ్యర్థులు నవంబర్ 13, 2024 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ముఖ్య వివరాలు
- యూబీఐ అధికారిక వెబ్‌సైట్- www.unionbankofindia.co.in
- ఖాళీలు- 1500 (UR-613, SC- 224, ST- 109, OBC- 404, EWS- 150)
- దరఖాస్తు రిజిస్ట్రేషన్ తేదీలు- 24 అక్టోబర్ నుంచి 13 నవంబర్ వరకు
- విదార్హత - గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్,
- వయస్సు పరిమితి- 20 నుంచి 30 సంవత్సరాలు (01/10/2024 నాటికి)
- దరఖాస్తు రుసుము - జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీలకు- రూ. 850
- ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు- రూ. 175
- ఎంపిక ప్రక్రియ - రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్ /దరఖాస్తుల స్క్రీనింగ్/ లేదా వ్యక్తిగత ఇంటర్వ్యూ, భాషా ప్రావీణ్యత పరీక్ష
సంబంధిత కథనం