Loan Apps Case : కమిషన్లపై బ్యాంకు ఖాతాలు…. కటకటాల్లోకి ఖాతాదారులు-bank accounts sold on commission base to illegal loan app criminals ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Bank Accounts Sold On Commission Base To Illegal Loan App Criminals

Loan Apps Case : కమిషన్లపై బ్యాంకు ఖాతాలు…. కటకటాల్లోకి ఖాతాదారులు

HT Telugu Desk HT Telugu
Oct 04, 2022 10:57 AM IST

Loan Apps Case లోన్ యాప్‌ అక్రమ వ్యవహారాల్లో మరో చీకటి కోణం వెలుగు చూసింది. అక్రమ వడ్డీ వసూళ్లకు బ్యాంకు ఖాతాలను అప్పగించిన పలువురిని ఏలూరు జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉంటూ లోన్ యాప్స్ ద్వారా అమాయకుల్ని వేధిస్తున్న ముఠాలు తమ లావాదేవీల కోసం స్థానికుల బ్యాంకు ఖాతాలను వినియోగిస్తున్నాయి. నెట్‌ బ్యాంకింగ్‌, ఏటిఎం కార్డుల్ని నిందితులకు అప్పగించినందుకు కమిషన్ తీసుకుంటున్న పలువురిని గుర్తించి అరెస్ట్ చేశారు.

బ్యాంకు ఖాతాలను దుర్వినియోగం చేసిన నిందితుల్ని అరెస్ట్ చేసిన ఏలూరు పోలీసులు
బ్యాంకు ఖాతాలను దుర్వినియోగం చేసిన నిందితుల్ని అరెస్ట్ చేసిన ఏలూరు పోలీసులు

Loan Apps Case లోన్‌ యాప్‌ వ్యవహారాల్లో తవ్వే కొద్దీ మోసాలు వెలుగు చూస్తున్నాయి. లాక్‌డౌన్‌ సమయంలో మొదలైన ఈ ఆన్‌లైన్‌ రుణాల దందా వ్యవస్థీకృత నేరంగా విస్తరించినట్లు పోలీసులు గుర్తించారు.

ట్రెండింగ్ వార్తలు

ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్ లో లోన్ యాప్ మోసాలపై నమోదు చేసిన కేసులో ఐదుగురు ముద్దాయిలను అరెస్టు చేశారు. ఏలూరు మండలం గుడివాడలంక గ్రామానికి చెందిన అప్పలభక్తుల నాగేంద్ర మూర్తి అనే ఆర్ఎంపీ డాక్టర్ ఇచ్చిన ఫిర్యాదులో తన యొక్క అవసరాల కోసం 14 లోన్ యాప్ లను తన ఆండ్రాయిడ్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకుని లోన్ యాప్ ద్వారా 46,846 లను లోన్ తీసుకున్నట్లు దానిపై లోన్ యాప్ లలో తను తీసుకున్న డబ్బును మొత్తం చెల్లించినా ఇంకా చెల్లించాలని లోన్ యాప్ నిర్వాహకులు నుండి ఫోటో లు మార్పింగ్ చేస్తూ వేదింపులు గురి చేస్తున్నారని ఫిర్యాదు చేశారు.

తాను తీసుకున్న రుణాలకు 76 సార్లు ఫోన్ పే, పేటీఎం ద్వారా లావాదేవీలలో రూ.3,28,000 చెల్లించినా ఇంకా డబ్బులు కట్టాలని వేధింపులకు గురి చేస్తున్నారని ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశాడు. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసి సదరు కేసులో 4 ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి దర్యాప్తు ప్రారంభించారు. బ్యాంకులలో ఫేక్ లోన్ యాప్ ద్వారా 33 అకౌంట్లలో సుమారు 48 కోట్లు రూపాయలు లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. బ్యాంక్ లావాదేవీలు జరిపిన ఐదుగురిని అదుపులో తీసుకొని విచారించడంతో సోషల్ మీడియా ద్వారా పరిచయమైన వ్యక్తులు తమ యొక్క బ్యాంకు ఖాతాల ద్వారా జరిపే లావాదేవుల కొరకు 0.5 కమిషన్ ఆశగా చూపించి వారి యొక్క బ్యాంక్ అకౌంట్ లలో లోన్ యాప్ లావాదేవీలు జరిపినట్లు అంగీకరించారు.

విశాఖపట్నంకు చెందిన కేతాడి వెంకటేష్, జొమోటోలో పనిచేస్తున్నాడు. వెంకటేష్ తన స్నేహితుడు ద్వారా ఈ లోన్ యాప్ గురించి తెలుసుకొని ఇతని యొక్క బ్యాంక్ హెచ్ డిఎఫ్‌ సి బ్యాంక్ అకౌంట్‌ లోన్ యాప్ నిర్వాహకులకు కమిషన్ కొరకు అప్పగించాడు. హెచ్. డి.ఎఫ్ సి బ్యాంక్ ఖాతాను లోన్ అప్ నిర్వాహకులకు కమిషన్ కొరకు అమ్మినట్లు సదరు ఖాతాలో 1కోటి 63 లక్షలు గుర్తించారు.

హైదరాబాద్‌కు చెందిన కటికి సందీప్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తే సోషల్ మీడియా ద్వారా పరిచయమైన లోన్ యాప్ నిర్వాహకులు తన యొక్క హెచ్ డిఎఫ్ సి బ్యాంక్ అకౌంట్‌ లోన్ యాప్ నిర్వాహకులకు కమిషన్ మీద అమ్మినట్లు సదరు బ్యాంకులో రూ.9లక్షలు గుర్తించారు.

చెన్నైకు చెందిన అరుణ్ బ్యాంక్ అకౌంట్ లో సుమారు 40 లక్షల రూపాయలను గుర్తించారు. తమిళనాడు రాష్ట్రం మధురై పట్నానికి చెందిన నాగ ముత్తు అనే వ్యక్తిని అదుపులోనికి తీసుకొని విచారిస్తే విగ్నేష్ అనే వ్యక్తి ద్వారా ఒక వ్యక్తి పరిచయము అయినట్లు తన యొక్క హెచ్ డి.ఎఫ్.సి బ్యాంక్ ఎకౌంట్ ను లోన్ యాప్ నిర్వహకులకు కమిషన్‌ మీద అప్పగించినట్లు ఒప్పుకున్నాడు. అతని అకౌంట్‌లో 80 లక్షల రూపాయలను గుర్తించారు. మధురైకు చెందిన ఒక వ్యక్తి పై గతములో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కేసు లు ఉన్నట్లు గుర్తించారు.

లోన్ యాప్ ద్వారా డబ్బులు తీసుకుని నిర్వాహకుల నుండి వేధింపులకు గురి అవుతున్న వారు అధైర్య పడకుండా డయల్ 100,112, 8332959175 కు గాని లేదా జిల్లా వాట్స్ యాప్ నెంబర్ 9550351100 కు సమాచారం అందిస్తే బాధితులకు సత్వరమే న్యాయం అందచేస్తామని చెప్పారు.

WhatsApp channel

టాపిక్