ఆగస్టు నెల కోటా శ్రీవారి ఆర్జిత సేవ టిక్కెట్లు విడుదల.. మే 19 నుంచి రిజిస్ట్రేషన్-august quota of srivari arjitha seva tickets released registrations open from may 19th ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  ఆగస్టు నెల కోటా శ్రీవారి ఆర్జిత సేవ టిక్కెట్లు విడుదల.. మే 19 నుంచి రిజిస్ట్రేషన్

ఆగస్టు నెల కోటా శ్రీవారి ఆర్జిత సేవ టిక్కెట్లు విడుదల.. మే 19 నుంచి రిజిస్ట్రేషన్

Sarath Chandra.B HT Telugu

తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్లలో ఆగస్టు నెల కోటా ఈ నెల 19న విడుదల కానున్నాయి.ఆర్జిత సేవల్లో పాల్గొనాలనుకునే భక్తులు ఎలక్ట్రానిక్‌ డిప్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

టీటీడీ ఆగస్టు నెల దర్శనం టిక్కెట్లు విడుదల

ఆగస్టు నెలకు సంబంధించి టీటీడీ టికెట్లు విడుదల అయ్యాయి. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవల్లో భాగంగా ఆగష్టు-2025 కి సంబంధించిన సేవా టిక్కెట్లు ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్లు మే 19 వ తేదీ సోమవారం ఉదయం 10 గంటల నుండి అందుబాటులో ఉంటాయి.

ఆగస్టు నెలలో ఆర్జిత సేవల టిక్కెట్ల కోసం రిజిస్ట్రేషన్లు మే 19వ తేదీ ఉదయం 10 గంటల నుండి 21 ఉదయం 10 గంటల వరకు తెరిచి ఉంటాయి. ఆగష్టు-2025 కి సంబంధించిన కళ్యాణం, ఊంజల్ సేవ, అర్జిత బ్రహ్మోత్సవం మరియు సహస్ర దీపాలంకార సేవ వంటి సేవలకు శ్రీవారి అర్జిత సేవా టిక్కెట్ల కోటా బుకింగ్ కోసం 22వ తేదీ ఉదయం 10:00 గంటల నుండి అందుబాటులో ఉంటాయి.

ఆగష్టు నెలలో తిరుమలలోని శ్రీవారి ఆలయంలో కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం & సహస్ర దీపాలంకార సేవలకు ఆన్‌లైన్ సేవ (వర్చువల్ దర్శనం) కనెక్ట్ చేయబడిన దర్శన కోటా బుకింగ్ కోసం 22వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుంచి అందుబాటులో ఉంటాయి.

  • ఆగష్టు నెలలో తిరుమల అంగప్రదక్షిణం టోకెన్లు బుకింగ్ కోసం 23వ తేదీ ఉదయం 10 గంటల నుండి అందుబాటులో ఉంటాయి.
  • ఆగష్టు నెలలో శ్రీవాణి ట్రస్ట్ కు దర్శనం , వసతి కోటా రూ. 10,000 దాతలకు 23వ తేదీ ఉదయం 11:00 గంటల నుండి అందుబాటులో ఉంటాయి.
  • ఆగష్టు నెలలో సీనియర్ సిటిజన్లు / శారీరకంగా వికలాంగుల కోటా బుకింగ్ కోసం 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుండి అందుబాటులో ఉంటాయి.
  • ఆగష్టు నెలలో స్పెషల్ ఎంట్రీ దర్శనం రూ.300 టిక్కెట్లు బుకింగ్ కోసం 24వ తేదీ ఉదయం 10గంటల నుంచి అందుబాటులో ఉంటాయి.
  • ఆగష్టు నెలలో తిరుమల, తిరుపతి వసతి కోటా బుకింగ్ కోసం 24వ తేదీ మధ్యాహ్నం 03గంటల నుండి అందుబాటులో ఉంటాయి.
  • జూన్ నెలలో శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, తిరుచానూరు ప్రత్యేక ప్రవేశ దర్శనం రూ. 200టిక్కెట్ల బుకింగ్ కోసం 24వ తేదీ ఉదయం 10 గంటల నుండి అందుబాటులో ఉంటాయి.
  • జూన్ నెలలో టీటీడీ స్థానిక దేవాలయాల సేవా కోటా బుకింగ్ టిక్కెట్లు 26వ తేదీ ఉదయం 10 గంటల నుండి అందుబాటులో ఉంటాయి.
  • జూన్ నెలలో సప్త గోవు ప్రదక్షిణ శాల, అలిపిరి శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టిక్కెట్లు 26వ తేదీ ఉదయం 10.00 గంటల నుండి అందుబాటులో ఉంటాయి.

శరత్‌ చంద్ర హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగు న్యూస్‌ ఎడిటర్‌గా ఉన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ హోదాల్లో 2001 నుంచి పని చేస్తున్నారు. జర్నలిజంలో నాగార్జున యూనివర్శిటీ నుంచి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. గతంలొ ఈనాడు, ఎన్‌టీవీ, టీవీ9, హెచ్‌ఎంటీవీ, టీవీ5లలో వివిధ హోదాలలో విజయవాడ, హైదరాబాద్‌, ఢిల్లీలలో పనిచేశారు. 2022లో హెచ్‌టీ తెలుగులో చేరారు. ఇక్కడ ఏపీ తెలంగాణకు సంబంధించిన వర్తమాన అంశాలు, బ్యూరోక్రసీ, రాజకీయ వార్తలు, క్రైమ్ వార్తలను అందిస్తారు.