Vijayawada : విజయవాడ దుర్గగుడి ఛైర్మన్‌పై హత్యాయత్నం-attack on vijayawada kanaka durga temple chairman karnati rambabu ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Vijayawada : విజయవాడ దుర్గగుడి ఛైర్మన్‌పై హత్యాయత్నం

Vijayawada : విజయవాడ దుర్గగుడి ఛైర్మన్‌పై హత్యాయత్నం

Maheshwaram Mahendra Chary HT Telugu
Nov 25, 2023 07:01 AM IST

Vijayawada Kanaka Durga Temple Chairman: విజయవాడ దుర్గ గుడి ఛైర్మన్ కర్నాటి రాంబాబుపై హత్యాయత్నం స్థానికంగా కలకలం రేపింది. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేయగా… రాంబాబు పరిస్థితి నిలకడగా ఉంది.

దుర్గగుడి ఛైర్మన్‌పై హత్యాయత్నం
దుర్గగుడి ఛైర్మన్‌పై హత్యాయత్నం

Vijayawada: దుర్గగుడి చైర్మన్ కర్నాటి రాంబాబుపై హత్యాయత్నం కలకలం రేపింది. గాజు సీసాతో కర్నాటి రాంబాబుపై గుర్తుతెలియని వ్యక్తి దాడి చేశాడు. కడుపులో గాయాలు కావడంతో రాంబాబను వెంటనే ఆసుపత్రి కి తరలించారు. రాంబాబుకు ప్రాణాపాయం లేదని డాక్టర్లు తెలిపారు.

ఏం జరిగిందంటే…?

ఇటీవలే దుర్గగుడి చైర్మన్ కర్నాటి రాంబాబు తండ్రి మరణించాడు. స్మశానంలోని తండ్రి సమాధి వద్ద దీపం పెట్టడానికి వెళ్లాడు రాంబాబు. దీపం పెట్టి కాళ్లు కడుగుతున్న సమయంలో వెనుక నుండి వచ్చి సీసాతో గుర్తితెలియని వ్యక్తి దాడికి దిగాడు. దాడిని పసిగట్టి పక్కకి తప్పించుకోవడం కడుపులో గాజుసీసా పొడుచుకుంది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చైర్మన్ కు ఫోన్ చేసి విజయవాడ నగర సీపీ వివరాలు సేకరించారు.

పోలీసులు ఏం చెప్పారంటే…?

ఈ ఘటనపై విజయవాడ నార్త్ ఏసీపీ రవికాంత్ మాట్లాడారు. “దుర్గగుడి చైర్మన్ పై ఈ రోజు సాయంత్రం దాడి జరిగింది. ఇటీవల కర్నాటి రాంబాబు నాన్న చనిపోగా… ఆయన సమాధి వద్ద ప్రతిరోజు సాయంత్రం దీపం పెట్టేందుకు వెళుతున్నారు. సమాధి క్లిన్ చేసినందుకు దైవసహయం అనే వ్యక్తికి 200 రూపాయలు డబ్బులు ఇచ్చాడు. అదే సమయంలో అక్కడ ఉన్న గుంజ కృష్ణ డబ్బులు అడగటం జరిగింది. కృష్ణకి డబ్బులు తక్కువ ఇచ్చినందుకు దాడి చేశాడు. మద్యం మత్తులో గుంజా కృష్ణ దాడి చేశారు. దాడి చేసిన కృష్ణ పోలీసుల అదుపులో ఉన్నాడు. దాడి చేసిన కృష్ణ అనే వ్యక్తి స్మశానంలో కాటికాపరిగా నివాసం ఉంటున్నాడు ట్రీట్మెంట్ ఇచ్చిన అనంతరం రాంబాబును ఇంటికి పంపించటం జరిగింది” అని పేర్కొన్నారు.

Whats_app_banner