'యోగాంధ్ర - 2025'కు సర్వం సిద్ధం..! విశాఖ వేదికగా 3 లక్షల మందితో యోగా, పూర్తి వివరాలివే-arrangements completed for yoga day in visakhapatnam ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  'యోగాంధ్ర - 2025'కు సర్వం సిద్ధం..! విశాఖ వేదికగా 3 లక్షల మందితో యోగా, పూర్తి వివరాలివే

'యోగాంధ్ర - 2025'కు సర్వం సిద్ధం..! విశాఖ వేదికగా 3 లక్షల మందితో యోగా, పూర్తి వివరాలివే

విశాఖ వేదికగా జరిగే యోగా డే కార్యక్రమానికి ఏపీ సర్కార్ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇందులో ప్రధానమంత్రి మోదీతో పాటు సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. 2 గిన్నీస్ రికార్డులు, మొత్తం 22 ప్రపంచ రికార్డుల సాధనే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని తలెపట్టారు.

యోగా సాధన

విశాఖ వేదికగా శనివారం(జూన్ 21) అంతర్జాతీయ యోగా డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. ఇందుకోసం ఏపీ సర్కార్ ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రధాని మోదీ పాల్గొననున్న నేపథ్యంలో…కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. రెండు గిన్నీస్ రికార్డులు, మొత్తం 22 ప్రపంచ రికార్డుల సాధనే లక్ష్యంగా యోగా డే కార్యక్రమాన్ని తలపెట్టారు. ఇందుకోసం ఏపీ సర్కార్ భారీ ఏర్పాట్లు చేసింది.

యోగా డే కార్యక్రమం - ముఖ్య వివరాలు

  • మొత్తంగా రాష్ట్రవ్యాప్తంగా 2 కోట్ల మంది లక్ష కేంద్రాల్లో యోగా సాధన చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించాలనే లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం ఉంది.
  • 25 వేల మంది గిరిజన విద్యార్ధులు 108 నిముషాల పాటు సూర్య నమస్కారాలు చేస్తారు
  • ఎక్కువ మంది ఒకే చోట చేయడం తో పాటు ఎక్కువ మంది ఒకే సారి సూర్య నమస్కారాలు చేసి రెండు గిన్నీస్ రికార్డులను సాధించడమే లక్ష్యంగా కార్యక్రమం తలపెట్టారు.
  • విశాఖ లోని రామకృష్ణా బీచ్ నుంచి భోగాపురం వరకూ 26 కిలోమీటర్ల మేర విస్తృత ఏర్పాట్లు చేపట్టారు.
  • విశాఖలోని ఆర్కే బీచ్ వేదికగా మొత్తం 3.19 లక్షల మంది ఒకే చోటు నుంచి యోగా చేసేలా ఏర్పాట్లు పూరయ్యాయి.
  • ఏపీలో తలపెట్టిన యోగా డే లో పాల్గొనేందుకు 2.39 కోట్ల మంది రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు.
  • మే 21 తేదీ నుంచి జూన్ 21 వరకూ నెల పాటు యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు.
  • పర్యాటక ప్రాంతాలు, ఇతర ముఖ్యమైన ప్రాంతాలతో పాటు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకూ 15 వేల పైచిలుకు యోగా పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమం నిర్వహణకు 5451 మంది మాస్టర్ ట్రైనర్లు వచ్చారు.
  • నెల రోజుల పాటు నిర్వహించిన వేర్వేరు యోగా కార్యక్రమాలకు సంబంధించి 1,05,58,299 మందికి సర్టిఫికేట్లు కూడా జారీ అయ్యాయి. యోగాలో పాల్గొనే వారందరికీ ఆధార్ తో అనుసంధానించి ప్రతీ ఒక్కరికి క్యూ ఆర్ కోడ్ జారీ చేశారు.
  • యోగా డే లో పాల్గొనే వారందరికీ 3.32 లక్షల టీ షర్టు లు , 5 లక్షల యోగా మ్యాట్ లు సిద్ధం చేశాం.
  • ఉదయం పూట కార్యక్రమం జరుగుతున్న రీత్యా టాయిలెట్ల కు కూడా ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు జరిగాయి. యోగా ఫర్ ఒన్ ఎర్త్ ఒన్ హెల్త్ అనే థీమ్ తో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
  • జూన్ 21 తేదీ ఉదయం 6.30 గంటల నుంచి 8 గంటల వరకూ యోగా డే కార్యక్రమం జరుగుతుందని సీఎం చంద్రబాబు ప్రకటించారు.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.