YS Sharmila: సూపర్ సిక్స్ - సూపర్ ఫ్లాప్.. 'సూపర్ సిక్స్' హామీలకు ఇక శుభం కార్డు పడ్డట్లేనంటున్న షర్మిల-are chandrababus super six promises falling short sharmila raises questions ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ys Sharmila: సూపర్ సిక్స్ - సూపర్ ఫ్లాప్.. 'సూపర్ సిక్స్' హామీలకు ఇక శుభం కార్డు పడ్డట్లేనంటున్న షర్మిల

YS Sharmila: సూపర్ సిక్స్ - సూపర్ ఫ్లాప్.. 'సూపర్ సిక్స్' హామీలకు ఇక శుభం కార్డు పడ్డట్లేనంటున్న షర్మిల

Bolleddu Sarath Chandra HT Telugu
Jan 28, 2025 01:24 PM IST

YS Sharmila: - కూటమి ప్రభుత్వం ఇచ్చిన 'సూపర్ సిక్స్' హామీలకు ఇక శుభం కార్డు పడ్డట్లేనని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ఎద్దేవా చేశారు. చంద్రబాబు ప్రజెంటేషన్ నిదర్శనమని నీతి ఆయోగ్ రిపోర్ట్ ముందుపెట్టి, డబ్బులుంటేనే పథకాలని నీతి సూక్తులు చెప్పారని మండిపడ్డారు.

షర్మిల
షర్మిల

YS Sharmila: .  పథకాలు కావాలంటే ప్రభుత్వ ఆదాయం పెంచాలని  మోకాలికి బోడి గుండుకు ముడిపెట్టినట్లు చంద్రబాబు  తీరు ఉందని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల  మండిపడ్డారు. నమ్మి అధికారం ఇస్తే రాష్ట్ర ప్రజలను ఘోరంగా మోసం చేశారని,50 లక్షల మంది అన్నదాతలను వంచించారని,  80 లక్షల మంది విద్యార్థులకు ద్రోహం చేశారని ఆరోపించారు. 

yearly horoscope entry point

చంద్రబాబు  కోటిన్నర మంది మహిళలను మోసం చేశారని  50 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో ఆటలు ఆడుకున్నారని, పథకాలకు ఆర్థిక వెసులుబాటు లేదని, YCP ప్రభుత్వ ఆర్థిక విధ్వంసమే కారణమని చెబుతున్నారని,  జగన్ ఆర్థిక ఘోరమే నిదర్శనమని చెప్పే బాబు గారు.. ఎన్నికల్లో హామీలు ఇచ్చే ముందు  ఈ ఆర్థిక విధ్వంసం, ఘోరం గురించి తెలియదా అని ప్రశ్నించారు. 

'సూపర్ సిక్స్' పథకాల రూపకల్పనలో చేసేటపుడు  రాష్ట్ర ఆర్థిక భారం కనిపించలేదా అని ప్రశ్నించారు.  రాష్ట్రం రూ.14 లక్షల కోట్ల అప్పుల్లో ఉందని చెబుతున్న చంద్రబాబే  కూటమిని గెలిపిస్తే 100 రోజుల్లో గాడిన పెడతామన్నారని గుర్తు చేశారు. 

ఓట్లు పడ్డాక ఇచ్చిన హామీలపై మడతపేచీ పెట్టడం ఎంతవరకు సమంజసంమని షర్మిల ప్రశ్నించారు.  రాష్ట్రం అప్పుల్లో ఉందని, అప్పులు పుట్టడం లేదని సాకులు వెతకడం మాని పథకాల అమలుపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో పెద్దన్న పాత్ర పోషించే మీరు.. రాష్ట్ర దీనస్థితిపై ప్రధాని మోడీని పట్టుబట్టాలని డిమాండ్ చేశారు. సంక్షేమ  పథకాలకు కావాల్సిన నిధులు ఇవ్వాలని అడగాలని, నీతి ఆయోగ్ చెప్పినట్లుగా గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో జరిగిన ఆర్థిక అరాచకంపై వెంటనే ఉన్నతస్థాయి దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. 

 రాష్ట్రంలో  ఆదాయం ఏ కోటకు మళ్ళిందో తేల్చాలని, పథకాలకు కేంద్ర ప్రభుత్వం డబ్బులివ్వకపోతే వెంటనే బీజేపీకి ఇచ్చిన మద్దతు ఉపసంహరించుకోవాలన్నారు. 

Whats_app_banner