Police constable Criticising CM Jagan: అతను ఏఆర్ కానిస్టేబుల్...! ప్రస్తుత ఎన్టీఆర్ జిల్లా చిల్లకల్లు పరిధిలో విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే పెట్రోలింగ్ విధుల్లో ఉండగా... సీఎంతో పాటు ఆయన కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. జీతాల విషయంలో కానిస్టేబుల్ దూషణలు చేశాడు. ఇదంతా కూడా ఓ వ్యక్తి రికార్డ్ చేయగా... సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇదీ కాస్త ఉన్నతాధికారుల దృష్టికి చేరటంతో... చర్యలు చేపట్టారు. సదరు కానిస్టేబుల్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.,ఏం జరిగిందంటే,,,తన్నీరు వెంకటేశ్వరరావు.. ఏఆర్ కానిస్టేబుల్. ఎన్టీఆర్ జిల్లా చిల్లకల్లు పోలీస్ స్టేషన్ పరిధిలో విధులు నిర్వర్తిస్తున్నాడు. విధుల్లో ఉండగా ఓ రోజు గౌరవరంలో టీ తాగేందుకు ఓ టీస్టాల్ దగ్గర ఆగారు. ఆ సమయంలో టీస్టాల్ వ్యక్తికి, కానిస్టేబుల్‌కు మధ్య సంభాషణ జరిగింది. ఈ సమయంలో సీఎంతో పాటు ఆయన కుటుంబ సభ్యులను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు వెంకటేశ్వరరావు. ఆ వీడియో సోషల్ మీడియాలో కూడా వైరల్ అయ్యింది. వెంకటేశ్వరరావును జీతాలపై టీస్టాల్ వ్యక్తి ప్రశ్నించారు. దీంతో కానిస్టేబుల్ నోటి దురుసుతో బూతులు తిట్టారు. ఇదంతా కూడా ఉన్నతాధికారుల దృష్టికి చేరింది. ,కానిస్టేబుల్ వ్యవహరంపై కేసు నమోదు చేశారు. శుక్రవారం సాయంత్రం జగ్గయ్యపేట న్యాయస్థానంలో హాజరుపర్చారు. ఆయనకు 14 రోజులు న్యాయస్థానం రిమాండ్ విధించడంతో జగ్గయ్యపేట సబ్‌జైలుకు తరలించారు.