AP Jobs : భారీ జీతంతో జర్మనీలో నర్సింగ్ ఉద్యోగాలు, ఇంటర్వ్యూలతో నియామకాలు-అంతా ప్రభుత్వం పరిధిలోనే
AP Jobs : ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో...జర్మనీలో భారీ జీతంతో నర్సింగ్ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. జర్మన్ లాంగ్వేజ్‌పై శిక్షణ ఇచ్చి, ఉద్యోగం కల్పిస్తారు. ఆసక్తి, అర్హత ఉన్నవారు ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చని అధికారులు.
జర్మనీలో భారీ జీతంతో నర్సింగ్ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. జీతం రూ.2.33 లక్షల నుంచి రూ.3.26 లక్షల వరకు ఉంటుంది. జర్మన్ లాంగ్వేజ్‌పై శిక్షణ ఇచ్చి, ఉద్యోగం కల్పిస్తారు. ఆసక్తి, అర్హత ఉన్నవారు ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు. అంతా ప్రభుత్వ పరిధిలోనే నియామక ప్రకియ జరుగుతోంది.
అనంతపురం జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి పీవీ ప్రతాప్ రెడ్డి తెలిపారు. జనరల్ నర్సింగ్ మిడ్వైఫరీ (జీఎన్ఎం), బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసిన నిరుద్యోగ యువతకు జర్మనీలో ఉద్యోగాల అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. దీనికోసం కాషన్ డిపాజిట్ రూ.75 వేలు చెల్లించాల్సి ఉంటుందని, అలాగే ఒరిజనల్ సర్టిఫికేట్లు సమర్పించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. రెసిడెన్షియల్ శిక్షణతో పాటు ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు వీసా ఫీజు, రానుపోను విమాన టిక్కెట్లు చెల్లిస్తామని తెలిపారు.
జర్మనీలో సుమారు రూ.2.33 లక్షల నుంచి 3.26 లక్షల (2,400 యూరోల నుంచి 3,500 యూరోల వరకు) వరకు వేతనం చెల్లిస్తారని పేర్కొన్నారు. జర్మన్ లాంగ్వేజ్‌పై శిక్షణ ఇచ్చిన అనంతరం ఉద్యోగం కల్పిస్తామని తెలిపారు. మరిన్ని వివరాల కోసం 9988853335 ఫోన్ నెంబర్‌ను సంప్రదించాలని సూచించారు.
తిరుపతిలో ట్రైనింగ్
సత్యసాయి జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి హరికృష్ణ కూడా ఈ విషయాన్ని తెలిపారు. బీఎస్సీ నర్సింగ్, జనరల్ నర్సింగ్ మిడ్వైఫరీ పూర్తి చేసిన నిరుద్యోగ యువతకు జర్మనీలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఓఎంసీఏపీ, ఎస్ఎంకేర్ సంయుక్త ఆధ్వర్యంలో శిక్షణ ఎంపికలు ఉంటాయని తెలిపారు. బీఎస్సీ నర్సింగ్, జనరల్ నర్సింగ్ మిడ్వైఫరీ కోర్సు పూర్తి చేసి, 35 ఏళ్ల వయసు ఉన్న వారు, బీఎస్సీ రెండేళ్లు, జీఎన్ఎం మూడేళ్ల అనుభవం ఉన్నవారు అర్హులన్నారు.
తిరుపతిలో ఆరు నెలల పాటు శిక్షణ ఉంటుందని, విద్యార్హత ప్రతాలు సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు. దీనికోసం కాషన్ డిపాజిట్ రూ.75 వేలు చెల్లించాల్సి ఉంటుందని, అలాగే ఒరిజనల్ సర్టిఫికేట్లు సమర్పించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. శిక్షణకు హాజరు కావడం తప్పని సరి అని, మధ్యలో శిక్షణ మానేయడం కుదరదని అన్నారు. మరిన్ని వివరాల కోసం 9676706976 ఫోన్ నెంబర్‌ను సంప్రదించాలని సూచించారు.
డ్రోన్ టెక్నాలజీపై ఉచిత శిక్షణకు దరఖాస్తు ఆహ్వానం
ఆంధ్రప్రదేశ్ స్కిల్ డవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో విశాఖపట్నంలోని కంచరపాలెం పాలిటెక్నిక్ కాలేజీలోని స్కిల్ హబ్‌లో నిరుద్యోగ యువతీ, యువకులకు డ్రోన్ టెక్నాలజీపై ఉచిత శిక్షణ ఇస్తారు. ఈ సర్టిఫికేట్ కోర్సు కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. పదో తరగతి, ఆపై విద్యా అర్హత కలిగిన 18-45 ఏళ్ల వయస్సు కలిగిన వారు ఈ కోర్సులో చేరవచ్చు.
మూడు నెలల పాటు డ్రోన్ మాన్యుఫ్యాక్చరింగ్, అసెంబ్లింగ్ టెక్నీషియన్ కోర్సులో ఉచితంగా శిక్షణ ఇస్తారు. 30 సీట్లు మాత్రమే ఉన్నాయి. అర్హుత, ఆసక్తి ఉన్నవారు నేరుగా కాలేజీలోని సంబంధిత కార్యాలయంలో సంప్రదించి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈనెల 20 నుంచి శిక్షణ తరగతులు ప్రారంభిస్తారు. పూర్తి వివరాల కోసం 7287069457 ఫోన్ నెంబర్‌ను సంప్రదించాలి. కోర్సు పూర్తి చేసుకున్న వారికి టెక్నికల్ ఎడ్యూకేషన్ సర్టిఫికేట్ ఇస్తారు. వీరికి ఉపాధి అవకాశాలపై సహకారం అందిస్తామని నిర్వహకులు డాక్టర్ కె.నారాయణరావు తెలిపారు.
జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు
సంబంధిత కథనం