APSRTC Tour Package : హిందూపురం నుంచి కుంభమేళా, కాశీ, అయోధ్య ట్రిప్ - టికెట్ ధరలు, షెడ్యూల్ వివరాలివే-apsrtc tour package from hindupur to kumbh mela kashi and ayodhya details check here ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Apsrtc Tour Package : హిందూపురం నుంచి కుంభమేళా, కాశీ, అయోధ్య ట్రిప్ - టికెట్ ధరలు, షెడ్యూల్ వివరాలివే

APSRTC Tour Package : హిందూపురం నుంచి కుంభమేళా, కాశీ, అయోధ్య ట్రిప్ - టికెట్ ధరలు, షెడ్యూల్ వివరాలివే

HT Telugu Desk HT Telugu
Published Feb 13, 2025 07:38 PM IST

హిందూపురం నుంచి కుంభ‌మేళా (ప్ర‌యాగ్‌రాజ్‌) కాశీ, అయోధ్య యాత్ర‌కు ఏపీఎస్ఆర్టీసీ సూప‌ర్ ల‌గ్జ‌రీ బ‌స్ స‌ర్వీస్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ యాత్ర దాదాపు 4 వేల కిలో మీట‌ర్ల మేర సాగుతోంది. ఎనిమిది రోజుల పాటు వివిధ పుణ్య‌క్షేత్రాల‌ను ద‌ర్శించుకునే వీలు ఉంటుంది.

ఏపీఎస్ఆర్టీసీ టూర్ ప్యాకేజీ
ఏపీఎస్ఆర్టీసీ టూర్ ప్యాకేజీ

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర రోడ్డు ర‌వాణ సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) పుణ్య‌క్షేత్రాల‌కు కొత్త బ‌స్ స‌ర్వీసుల‌ను ప్రకటించింది. రాష్ట్రంలోని హిందూపురం నుంచి ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని కుంభ‌మేళా (ప్ర‌యాగ్ రాజ్‌) కాశీ, అయోధ్య‌కి సూప‌ర్ ల‌గ్జ‌రీ బ‌స్ స‌ర్వీస్‌ల‌ను తీసుకొచ్చింది.

ప్యాకేజీ వివరాలు….

  • ఈనెల 15, 25 తేదీల్లో బ‌స్సులు బ‌య‌లుదేరుతాయి. యాత్ర ఎనిమిది రోజులు పాటు జ‌రుగుతోంది.
  • హిందూపురంలో బ‌య‌లుదేరే బ‌స్సు హైద‌రాబాద్ చేరుకుంటుంది. అక్క‌డ శంషాబాద్‌లోని చిన్న జీయ‌ర్ స్వామి నిర్మించిన రామానుజాచార్యుల దేవాల‌యం, యాదగిరిగుట్ట న‌ర‌సింహ‌స్వామి దేవ‌స్థానం సంద‌ర్శిస్తారు. ఆ త‌రువాత నిజామాబాద్ స‌రస్వ‌తీ దేవి ఆల‌యం (బాస‌ర‌) సంద‌ర్శ‌న ఉంటుంది.
  • ఆ తర్వాత ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని అల‌హాబాద్‌లోని ప్ర‌యాగరాజ్ చేరుకుంటుంది. అక్క‌డ కుంభ‌మేళాకు హాజ‌రుకావ‌చ్చు. అక్కడ య‌మున‌, స‌ర‌స్వ‌తీ పుణ్య‌న‌దుల స్నానం ఉంటుంది.
  • ఆ తర్వాత అయోధ్య వెళ్తారు. అక్క‌డ శ్రీ‌రామ ద‌ర్శ‌నం, సీతాదేవి ఇల్లు, జ‌న‌క మ‌హారాజ్ కోట సంద‌ర్శ‌నం ఉంటుంది. ఆ త‌రువాత కాశీ (వార‌ణాసి) చేరుకుని శ్రీ కాశీ విశ్వేశ్వ‌రుని ద‌ర్శ‌నం, కాశీ విశాలాక్షి ద‌ర్శ‌నం గంగాన‌ది పుణ్య‌తీర్థ స్నానం, క‌ల‌బైర‌వ ద‌ర్శ‌నం ఉంటుంది.

అయోధ్య‌లో ఒక నైట్, కాశీలో రెండు రాత్రులు బస చేస్తారు. అయితే భోజ‌నం, వ‌స‌తి ఖర్చులు ఎవ‌రిది వారే భ‌రించాల్సి ఉంటుంది. ఏపీఎస్ఆర్టీసీ అందించే ఈ ప్యాకేజీలో ఒక్కొక్క టికెట్ ధ‌ర‌ రూ.9,000 ఉంటుంది. ఆస‌క్తి గ‌ల వారు టిక్కెట్టు కావాల‌నుకుంటే 9440834715 (ఎవీవీ ప్ర‌సాద్‌), 7382861323 నెంబర్లను సంప్ర‌దించాలి. యాత్రికులు ఈ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని డిపో మేనేజ‌ర్ శ్రీ‌కాంత్ తెలిపారు.

రిపోర్టింగ్: జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌ర‌జాపు, హిందూస్తాన్ టైమ్స్ తెలుగు.

Whats_app_banner

సంబంధిత కథనం