APSRTC Discount: సంక్రాంతి స్పెషల్... అలా టికెట్ బుక్ చేస్తే 10 శాతం డిస్కౌంట్-apsrtc to operate special buses for sankranti and provide discount on round trip ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Apsrtc To Operate Special Buses For Sankranti And Provide Discount On Round Trip

APSRTC Discount: సంక్రాంతి స్పెషల్... అలా టికెట్ బుక్ చేస్తే 10 శాతం డిస్కౌంట్

HT Telugu Desk HT Telugu
Nov 30, 2022 11:54 AM IST

APSRTC Sankranti Special:సంక్రాంతికి స్పెషల్ ఆఫర్ ప్రకటించింది ఏపీఎస్ఆర్టీసీ. ప్రత్యేక బస్సులు నడపటంతో పాటు రాయితీని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మేరకు వివరాలను వెల్లడించింది.

ప్రయాణికులకు ఆర్టీసీ గుడ్ న్యూస్
ప్రయాణికులకు ఆర్టీసీ గుడ్ న్యూస్

APSRTC Sankranti Special Offer 2023: సంక్రాంతి పండగ రాబోతుంది. ఈ పండగ వస్తే... ప్రతి పల్లె పండగ శోభను సంతరించుకుంటుంది. ఇక ఏపీలో చెప్పాల్సిన పనే లేదు. సంక్రాంతి అంటే ఏపీ... ఏపీ అంటే సంక్రాంతి అన్నట్లు ఉంటుంది అసలు కథ. వేర్వురు రాష్ట్రాలు, ప్రాంతాల్లో ఉండే వారు కూడా... సొంత ప్రాంతాలకు ప్రయాణం అవుతారు. ఇందుకోసం భారీగా తరలివెళ్తుంటారు. సొంత వాహనాలు ఉన్న వారి పరిస్థితి పక్కన పెడితే... మిగతావారి కష్టాలు చెప్పలేదు. ప్రైవేటు వాహనాలతో పాటు బస్సులే కాకుండా... వివిధ మార్గాల్లో వెళ్తుంటారు. ఈ నేపథ్యంలో ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. గతేడాది మాదిరిగానే స్పెషల్ బస్సులను నడపనుంది. అంతేకాదండోయ్... టికెట్ బుకింగ్స్ పై డిస్కౌంట్ కూడా ప్రకటించింది.

ట్రెండింగ్ వార్తలు

సంక్రాంతి పండగకు ఊరు వెళ్లే వారికి రాయితీని ప్రకటించింది ఆర్టీసీ. రానూపోనూ టిక్కెట్టును ముందుగా బుక్‌ చేసుకుంటే తిరుగు ప్రయాణంలో (ఏసీ, నాన్‌ ఏసీ ఏ బస్సుకైనా) 10 శాతం డిస్కౌంట్‌ ఇవ్వనుంది. ఇక ఈసారి సంక్రాంతికి మాత్రం స్పెషల్‌ బస్సుల్లో 50 శాతం అదనపు చార్జీని వసూలు చేయడం లేదని స్పష్టం చేసింది. గత దసరా సీజనుకు నడిపిన స్పెషల్స్‌కు కూడా ఆర్టీసీ అదనపు చార్జీ వసూలు చేయకుండానే నడిపింది. అది ప్రయాణికుల ఆదరణను చూరగొనడంతో ఆశించిన స్థాయిలో ఆదాయమూ సమకూరింది. దీంతో ఈ సంక్రాంతికి కూడా అదే మాదిరిగా నడపాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం ప్రయాణికులకు ఊరట కలిగించనుంది.

మరోవైపు బుకింగ్స్ ఇప్పటికే షురూ అయ్యాయి. దూరప్రాంతాలకు వెళ్లే వారు కొంతమంది ఇప్పట్నుంచే తమ టిక్కెట్లను బుక్‌ చేసుకుంటున్నారు. రానూపోనూ టిక్కెట్టును ముందుగా బుక్‌ చేసుకున్న వారికి తిరుగు ప్రయాణం చార్జీలో 10 శాతం రాయితీ ఇస్తున్న విషయం తెలిసిన వారు ఆ అవకాశాన్ని చాలా మంది వినియోగించుకుంటున్నారు.

ఆర్టీసీ బస్సుల్లో టిక్కెట్టును https://apsrtconline.in వెబ్‌సైట్‌ ద్వారా ముందుగా బుక్‌ చేసుకోవచ్చు.

WhatsApp channel