APSRTC Mahashivratri Special Buses : మహాశివరాత్రి స్పెషల్.... శైవక్షేత్రాలకు 3,500 ప్రత్యేక బస్సులు
APSRTC Mahashivratri Special Buses : మహాశివరాత్రి సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపనుంది. 99 శైవ క్షేత్రాలకు మొత్తం 3,500 ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంచనుంది. ఈ మేరకు ఏపీఎస్ఆర్టీసీ వివరాలను పేర్కొంది. పలు జిల్లాల్లోని శైవ క్షేత్రాలకు రాకపోకలు సాగిస్తాయని తెలిపింది.

మహాశివరాత్రి సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. భక్తుల కోసం ప్రత్యేక బస్సులను ప్రకటించింది. రాష్ట్రంలోని 99 శైవ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులను నడపనుంది. మొత్తం 3,500 ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయని ఓ ప్రకటనలో పేర్కొంది.
ప్రముఖ శైవక్షేత్రాలకు బస్సులు….
మొత్తం 3500 ప్రత్యేక బస్సులను ప్రకటించింది ఏపీఎస్ఆర్టీసీ. వైఎస్‌ఆర్ కడప జిల్లాలోని 12 శైవక్షేత్రాలకు బస్సులు అందుబాటులో ఉంటాయి. అంతేకాకుండా తిరుపతిలోని తొమ్మిది శైవక్షేత్రాలకు, నెల్లురూ జిల్లాలోని 9 ఆలయాలకు బస్సులు రాకపోకలు సాగించనున్నాయి. సత్యసాయి, నంద్యాల, గుంటూరుతో పాటు మిగతా జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రాలకు బస్సులు ఉంటాయని ఆర్టీసీ అధికారులు తెలిపారు.
మహాశివరాత్రి వేళ రాష్ట్రంలోని శ్రీశైలానికి భారీగా భక్తులు తరలివస్తుంటారు. రాష్ట్రంలోని అన్ని డిపోలతో పాటు తెలంగాణ నుంచి కూడా ప్రత్యేక బస్సులు ఉండనున్నాయి. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా… రద్దీకిని అనుగుణంగా మరిన్ని బస్సులను కూడా నడిపేలా ఆర్టీసీ సిద్ధమవుతోంది. శైవక్షేత్రాలు ఉన్న డిపోలా వద్ద మంచి నీటి సౌకర్యం ఏర్పాటు చేయాలని ఆర్టీసీ ఆదేశించింది. మైక్ సిస్టమ్ ద్వారా ఎప్పటికప్పుడూ సమాచారం అందించాలని సూచించింది. ఈ దిశగా డిపో మేనేజర్లు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.
శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు
- ఫిబ్రవరి 19 నుంచి మార్చి 1 వరకూ శ్రీశైలం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు.
- ఈ నాలుగు రోజులపాటు భక్తులకు ఉచితంగానే లడ్డూ ప్రసాదం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
- క్యూలైన్లలో వేచి ఉండే భక్తులకు మంచినీళ్లు బాటిల్, పాలు, బిస్కెట్లు ఉచితంగా అందజేయనున్నారు.
- శివ దీక్షాపరులకు 19 నుంచి 23 వరకు స్పర్శ దర్శనం కల్పిస్తారు.
- భక్తుల రక్షణ కోసం పాతాళగంగ వద్ద రక్షణ కంచెలు ఏర్పాటు చేస్తున్నారు. మహిళలు దుస్తులు మార్చుకునే గదులు ఏర్పాటు చేస్తున్నారు.
- శివ దీక్ష భక్తుల కోసం ప్రత్యేక క్యూలైన్లను శ్రీశైలం దేవస్థానం ఏర్పాటు చేస్తోంది.
- శ్రీశైలం క్షేత్ర పరిధిలో పార్కింగ్ ప్రదేశాల నుంచి భక్తులను వసతి గృహాలకు, సత్రాలకు తరలించేందుకు ఉచిత మినీ వాహనాలను ఏర్పాటు చేస్తున్నారు. మహాశివరాత్రి రోజున(25, 26 తేదీల్లో)దేవస్థానం టోల్ గేట్ రుసుము లేకుండా ఉచితంగా వాహనాలను అనుమతించనున్నారు.
సంబంధిత కథనం