Arunachalam: హిందూపురం నుంచి అరుణాచలం గిరి ప్రదక్షణకు APSRTC సూపర్ లగ్జరీ బస్ సర్వీస్
Arunachalam: పుణ్యక్షేత్రం అరుణాచలం వెళ్లే భక్తులకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) పుణ్యక్షేత్రం అరుణాచలం గిరి ప్రదక్షణకు స్పెషల్ సర్వీసును వేసింది.
Arunachalam: ఆంధ్రప్రదేశ్‌లోని హిందూపురం నుంచి తమిళనాడులోని అరుణాచలం (తిరువణ్ణామలై)కి ఏపీఎస్ఆర్టీసీ స్పెషల్ సూపర్ లగ్జరీ బస్ సర్వీస్‌ను తీసుకొచ్చింది. ఈ సర్వీస్‌ను యాత్రికులు వినియోగించుకోవాలని ఆర్టీసీ కోరుతోంది. ఇతర ఆధ్యాత్మిక ప్రాంతాల పర్యటన సర్వీసులానే ఈ బస్సు సర్వీస్‌లు కూడా అరుణాచలం సందర్శించేందుకు తీసుకెళ్తుంది.
ఆర్టీసీ నిత్యం కొత్త సర్వీసులను, ప్రత్యేక సర్వీసులను అందుబాటులో తెస్తుంది. డిమాండ్‌ను బట్టీ, ప్రయాణీకులు, యాత్రీకులు అత్యధికంగా వెళ్లే మార్గాలకు అతితక్కువ ధరకు, సురక్షితమైన ప్రయాణాన్ని ఆర్టీసీ అందిస్తుంది. అందులో భాగంగానే ప్రతినెల పౌర్ణమి సందర్భంగా తమిళనాడులోని అరుణాచలం (తిరువణ్ణామలై)కి ఈ బస్సు సర్వీస్‌లు అందుబాటులోకి తెచ్చింది.
ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు సర్వీస్ (పుష్‌బ్యాక్ 2+2) సీట్లతో హిందూపురం నుంచి తమిళనాడులోని అరుణాచలం (తిరువణ్ణామలై) దర్శన యాత్రకు యాత్రికుల కోసం అందుబాటులోకి తెచ్చింది. ప్రతి నెల ఈ సర్వీసు అందుబాటు ఉంటాయి. జూలై 20న గిరి ప్రదక్షణ ఉంటుంది. అందువల్ల జూలై 19 (శుక్రవారం) సాయంత్రం 5 గంటలకు హిందూపురం బస్ కాంప్లక్స్‌లో బస్ ప్రారంభం అవుతుంది. మరుసటి రోజు శనివారం ఉదయం 4 గంటలకు అరుణాచలం చేరుకుంటుంది.
పౌర్ణమి రోజున అరుణాచలంలో గిరి ప్రదక్షణ జరిగిన తరువాత, అరుణాచలేశ్వరుని దర్శనం ఉంటుంది. అనంతరం అదే రోజు సాయంత్రం తిరిగి హిందూపురంకి బస్ బయలు దేరుతుంది. అరుణాచలంలో గిరి ప్రదక్షణ పౌర్ణమి నాడు జూలై 20 (శనివారం)న ఉదయం 5.50 గంటలకు ప్రారంభం అవుతుంది. జూలై 21 (ఆదివారం) న మధ్యాహ్నం 3ః47 నిమిషాలకు ముగుస్తుంది.
టిక్కెట్టు ధర రెండు వైపుల కలిపి ఒక్కరికి రూ.1,320గా ఆర్టీసీ నిర్ణయించింది. టిక్కెట్టు కావాలనుకునేవారు ఈ ఫోన్ నంబర్లు 9440834715 (ఎవీవీ ప్రసాద్), 7382863007, 7382861308లను సంప్రదించాలి. అప్పుడే టిక్కెట్టు బుక్ చేసుకోవడం అవుతుంది. యాత్రికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డిపో మేనేజర్ శ్రీకాంత్ తెలిపారు.
(జగదీశ్వరరావు జరజాపు,హెచ్‌టి తెలుగు)