APSRTC : విశాఖ, కడప నుంచి కుంభమేళాకు సూపర్ లగ్జరీ స్పెషల్ సర్వీసులు.. ప్యాకేజీ వివరాలు ఇవే
APSRTC : మహా కుంభమేళా యాత్రికులకు ఆర్టీసీ గుడ్‌న్యూస్ చెప్పింది. విశాఖ, కడప నుంచి మహా కుంభమేళాకు ప్రత్యేక సర్వీసులను అందుబాటులోకి తెచ్చింది. విశాఖ నుంచి మూడు రోజుల్లో సర్వీసులు అందుబాటులో ఉంటాయి. కడప నుంచి ఒక రోజు మాత్రమే సూపర్ లగ్జరీ సర్వీసులు అందుబాటులోకి తీసుకొచ్చారు.
కుంభమేళాకు వెళ్లే భక్తుల కోసం ఏపీఎస్ ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు నడిపిస్తోంది. విశాఖ, కడప నుంచి ఈ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. ఈ ప్రత్యేక బస్సులను వినియోగించుకోవాలని యాత్రికులను విశాఖపట్నం జిల్లా ప్రజారవాణా అధికారి బి. అప్పలనాయుడు, కడప డీపో మేనేజర్ డిల్లీశ్వరరావు కోరారు.

విశాఖపట్నం నుంచి..
1. మహా కుంభమేళాకు విశాఖపట్నం నుంచి మూడు రోజుల పాటు సూపర్ లగ్జరీ (2+2 పుష్ బ్యాక్) స్పెషల్ సర్వీసులు అందుబాటులోకి తెచ్చారు.
2. ఫిబ్రవరి 4, 8, 12 తేదీల్లో విశాఖపట్నం డిపో నుంచి బస్సులు బయలు దేరుతాయి.
3. మొత్తం ఏడు రోజుల పాటు యాత్ర కొనసాగుతుంది.
4. ప్రయాగరాజ్‌తో పాటు అయోధ్య, వారణాసి వంటి పుణ్యక్షేత్రాల దర్శనం కూడా ఉంటుంది.
5. ప్రయాగరాజ్, కాశీ క్షేత్రాల్లో ఒక రోజు రాత్రి బస ఉంటుంది.
6. టిక్కెట్టు ధర ఒక్కొక్కరికి (పిల్లలు, పెద్దలు) రూ.8,000 ఉంటుంది.
7. వసతి, భోజనం యాత్రికులే చూసుకోవాలి.
8. టికెట్లను వైజాగ్ ఆర్టీసీ కాంప్లెక్స్‌కు వెళ్లి బుక్ చేసుకోవచ్చు. లేదంటే ఆర్టీసీ అధికారిక వెబ్‌సైట్ https://www.apsrtconline.in/oprs-web/guest/home.do?h=1 లో అయిన టిక్కెట్టును బుక్ చేసుకోవచ్చు.
9. అదనపు సమాచారం కోసం 9052227082, 9959225594 ఫోన్ నంబర్లను సంప్రదించాలి.
10. ఒకవేళ 34 మంది గ్రూప్‌గా ఉంటే.. వారికి ఒక బస్సు ఏడు రోజుల యాత్రకు కేటాయిస్తారు.
11. బస్సుకు రూ.2,74,000 చెల్లించాలి.
కడప నుంచి..
1. కడప నుంచి సూపర్ లగ్జరీ (2+2 పుష్ బ్యాక్) స్పెషల్ సర్వీసులు అందుబాటులోకి తెచ్చారు.
2. ఫిబ్రవరి 2 తేదీన ఉదయం 8 గంటలకు కడప డిపో నుంచి బస్సు బయలు దేరుతుంది.
3. మొత్తం ఏడు రోజుల పాటు యాత్ర కొనసాగుతుంది.
4. ప్రయాగరాజ్‌తో పాటు అయోధ్య, వారణాసి వంటి పుణ్యక్షేత్రాల దర్శనం కూడా ఉంటుంది. నాగపూర్, జలబలాపూర్, రేవా, ప్రయాగరాజ్, వారణాసి మీదుగా ఆయోధ్యకు యాత్ర కొనసాగుతుంది.
5. ప్రయాగరాజ్, కాశీ క్షేత్రాల్లో ఒక రోజు రాత్రి బస ఉంటుంది. ఫిబ్రవరి 8న తిరిగి బస్సు కడపకు చేరుకుంటుంది.
6. టిక్కెట్టు ధర ఒక్కొక్కరికి (పిల్లలు, పెద్దలు) రూ. 10,000 ఉంటుంది.
7. టికెట్లను కడప ఆర్టీసీ కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్‌లో బుక్ చేసుకోవచ్చు. లేదంటే ఆర్టీసీ అధికారిక వెబ్‌సైట్ https://www.apsrtconline.in/oprs-web/guest/home.do?h=1 లో అయిన టిక్కెట్టును బుక్ చేసుకోవచ్చు.
(రిపోర్టింగ్- జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)