APSRTC student Special : విద్యార్ధుల కోసం ఏపీఎస్‌ఆర్టీసి ప్రత్యేక బస్సులు…..-apsrtc special services for students residing at vijayawada from raayalaseema region ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Apsrtc Special Services For Students Residing At Vijayawada From Raayalaseema Region

APSRTC student Special : విద్యార్ధుల కోసం ఏపీఎస్‌ఆర్టీసి ప్రత్యేక బస్సులు…..

HT Telugu Desk HT Telugu
Jan 10, 2023 11:40 AM IST

APSRTC student Special సంక్రాంతి సెలవులకు ఇళ్లకు వెళ్లే విద్యార్ధుల కోసం ఏపీఎస్‌ ఆర్టీసి ప్రత్యేక సర్వీసుల్ని నడుపుతోంది. నేటి నుంచి ఆర్టీసి ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటున్నట్లు ప్రకటించారు. జనవరి 18 వరకు ప్రత్యేక సర్వీసుల్ని రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు నడుపుతున్నారు.

సంక్రాంతి పండుగ కోసం ఏపీఎస్‌ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
సంక్రాంతి పండుగ కోసం ఏపీఎస్‌ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

APSRTC student Special సంక్రాంతి సెలవుకు ఇళ్లకు వెళ్లే విద్యార్ధుల కోసం ఏపీఎస్‌ ఆర్టీసి ప్రత్యేక బస్సు సర్వీసుల్ని ప్రారంభించింది. జనవరి 10 నుంచి 18వ తేదీ వరకు సంక్రాంతి ప్రత్యేక బస్సుల్ని నడుపుతున్న ఆర్టీసి విద్యార్ధుల కోసం ప్రత్యేక సర్వీసుల్ని అందుబాటులో ఉంచినట్లు ప్రకటించింది. విజయవాడ నుంచి వివిధ ప్రాంతాలకు సంక్రాంతి సందర్భంగా 950 సర్వీసుల్ని నడుపనున్నారు. విజయవాడలో చదువుకుంటున్న రాయలసీమ విద్యార్ధుల కోసం పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ నుంచి 30 ప్రత్యేక బస్సుల్ని జనవరి 10న అందుబాటులో ఉంచుతున్నారు. రాయలసీమలోని వివిధ ప్రాంతాలకు ఈ ప్రత్యేక సర్వీసులు అందుబాటులో ఉండనున్నాయి.

ట్రెండింగ్ వార్తలు

హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నల నుంచి విజయవాడ రావడానికి, తిరుగు ప్రయాణాలకు ప్రత్యేక బస్సుల్ని ఏర్పాటు చేశారు. రాజమండ్రి, విశాఖపట్నం, అమలాపురం, కాకినాడ ప్రాంతాలకు ప్రత్యేక సర్వీసుల్ని నడుపుతున్నారు. పదో తేదీన హైదరాబాద్‌కు 8 ప్రత్యేక సర్వీసులు, రాజమండ్రికి 30, విశాఖపట్నానికి 10, చెన్నైకు 2, రాయలసీమ ప్రాంతానికి 30, ఇతర ప్రాంతాలకు 20 సర్వీసుల్ని ఏర్పాటు చేశారు.

పదకొండో తేదీన హైదరాబాద్‌కు 30 ప్రత్యేక సర్వీసులు, రాజమండ్రికి 40, విశాఖపట్నానికి 18, చెన్నైకు 3, బెంగుళూరు 2 రాయలసీమ ప్రాంతానికి 10, ఇతర ప్రాంతాలకు 25 సర్వీసుల్ని ఏర్పాటు చేశారు.

పన్నెండో తేదీన హైదరాబాద్‌కు 60 ప్రత్యేక సర్వీసులు, రాజమండ్రికి 50, విశాఖపట్నానికి 20, చెన్నైకు 5, బెంగుళూరు 2 ఇతర ప్రాంతాలకు 25 సర్వీసుల్ని ఏర్పాటు చేశారు.

పదమూడో తేదీ హైదరాబాద్‌కు 45 ప్రత్యేక సర్వీసులు, రాజమండ్రికి 50, విశాఖపట్నానికి 26, చెన్నైకు 7, బెంగుళూరు 2 రాయలసీమ ప్రాంతానికి 10, ఇతర ప్రాంతాలకు 30 సర్వీసుల్ని ఏర్పాటు చేశారు. తిరుగు ప్రయాణాలకు కూడా భారీగా బస్సుల్ని ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌కు మొత్తం 343 సర్వీసులు, రాజమండ్రికి 205 సర్వీసులు, విశాఖపట్నం 130, బెంగళూరు 12, చెన్నై 35, రాయలసీమకు 40, ఇతర ప్రాంతాలకు 185 సర్వీసుల్ని నడుపనున్నారు. మొత్తం 950 సర్వీసులు పండుగ ప్రత్యేక సర్వీసులుగా నడుపుతున్నారు.

ఆర్టీసి బస్సుల్లో పండుగ ప్రయాణాలకు ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయడం లేదని, ఒకేసారి రానుపోను టిక్కెట్లు బుక్ చేస్తే 10శాతం రాయితీ కల్పిస్తున్నట్లు ప్రకటించారు. . ఈ వాలెట్ బుకింగ్‌లకు 5శాతం రాయితీ ఇస్తున్నారని, నలుగురు కుటుంబ సభ్యులకు ఒకేసారి టిక్కెట్ తీసుకుంటే 5శాతం రాయితీ లభిస్తుందని తెలిపారు. 60ఏళ్లు పైబడిన వారికి 25శాతం రాయితీ కల్పిస్తున్నారు.

WhatsApp channel

టాపిక్