తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం క్షేత్రంలో జరుగుతున్న సరస్వతీ నది పుష్కరాలకు ఏపీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సుల్ని ఏర్పాటు చేసింది. సరస్వతీ నది పుష్కరాలకు వెళ్లే భక్తుల కోసంవిజయవాడ నుంచి సూపర్ లగ్జరీ, ఇంద్ర ఏసీ సర్వసుల్ని అందుబాటులోకి తెచ్చింది.
కాళేశ్వరం త్రివేణి సంగమంలో జరుగుతున్న సరస్వతీ నది పుష్కరాలకు విజయవాడ నుంచి వెళ్లే భక్తుల కోసం ఏపీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సుల్ని ప్రకటించింది. గోదావరి, ప్రాణహిత నదులతో పాటు అంతర్వాహినిగా సరస్వతి నది కలిసే త్రివేణి సంగమంలో మే 15 నుంచి 26 వరకు సరస్వతీ పుష్కరాలు జరుగుతాయి.
కాళేశ్వరం, త్రివేణి సంగమ యాత్రలకు విజయవాడ నుంచి ప్రత్యేక బస్సులను నడపుతున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. విజయవాడ ఎన్టీఆర్ బస్ టెర్మినల్ నుంచి ఈ సర్వసులు నడుస్తాయి. మే 16వ తేదీ నుంచి 25 తేదీ వరకు వీటిని నడుపుతారు.
త్రివేణి సంగమం యాత్రకు సూపర్ లగ్జరీ బస్సుల్లో రూ . 1999, ఇంద్ర ఏసీ బస్సులో రూ.2599 టికెట్ ధరగా నిర్ణయించారు. బస్సులో రవాణా ఛార్జీలు మాత్రమే వసూలుచేస్తారు. భోజనం, ఇతర సదుపాయాలను భక్తులే చూసుకోవాల్సి ఉంటుంది.
పుష్కరాలకు వెళ్లాలనుకునే భక్తులు తమ సీట్లను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు. రాష్ట్రంలో ఏ ఆర్టీసీ బుకింగ్ కౌంటర్‌లో అయినా, ఆర్టీసీ ఏజెంట్ల ద్వారా కూడా ఈ టిక్కెట్లను రిజర్వ్ చేసుకోవచ్చు. కనీసం 30మంది గ్రూప్ బుకింగ్ చేసుకుంటే విజయవాడలో వారు కోరుకున్న ప్రాంతం నుంచి బస్సులు ఏర్పాటు చేస్తారు.
ఆర్టీసీ ప్రత్యేక బస్సులు 16వ తేదీన రాత్రి 10 గంటలకు పండిట్ నెహ్రూ బస్ స్టేషన్లో బయలుదేరి ఖమ్మం, వరంగల్, భూపాలపల్లి మీదుగా మరు సటి రోజు ఉదయం 5 గంటలకు కాళేశ్వరం చేరుకుంటాయి.
భక్తులు పుష్కర స్నానం చేసిన తర్వాత ముక్తేశ్వర స్వామి దర్శనం అనంతరం ధర్మపురి లోని లక్ష్మీనరసింహస్వామి, కొండగట్టు ఆంజనేయస్వామి, వేములవాడ రాజన్న ఆలయాలను దర్శించుకొని రాత్రి బస చేయాల్సి ఉంటుంది.
మూడో రోజు ఉదయం వరంగల్ లోని భద్రకాళి దేవాలయం, వేయి స్తంభాల గుడి, రామప్ప ఆలయం, చెరువుల సందర్శన తర్వాత నాలుగో రోజు ఉదయం విజయవా డకు చేరుకుంటాయి. మరిన్ని వివరాలకు 80742 98487, 93903 98475 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
పుష్కరాలకు బస్ టిక్కెట్లను బుక్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం