APSRTC : మహాశివరాత్రికి ఏపీఎస్ఆర్టీసీ స్పెషల్ బస్సులు- రామ‌తీర్థం, పుణ్యగిరి, శ్రీశైలం క్షేత్రాలకు స‌ర్వీసులు-apsrtc special buses for maha shivaratri ramatheertham punyagiri srisailam services ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Apsrtc : మహాశివరాత్రికి ఏపీఎస్ఆర్టీసీ స్పెషల్ బస్సులు- రామ‌తీర్థం, పుణ్యగిరి, శ్రీశైలం క్షేత్రాలకు స‌ర్వీసులు

APSRTC : మహాశివరాత్రికి ఏపీఎస్ఆర్టీసీ స్పెషల్ బస్సులు- రామ‌తీర్థం, పుణ్యగిరి, శ్రీశైలం క్షేత్రాలకు స‌ర్వీసులు

HT Telugu Desk HT Telugu
Updated Feb 19, 2025 04:56 PM IST

APSRTC Special Services : పుణ్యక్షేత్రాలను దర్శించుకునే వారికి ఏపీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని పలు డిపోల నుంచి రామ‌తీర్థం, పుణ్యగిరి, శ్రీశైలం మ‌ల్లన్న క్షేత్రాల‌కు స్పెష‌ల్ బస్సులు న‌డ‌ప‌నున్నారు.

మహాశివరాత్రికి ఏపీఎస్ఆర్టీసీ స్పెషల్ బస్సులు- రామ‌తీర్థం, పుణ్యగిరి, శ్రీశైలం క్షేత్రాలకు స‌ర్వీసులు
మహాశివరాత్రికి ఏపీఎస్ఆర్టీసీ స్పెషల్ బస్సులు- రామ‌తీర్థం, పుణ్యగిరి, శ్రీశైలం క్షేత్రాలకు స‌ర్వీసులు

APSRTC Special Services : భక్తులకు వెళ్లే భ‌క్తుల‌కు ఏపీఎస్ ఆర్టీసీ గుడ్‌న్యూస్ చెప్పింది. విజయగనరం, శ్రీకాకుళం జిల్లాల్లోని వివిధ డిపోల నుంచి వివిధ ఆల‌యాల సంద‌ర్శించేందుకు వీలుగా ఏపీఎస్ఆర్టీసీ స్పెష‌ల్ బ‌స్ స‌ర్వీస్‌ను తీసుకొచ్చింది. పుణ్యక్షేత్రాలు రామ‌తీర్థం, పుణ్యగిరి, శ్రీశైలం మ‌ల్లన్న క్షేత్రాల‌కు స్పెష‌ల్ బస్సులు న‌డ‌ప‌నున్నారు. ఈ స‌ర్వీస్‌ల‌ను యాత్రికులు వినియోగించుకోవాల‌ని ఆర్టీసీ కోరుతోంది. ఇత‌ర ఆధ్యాత్మిక ప్రాంతాల ప‌ర్యట‌న స‌ర్వీసులానే ఈ బ‌స్సు స‌ర్వీస్‌లు కూడా వివిధ ఆల‌యాల‌ను సంద‌ర్శించేందుకు తీసుకెళ్తాయి.

ఆర్టీసీ నిత్యం కొత్త స‌ర్వీసుల‌ను, ప్రత్యేక స‌ర్వీసుల‌ను అందుబాటులో తెస్తుంది. డిమాండ్‌ను బ‌ట్టి, ప్రయాణికులు, యాత్రికులు అత్యధికంగా వెళ్లే మార్గాల‌కు అతి త‌క్కువ ధ‌ర‌కు, సుర‌క్షిత‌మైన ప్రయాణాన్ని ఆర్టీసీ అందిస్తుంది. అందులో భాగంగానే మ‌హా శివ‌రాత్రి ప‌ర్వదినాన వివిధ ఆల‌యాల‌ను సంద‌ర్శించే భ‌క్తుల కోసం ఆర్టీసీ ప్రత్యేక స‌ర్వీసుల‌ను న‌డ‌ప‌నున్నట్లు జిల్లా ప్రజా ర‌వాణా అధికారి సీహెచ్ అప్పల‌నారాయ‌ణ‌, విజ‌య‌న‌గరం డిపో మేనేజ‌ర్ శ్రీ‌నివాస‌రావు తెలిపారు.

రామతీర్థానికి 45 బస్సులు

ఈనెల 26, 27 తేదీల్లో విజ‌యన‌గ‌రం డిపో నుంచి పుణ్యక్షేత్రం రామ‌తీర్థానికి 45 బ‌స్సులు న‌డుతున్నారు. అలాగే శ్రీకాకుళం-2 డిపో నుంచి 10 బ‌స్సులు, పాల‌కొండ డిపో నుంచి పాల‌కొండ‌, చీపురుప‌ల్లి, గ‌రివిడి మీదుగా 20 బ‌స్సులు అందుబాటులోకి తీసుకొచ్చారు. మొత్తం 75 బ‌స్సుల‌ను రామ‌తీర్థానికి వేశారు. విజ‌య‌న‌గ‌రం, శ్రీ‌కాకుళం జిల్లాల భ‌క్తుల‌కు ఈ స్పెష‌ల్ స‌ర్వీసులు అందుబాటులోకి తీసుకొచ్చారు. అలాగే ఎస్.కోట డిపో నుంచి పుణ్యగిరికి 35 బ‌స్సులు, ఎస్‌.కోట నుంచి స‌న్యాసిపాలెంకు 10 బ‌స్సులను వేశారు.

ఈ స్పెష‌ల్ స‌ర్వీసుల్లో సాధార‌ణ ఛార్జీలే వ‌సూలు చేస్తామ‌ని, ఎటువంటి అద‌న‌పు ఛార్జీలు ఉండ‌వ‌ని జిల్లా ప్రజా ర‌వాణా అధికారి సీహెచ్ అప్పల‌నారాయ‌ణ తెలిపారు. భ‌క్తులకు అనువుగా సౌక‌ర్యవంత‌మైన ప్రయాణాన్ని అందించేందుకు తాము స్పెష‌ల్ స‌ర్వీసుల‌ను తీసుకొచ్చామ‌ని, ఎందుకంటే మ‌హా శివ‌రాత్రి రోజున భ‌క్తుల ర‌ద్దీ ఎక్కువ‌గా ఉంటుందని అన్నారు. భ‌క్తుల ర‌ద్దీ త‌గ్గించేందుకు తాము స్పెష‌ల్ స‌ర్వీసుల‌ను అందుబాటులోకి తీసుకొచ్చామ‌ని తెలిపారు. మ‌రిన్ని అద‌న‌పు వివ‌రాల కోసం మొబైల్ ఫోన్ నెంబ‌ర్లు 9959225620, 9494331213, 9440359596 ను సంప్రదించాల‌ని కోరారు.

25న విజ‌య‌న‌గ‌రం నుంచి శ్రీశైలం క్షేత్రానికి స్పెష‌ల్ స‌ర్వీస్‌

అలాగే మ‌హా కుంభ‌మేళా, శ్రీశైలం వంటి పుణ్యక్షేత్రాల‌కు కూడా విజయ‌న‌గరం నుంచి ప్రత్యేక బ‌స్సు స‌ర్వీసుల‌ను వేశామ‌ని అన్నారు. విజ‌య‌న‌గరం నుంచి శ్రీశైలం మ‌ల్లన్న క్షేత్రానికి మ‌హా శివ‌రాత్రి స్పెష‌ల్ స‌ర్వీస్‌ను ఏపీఎస్ ఆర్టీసీ అందుబాటులోకి తీసుకొచ్చింది. సాధార‌ణ ఛార్జీల‌తో స్పెష‌ల్ సూప‌ర్ ల‌గ్జరీ బ‌స్సును ఏర్పాటు చేసింది. విజ‌య‌గ‌నరంలో ప్రారంభ‌మైన బ‌స్సు త‌గ‌ర‌పువ‌ల‌స‌, విశాఖ‌ప‌ట్నం, అన్నవ‌రం, రాజ‌మ‌హేంద్రవ‌రం, విజ‌య‌వాడ మీదుగా శ్రీశైలం చేరుకుటుంది.

విజ‌య‌న‌గరం బ‌స్ కాంప్లెక్స్ నుండి ఫిబ్రవ‌రి 25న మ‌ధ్యాహ్నం 2.45 గంట‌ల‌కు బ‌స్సు బ‌య‌లుదేరుతోంది. అలాగే బస్ తిరిగి ఫిబ్రవ‌రి 26న సాయంత్రం నాలుగు గంట‌ల‌కు శ్రీశైలం నుండి బ‌య‌లుదేరుతోంది. ఈ స‌ర్వీస్‌ల‌కు రెండు వైపుల ఒకేసారి టిక్కెట్టు బుక్ చేసుకుంటే, 10 శాతం డిస్కౌంట్ కూడా ఏపీఎస్ఆర్టీసీ ప్రక‌టించింది. టిక్కెట్టును ఆన్‌లైన్‌లో బుక్‌చేసుకోవాల‌ని సూచించింది.

రిపోర్టింగ్ : జ‌గ‌దీశ్వర‌రావు జ‌ర‌జాపు, హిందూస్తాన్ టైమ్స్ తెలుగు

Whats_app_banner

సంబంధిత కథనం