APSRTC Maha Kumbha Mela : భక్తులకు ఏపీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్- అమలాపురం నుంచి మహాకుంభమేళాకు స్పెషల్ సర్వీసులు
APSRTC Maha Kumbha Mela : అమలాపురం నుంచి ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ కు ఏపీఎఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. ఫిబ్రవరి 18, 21 తేదీల్లో మధ్యాహ్నం 12 గంటలకు అమలాపురం బస్ కాంప్లెక్స్‌లో బస్సులు బయలుదేరుతాయి.

APSRTC Maha Kumbha Mela :మహా కుంభమేళాకు వెళ్లే భక్తులకు ఏపీఎస్ ఆర్టీసీ గుడ్‌న్యూస్ చెప్పింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) అమలాపురం నుంచి ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగరాజ్‌లో జరిగే మహా కుంభమేళాకి ఏపీఎస్ఆర్టీసీ స్పెషల్ బస్ సర్వీస్‌ను తీసుకొచ్చింది. ఈ సర్వీస్‌ను యాత్రికులు వినియోగించుకోవాలని ఆర్టీసీ కోరుతోంది. ఇతర ఆధ్యాత్మిక ప్రాంతాల పర్యటన సర్వీసులానే ఈ బస్సు సర్వీస్‌లు కూడా మహా కుంభమేళాను సందర్శించేందుకు తీసుకెళ్తుంది.
ఆర్టీసీ నిత్యం కొత్త సర్వీసులను, ప్రత్యేక సర్వీసులను అందుబాటులో తెస్తుంది. డిమాండ్‌ను బట్టి, ప్రయాణికులు, యాత్రీకులు అత్యధికంగా వెళ్లే మార్గాలకు అతితక్కువ ధరకు, సురక్షితమైన ప్రయాణాన్ని ఆర్టీసీ అందిస్తుంది. అందులో భాగంగానే ఉత్తరప్రదేశ్‌లోని మహా కుంభమేళాకి ఈ సర్వీస్‌లు అందుబాటులోకి తెచ్చింది.
ప్యాకేజీ ఇలా
అమలాపురం నుంచి ఉత్తరప్రదేశ్‌లోని మహా కుంభమేళా దర్శన యాత్రను అందుబాటులోకి తెచ్చింది. ఫిబ్రవరి 18, 21 తేదీల్లో మధ్యాహ్నం 12 గంటలకు అమలాపురం బస్ కాంప్లెక్స్‌లో బస్సులు బయలుదేరుతాయి. భువనేశ్వర్, పూరీ, కోణార్క్, ప్రయాగరాజ్-మహా కుంభమేళా వారణాసి, ఆయోధ్య, గయ, బుద్ధగయ, అరసవిల్లి, శ్రీకూర్మం యాత్ర ఉంటుంది. త్రివేణి సంఘమ స్నానం, విశ్వనాధ దర్శ, గయ పిండ ప్రదానం వంటి కార్యక్రమాలు కూడా ఉంటాయి. గయ పిండ ప్రదానం మానవ జన్మకు సార్ధకం లభిస్తుందని నానాడి ఉంది.
ఎనిమిది రోజులు పాటు యాత్ర కొనసాగుతుంది. ప్రయాగ రాజ్, కాశీ క్షేత్రాల్లో ఒక రోజు బస ఉంటుంది. టిక్కెట్టు ధర రెండు వైపుల కలిపి ఒక్కరికి రూ.10,800గా ఆర్టీసీ నిర్ణయించింది. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, రాత్రి అల్పాహారం అందిస్తారు. తాగేందుకు వాటర్ కూడా ఇస్తారు. టిక్కెట్టు కావాలనుకునేవారు కొవ్వొరు బస్సు డిపోను సంప్రదించాలి. అప్పుడే టిక్కెట్టు బుక్ చేసుకోవడం అవుతుంది. యాత్రికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ డిపో మేనేజర్ చల్లా సత్యనారాయణమూర్తి కోరారు. అదనపు సమచారం కోసం 7013868687, 995922557ను సంప్రదించాలని సూచించారు.
విజయనగరం నుంచి శ్రీశైలం మల్లన్న క్షేత్రానికి స్పెషల్ సర్వీస్
విజయనగరం నుంచి శ్రీశైలం మల్లన్న క్షేత్రానికి మహా శివరాత్రి స్పెషల్ సర్వీస్‌ను ఏపీఎస్ఆర్టీసీ అందుబాటులోకి తీసుకొచ్చింది. సాధారణ ఛార్జీలతో స్పెషల్ సూపర్ లగ్జరీ బస్సును ఏర్పాటు చేసింది. విజయగనరంలో ప్రారంభమైన బస్సు తగరపువలస, విశాఖపట్నం, అన్నవరం, రాజమహేంద్రవరం, విజయవాడ మీదుగా శ్రీశైలం చేరుకుటుంది.
విజయనగరం బస్ కాంప్లెక్స్ నుండి ఫిబ్రవరి 25న మధ్యాహ్నం 2.45 గంటలకు బస్సు బయలుదేరుతోంది. అలాగే బస్ తిరిగి ఫిబ్రవరి 26న సాయంత్రం నాలుగు గంటలకు శ్రీశైలం నుండి బయలుదేరుతోంది. ఈ సర్వీస్‌లకు రెండు వైపుల ఒకేసారి టిక్కెట్టు బుక్ చేసుకుంటే, 10 శాతం డిస్కౌంట్ కూడా ఏపీఎస్ఆర్టీసీ ప్రకటించింది. టిక్కెట్టును ఆన్‌లైన్‌లో బుక్‌చేసుకోవాలని సూచించింది.
రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందూస్తాన్ టైమ్స్ తెలుగు
సంబంధిత కథనం