APSRTC Sabarimala Special : అయ్యప్ప కొండకు ఆర్టీసీ బస్సు.. మీ కోసమే అద్భుతమైన ప్యాకేజీ.. ఇలా బుక్ చేసుకోండి
APSRTC Sabarimala Special : శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తుల కోసం ఏపీఎస్ ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. డిపోల వారీగా మంచి ప్యాకేజీలు ప్రకటిస్తోంది. తాజాగా.. నెల్లూరు జిల్లా అధికారులు శబరిమల స్పెషల్ ప్యాకేజీలు ప్రకటించారు. పూర్తి వివరాల కోసం సంప్రదించాల్సిన నంబర్లను వెల్లడించారు.
ప్రతీ సంవత్సరం అయ్యప్ప భక్తుల కోసం స్పెషల్ ప్యాకేజీలు ప్రకటిస్తున్నామని.. ఈసారి కూడా ఉత్తమ ప్యాకేజీలు అందిస్తున్నామని నెల్లూరు జిల్లా ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. మొత్తం బస్సు గానీ.. విడివిడిగా గాని టికెట్లు బుక్ చేసుకోవచ్చని ఆర్టీసీ అధికారులు స్పష్టం చేస్తున్నారు. అన్ని వర్గాల వారికి అందుబాటులో ఉండే విధంగా.. సూపర్ లగ్జరీ, అల్ట్రా డీలక్స్, ఎక్స్‌ప్రెస్, అల్ట్రా పల్లెవెలుగు బస్సులను అందుబాటులో ఉంచారు. మొత్తం బస్ బుక్ చేసుకున్న వారికి ఏడుగురికి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నారు.
సూపర్ లగ్జరీ బస్సుల్లో భక్తుల కోసం ఆడియో, వీడియో సౌకర్యం కల్పించినట్టు అధికారులు వివరించారు. బస్సును అద్దె ప్రాతిపదికన బుక్ చేసుకునే గురు స్వాములకు, ఏజెంట్లకు మినిమం 5 రోజులు రూ. 2 వేలు కమీషన్ కూడా ఇస్తున్నట్టు ప్రకటించారు. అద్దె ప్రాతిపదికన బస్సులు బుక్ చేసుకున్న వారికి చివరి రోజు 12 గంటల ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించారు. అద్దె ప్రాతిపదికన బుక్ చేసుకున్న బస్సులు రోజుకు 420 కిలోమీటర్ల చోప్పున లెక్కిస్తామని అధికారులు వెల్లడించారు.
బస్సులు బయలుదేరు తేదీలు..
నవబంర్ 17, 18, 20, 22, 25, 26, 29 తేదీల్లో బస్సులు బయలుదేరనున్నాయి. డిసెంబర్ నెలలో 3, 4, 6, 10, 11, 13, 17, 18, 20, 22, 25, 26, 28, 2025 జనవరిలో.. 3, 5, 7 తేదీల్లో బస్సులు నెల్లూరు నుంచి బయలుదేరనున్నాయి.
బస్సుల కోసం సంప్రదించాల్సిన నంబర్లు..
నెల్లూరు 1 డిపో మేనేజర్- 9959225641
నెల్లూరు 2 డిపో మేనేజర్- 9959225642
రాపూర్ డిపో మేనేజర్- 9959225651
ఉదయగిరి డిపో మేనేజర్- 9959225095
కావలి డిపో మేనేజర్- 9959225643
ఆత్మకూరు డిపో మేనేజర్ - 9959225645
కందుకూరు డిపో మేనేజర్- 9959225698