పుణ్యక్షేత్రాలు అరుణాచలం, రామేశ్వరం వెళ్లే భక్తులకు ఏపీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్ చెప్పింది. అరుణాచలం, రామేశ్వరం, తిరువనంతపురం, మధురై, ఊటీతో పాటు 14 క్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలకు స్పెషల్ సర్వీసును వేసింది. రాష్ట్రంలోని రాజమండ్రి నుంచి తమిళనాడులోని అరుణాచలం (తిరువణ్ణామలై), రామేశ్వరానికి ఏపీఎస్ఆర్టీసీ స్పెషల్ సూపర్ లగ్జరీ బస్ సర్వీస్‌ను తీసుకొచ్చింది. ఈ సర్వీస్‌ను యాత్రికులు వినియోగించుకోవాలని ఆర్టీసీ కోరుతోంది.
అరుణాచలం (తిరువణ్ణామలై), రామేశ్వరం యాత్ర పేరుతో యాత్రికుల కోసం ప్రత్యేక సర్వీస్‌ను అందుబాటులోకి తెచ్చింది. తొమ్మిది రోజుల పాటు 14 క్షేత్రాలను దర్శించుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. ఏప్రిల్ 23న సాయంత్రం 4 గంటలకు బస్సు రాజమండ్రి డిపో నుంచి బయలుదేరుతుంది. ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు సర్వీస్ (పుష్‌బ్యాక్ 2+2) సీట్లతో అందుబాటులో ఉటుంది.
టిక్కెట్టు ధర రెండు వైపుల కలిపి ఒక్కరికి రూ.11,000గా ఆర్టీసీ నిర్ణయించింది. నలుగురు కంటే ఎక్కువ మంది ఉంటే వారి ఇంటి వద్దకే టికెట్లు తీసుకొచ్చి ఇచ్చేలా ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, రాత్రి అల్పాహారం అందిస్తారు.
మహాగణపతి ఆలయం (కాణిపాకం), గోల్డెన్ టెంపుల్ (శ్రీపురం), అరుణాచలేశ్వరస్వామి ఆలయం (అరుణాచలం), సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆయలం (పళని), ఆదియోగి దేవాలయం (కోయంబత్తూర్), ఉద్యానవనం ప్రదేశం (ఊటీ), చాముండేశ్వరి ఆలయం, మైసూర్ పాలెస్ (మైసూర్), కృష్ణ ఆలయం (గురువాయుర్), అనంత పద్మనాభస్వామి ఆలయం (తిరువనంతపురం), కన్యాకాపరమేశ్వరి ఆలయం (కన్యాకుమారి), మధురమీనాక్షి ఆలయం (మధురై), రామేశ్వర జ్యోతిర్లింగం (రామేశ్వరం), రంగనాధ ఆలయం (శ్రీరంగం), బృహదేశ్వర ఆలయం (తంజావూరు).
బస్సు టిక్కెట్ల బుకింగ్, ఇతర సమచారం కోసం రాజమండ్రి ఆర్టీసీ డిపోలో సంప్రదించాలి. అప్పుడే టిక్కెట్టు బుక్ చేసుకోవడం వీలు అవుతుంది. యాత్రికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డిపో కమిషనర్ ఎస్.కె షబ్నం విజ్ఞప్తి చేశారు.
(రిపోర్టింగ్- జగదీశ్వరరావు జరజాపు, హిందూస్తాన్ టైమ్స్ తెలుగు)