APSRTC : అద్దె బస్సుల కోసం ఆర్టీసీ టెండర్లు
ఏపీలో అద్దె బస్సుల కోసం ఆర్టీసీ టెండర్లు ఆహ్వానించింది. ఎంఎస్‌టీసీ ఈ-కామర్స్ పోర్టల్‌లో రిజిస్టర్ కావాల్సి ఉంటుంది.
ఆర్టీసీ 659 అద్దె బస్సుల కోసం టెండర్లను పిలిచింది. ఆసక్తి ఉన్నవారు ఎంఎస్‌టీసీ ఈ-కామర్స్ పోర్టల్‌లో రిజిస్టర్ కావాల్సి ఉంటుంది. జిల్లాలవారీగా వివిధ రకాల బస్సులు, సంఖ్య మేరకు టెండర్లు పిలించారు. జులై 6 నుంచి జులై 27 వరకు బిడ్లు దాఖలు చేయవచ్చు. ఏసీ స్లీపర్ - 9, నాన్ ఏసీ స్లీపర్- 47, ఇంద్ర ఏసీ - 6, సూపర్ లగ్జరీ - 46, అల్ట్రా డీలక్స్-22, ఎక్స్‌ప్రెస్-70, అల్ట్రా పల్లెవెలుగు-208, పల్లెవెలుగు-203, మెట్రో ఎక్స్‌ప్రెస్-39, సిటీ ఆర్డినరీ బస్సులు-9 ఉన్నాయి.
ట్రెండింగ్ వార్తలు
ఇటీవలే ఆర్టీసీ ఛార్జీలు పెంపు
ఇటీవలే ఆర్టీసీ ఛార్జీలు పెంచింది. పల్లె వెలుగు బస్సుల్లో కనీస ఛార్జీ రూ.10లుగా ఉన్న విషయం తెలిసిందే. అయితే తొలి 30కిలోమీటర్ల వరకు సెస్ పెంపు లేదని ఆర్టీసీ పేర్కొంది. 35 నుంచి 60 కిలో మీటర్ల వరకు అదనంగా రూ.5లు సెస్ విధిస్తారు. 60 నుంచి 70 కి.మీ వరకు రూ.10గా ఉండగా.. 100 కి.మీ ఆపైన రూ.120 సెస్ ఉంటుంది. ఎక్స్‌ప్రెస్, మెట్రో ఎక్స్‌ప్రెస్, మెట్రో డీలక్స్ బస్సుల్లో ప్రస్తుతం టికెట్‌పై రూ.5 సెస్ వసూలు చేస్తుండగా.. ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో 30కి.మీ వరకు సెస్ పెంపు లేదు. 31 నుంచి 65 కి.మీ వరకు మరో రూ.5 సెస్. 66 నుంచి 80కి.మీ వరకు రూ.10 పెంచారు.
సూపర్ లగ్జరీ, ఏసీ బస్సుల్లో టికెట్‌పై రూ.10 డీజిల్ సెస్ వసూలు చేస్తున్నారు. సూపర్ లగ్జరీ బస్సుల్లో 55 కి.మీ వరకు సెస్ పెంపు లేదు. విజయవాడ నుంచి హైదరాబాద్ కు వెళ్లే సూపర్ లగ్జరీ బస్సుల్లో రూ.70 సెస్ పెంచారు. హైదరాబాద్ వెళ్లే అమరావతి బస్సుల్లో రూ.80 చొప్పున డీజిల్ సెస్ విధించనున్నారు.
డీజిల్ సెస్ పెంపుతో తెలంగాణ ఆర్టీసీ.. బస్సు ఛార్జీలు పెంచింది. అయితే ప్రయాణికులు మాత్రం.. హైదరాబాద్ కు వస్తుంటే.. ఇతర రాష్ట్రాల ఆర్టీసీ బస్సుల వైపు చూస్తున్నారు. ఈ కారణంగా వేరే రాష్ట్రాల నుంచి తెలంగాణకు బస్సులు నడిపించే ఆర్టీసీ సంస్థలకు టీఎస్ఆర్టీసీ సర్క్యులర్ ఇచ్చింది. అంతర్‌రాష్ట్ర రవాణా సంస్థల ఒప్పందం ప్రకారం ఆయా రాష్ట్రాల మధ్య తిరిగే బస్సు ఛార్జీలు ఒకేలా ఉండాలనే నిబంధన ఉందనే విషయాన్ని ప్రస్తావించింది. ప్రభుత్వంలో ఏపీఎస్ ఆర్టీసీ విలీనం అయింది. తెలంగాణ ప్రాంతంలో తిరిగే ఏుపీఎస్ఆర్టీసీ బస్సుల ఛార్జీలపై నిర్ణయం తీసుకోలేమని.. ఆర్టీసీ యాజమాన్యం గతంలో ప్రకటించింది. ఇప్పుడు కొత్తగా టికెట్ ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.