Rameswaram APSRTC Bus Service : రామేశ్వరం యాత్రకు ఏపీఎస్ఆర్టీసీ బస్ సర్వీస్, రూ.4 వేలతో నాలుగు పుణ్యక్షేత్రాల సందర్శన
Rameswaram APSRTC Bus Service : ఏపీలోని హిందూపురం నుంచి తమిళనాడులో రామేశ్వరానికి ఏపీఎస్ఆర్టీసీ బస్సు సర్వీస్ నడుపుతోంది. ఈ పర్యటనలో యాత్రికులు రామేశ్వరం, మధురై, శ్రీరంగం, అరుణాచలం పుణ్యక్షేత్రాల సందర్శించవచ్చు.
Rameswaram APSRTC Bus Service : పుణ్యక్షేత్రం రామేశ్వరం యాత్రకు వెళ్లే భక్తులకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) రామేశ్వరం యాత్రకు స్పెషల్ సర్వీసును అందుబాటులోకి తెచ్చింది. రాష్ట్రంలోని హిందూపురం నుంచి తమిళనాడులోని రామేశ్వరానికి ఏపీఎస్ఆర్టీసీ స్పెషల్ సూపర్ లగ్జరీ బస్ సర్వీస్‌ను తీసుకొచ్చింది. ఈ సర్వీస్‌ను యాత్రికులు వినియోగించుకోవాలని ఆర్టీసీ కోరుతోంది. ఇతర ఆధ్యాత్మిక ప్రాంతాల పర్యటన సర్వీసులానే ఈ బస్సు సర్వీస్‌లు కూడా రామేశ్వరం యాత్రకు తీసుకెళ్తుంది.
ఆర్టీసీ నిత్యం కొత్త సర్వీసులను, ప్రత్యేక సర్వీసులను అందుబాటులో తెస్తుంది. డిమాండ్‌ను బట్టి, ప్రయాణికులు, యాత్రీకులు అత్యధికంగా వెళ్లే మార్గాలకు అతితక్కువ ధరకు, సురక్షితమైన ప్రయాణాన్ని ఆర్టీసీ అందిస్తుంది. అందులో భాగంగానే రామేశ్వరం యాత్రకి సర్వీస్‌లు అందుబాటులోకి తెచ్చింది. ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు సర్వీస్ (పుష్‌బ్యాక్ 2+2) సీట్లతో హిందూపురం నుంచి తమిళనాడులోని రామేశ్వరం దర్శన యాత్రకు యాత్రికుల కోసం అందుబాటులోకి తెచ్చింది. ఈ యాత్ర నాలుగు రోజుల పాటు ఉంటుంది. రామేశ్వరం, మధురై, శ్రీరంగం, అరుణాచలం పుణ్యక్షేత్రాల సందర్శన ఉంటుంది.
హిందూపురం బస్ కాంప్లెక్స్‌లో ప్రారంభమైన బస్ అరుణాచలం, అక్కడ నుంచి శ్రీరంగం చేరుకుంటుంది. అక్కడ దర్శనం పూర్తి అయిన తరువాత మధురై మీనాక్షామ్మ దేవాలయానికి తీసుకెళ్తారు. మధురై మీనాక్షామ్మ దర్శనం తరువాత రామేశ్వరం వెళ్తుంది. అక్కడ సందర్శన తరువాత తిరిగి హిందూపురానికి బయలుదేరుతుంది. టిక్కెట్టు ధర రెండు వైపుల కలిపి ఒక్కరికి రూ.4,000గా ఆర్టీసీ నిర్ణయించింది. టిక్కెట్టు కావాలనుకునేవారు ఈ ఫోన్ నంబర్లు 9440834715 (ఏవీవీ ప్రసాద్), 7382863007, 7382861308లను సంప్రదించాలి. అప్పుడే టిక్కెట్టు బుక్ చేసుకోవడం అవుతుంది. యాత్రికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డిపో మేనేజర్ శ్రీకాంత్ తెలిపారు.
జగదీశ్వరరావు జరజాపు, హిందూస్తాన్ టైమ్స్ తెలుగు
సంబంధిత కథనం