APSRTC Senior Citizen : సీనియర్ సిటిజన్లకు ఏపీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్, టికెట్లపై 25 శాతం రాయితీ- ఏ కార్డులు చూపించాలంటే?
APSRTC Senior Citizen Concession : ఏపీఎస్ఆర్టీసీ సీనియర్ సిటిజన్లకు బస్సు టికెట్ పై 25 శాతం రాయితీ ఇస్తు్న్నట్లు ప్రకటించింది. ఈ రాయితీ ఏ రాష్ట్రం వారికైనా వర్తిస్తుందని పేర్కొంది. సీనియర్ సిటిజన్లు తమ వయస్సు నిర్థారణకు ఆధార్ కార్డు, పాన్ కార్డు, సీనియర్ సిటిజన్ ఐడీ కార్డు ఏదోకటి చూపించవచ్చు.
ఏపీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. 60 సంవత్సరాలు పైబడిన సీనియర్ సిటిజన్లకు బస్సు టికెట్లపై 25 శాతం రాయితీ ఇస్తున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ ప్రకటించింది. దేశంలోని ఏ రాష్ట్రం వారికైనా అన్ని ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో 25 శాతం రాయితీ పొందవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రయాణికులు తమ ఆధార్ కార్డు, పాన్ కార్డు, సీనియర్ సిటిజన్ ఐడీ కార్డు, పాస్ పోర్టు, ఓటర్ ఐడీ లేదా రేషన్ కార్డుల్లో ఏదో ఒకటి చూపించి ఆర్టీసీ బస్సుల్లో 25 శాతం రాయితీ పొందవచ్చు. ఏపీలోని వృద్ధులకే కాకుండా ఏ రాష్ట్రం, ఏ ప్రాంతం వారికైనా రాయితీ వర్తిస్తుందని అధికారులు తెలిపారు. ఒరిజినల్ గుర్తింపు కార్డు మర్చిపోతే మొబైల్ ఫోన్లో డిజిటల్ కార్డు చూపించవచ్చని పేర్కొన్నారు.
సీనియర్ సిటిజన్లు తమ వయసు ధృవీకరణ కోసం ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటర్ గుర్తింపు కార్డు, రేషన్ కార్డు, పాస్ పోర్టు, గుర్తింపు కార్డులలో ఏదో ఒక కార్డును టికెట్ తీసుకునే సమయంలో చూపించాల్సి ఉంటుంది.
సీనియర్ సిటిజన్లకు రూ.5 లక్షల ఉచిత ఆరోగ్య బీమా
70 ఏళ్ల పైబడిన వృద్ధులకు కేంద్రం ఆయుష్మాన్ భారత్ యోజన కింద రూ.5 లక్షల వరకు ఆరోగ్య బీమా కవరేజీని ఉచితంగా అందిస్తోంది. కుటుంబానికి అర్హత లేనప్పటికీ.. సీనియర్ సిటిజన్లు ఈ ప్రయోజనాన్ని పొందవచ్చు. అయితే ఈ పథకంలో సీనియర్ సిటిజన్లు తమ పేర్లను నమోదు చేసుకోవాలి. 70 ఏళ్లు పైబడిన వృద్ధులకు కొత్త కార్డు జారీ చేస్తారు. ధనవంతులు, పేదలు.. ఎవరైనా ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.
ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన ఇటీవల 70 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వృద్ధులందరూ దీనిని ఉపయోగించుకోవచ్చని పేర్కొంది. ఆదాయం ఉన్నవారు, లేనివారు, ఈ బీమాలో భాగస్వాములు అవ్వొచ్చు. సుమారు 4.5 కోట్ల కుటుంబాలకు సమగ్ర ఆరోగ్య సంరక్షణ అందించడం ఈ పథకం లక్ష్యం. సుమారు 6 కోట్ల మంది సీనియర్ సిటిజన్లు ఒక్కో కుటుంబానికి రూ. 5 లక్షల ఆరోగ్య బీమా కవరేజీ ద్వారా లబ్ధి పొందుతారు. లబ్ధిదారులు ఆయుష్మాన్ భారత్ సీనియర్ సిటిజన్ స్కీమ్ కోసం వెబ్‌సైట్ పోర్టల్, ఆయుష్మాన్ యాప్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. మీరు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ఆధార్ కార్డ్, మెుబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడీ ఉంటే సరిపోతుంది. సీనియర్ సిటిజన్‌లు అధికారిక నేషనల్ హెల్త్ అథారిటీ వెబ్‌సైట్ లేదా ఆయుష్మాన్ యాప్ ద్వారా ఆయుష్మాన్ కార్డ్ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
సంబంధిత కథనం