Telugu News  /  Andhra Pradesh  /  Apsrtc Anounced One Thousand Dasara Special Services For Festival
దసరాకు ఏపీఎస్ ఆర్టీసీ వెయ్యి ప్రత్యేక సర్వీసులు
దసరాకు ఏపీఎస్ ఆర్టీసీ వెయ్యి ప్రత్యేక సర్వీసులు (Hindustan times)

APSRTC Dasara Special : ఆర్టీసి బస్సుల్లో బాదుడు లేదు…. పండక్కి వెయ్యి సర్వీసులు

20 September 2022, 11:26 ISTB.S.Chandra
20 September 2022, 11:26 IST

APSRTC Dasara Special దసరా పండగ ప్రత్యేక సర్వీసుల్లో అదనపు భారం మోపకూడదని ఏపీఎస్‌ఆర్టీసి కీలక నిర్ణయం తీసుకుంది. గత రెండేళ్లుగా పండుగ సీజన్‌లలో కోవిడ్‌ కారణంగా ప్రయాణాలను వాయిదా వేసుకోవాల్సి రావడంతో ఈ ఏడాది ప్రజలకు ఆర్టీసి బస్సుల్ని అందుబాటులో ఉంచాలని ఏపీఎస్‌ ఆర్టీసి నిర్ణయించింది.

APSRTC Dasara Special దసరా సీజన్‌లో ఆర్టీసి బస్సుల్లో ప్రయాణాలకు ఈ ఏడాది అదనపు వసూళ్ళు చేయకూడదని ఏపీఎస్‌ఆర్టీసి నిర్ణయించింది. దేవి శరన్నవరాత్రి ఉత్సవాలకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు విజయవాడ తరలివస్తారు. దీంతో పాటు పొరుగు రాష్ట్రాల్లో ఉంటున్న వారు కూడా స్వస్థలాలకు తరలి వస్తుంటారు. పాఠశాలలకు, కాలేజీలకు దసరా సెలవులు ఇవ్వడంతో పెద్ద ఎత్తున ప్రయాణాలు ఉంటాయి. గత కొన్నేళ్లుగా ఆర్టీసి పండుగ సీజన్‌లో నడిపే సర్వీసుల్లో అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నాయి.

ట్రెండింగ్ వార్తలు

APSRTC Dasara Special సర్వీసుల్లో ఎలాంటి అదనపు చార్జీలు వసూలు చేయకూడదని ఏపీఎస్‌ఆర్టీసి నిర్ణయించింది. దేవీ శరన్నవరాత్రుల్లో అమ్మవారి దర్శనం కోసం పెద్ద ఎత్తున భక్తులు విజయవాడకు తరలి వస్తారు. దీంతో పాటు విజయవాడ మీదుగా వివిధ జిల్లాలకు రాకపోకలు సాగిస్తారు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున అదనపు సర్వీసులు ఏర్పాటు చేస్తుంది. ప్రతి ఏటా ఆర్టీసి ఏర్పాటు చేసే ప్రత్యేక సర్వీసుల్లో అదనపు ఛార్జీలు వసూలు చేస్తుంది. బస్సుల్లో ఆక్యుపెన్సీ రేటు తక్కువగా ఉంటుందనే కారణంతో అదనపు ఛార్జీలు వసూలు చేసినా స్పెషల్ సర్వీసులు ఎప్పుడు కిటకిటలాడుతూనే రాకపోకలు సాగిస్తాయి.

దసరా పండుగ నేపథ్యంలో APSRTC Dasara Special సర్వీసుల్లో ఈ ఏడాది సాధారణ చార్జీలు వసూలు చేయాలని నిర్ణయించారు. పండుగ సీజన్‌ కోసం దాదాపు వెయ్యి బస్సుల్ని నడుపనున్నారు. విజయవాడ నుంచి వివిధ ప్రాంతాలకు ఈ సర్వీసుల్ని నడుపుతారు. సెప్టెంబర్‌ 29 నుంచి అక్టోబర్‌ 10వ తేదీ వరకు 12 రోజుల పాటు స్పెషల్ సర్వీసుల్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు. వీటిలో సాధారణ బస్సు ఛార్జీలనే వసూలు చేస్తారు. గత ఏడాది పండుగ సమయంలో 727 సర్వీసుల్ని నడపాలని భావించినా కోవిడ్ కారణంగా స్పెషల్ సర్వీసుల్ని ఆర్టీసి నడపలేకపోయింది.

ఈ ఏడాది కోవిడ్ ప్రభావం లేకపోవడం, సాధారణ పరిస్థితులు నెలకొనడంతో దసరాకు వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని భావిస్తున్నారు. ఈ ఏడాది దసరాకు మొత్తం 1081 బస్సుల్ని నడిపేందుకు ఆర్టీసి ఏర్పాట్లు చేస్తోంది. హైదరాబాద్‌, బెంగళూరు, విశాఖపట్నం, రాజమండ్రి, భద్రాచలం, తిరుపతి, కాకినాడ తదితర మార్గాల్లో ఈ సర్వీసుల్ని నడుపనున్నారు. ఈ రూట్లలో ప్రయాణించే రోజువారి బస్సులకు స్పెషల్ సర్వీసులు అదనంగా నడుపుతారు. APSRTC Dasara Special సర్వీసులకు రిజర్వేషన్ సదుపాయాన్ని కూడా కల్పించారు.

APSRTC Dasara Specialసర్వీసుల్ని పండుగ ముందు రద్దీ, పండుగ తర్వాత రద్దీ ఆధారంగా అంచనాలతో ఏర్పాటు చేశారు. పండుగ తర్వాత రోజు ప్రయాణాలకు 6వ తేదీన తిరుగు ప్రయాణాల కోసం 130 సర్వీసుల్ని ఏర్పాటు చేశారు. ఆదివారం 9వ తేదీ రద్దీ అధికంగా ఉంటుందనే అంచనాతో 143 స్పెషల్ సర్వీసులు ఏర్పాటు చేశారు. విజయవాడ నుంచి హైదరాబాద్‌కు 341 ప్రత్యేక బస్సులు, రాజమండ్రికి 283, విశాఖపట్నంకు 142, బెంగళూరుకు 11, చెన్నైకు 71 ఇతర ప్రాంతాలకు 233 సర్వీసుల్ని ప్రకటించారు.