APSRTC Special Packages : ప్రయాగరాజ్ మ‌హా కుంభమేళా - కోనసీమ, కాకినాడ జిల్లాల నుంచి APSRTC టూర్ ప్యాకేజీలు-apsrtc announced tour packages for maha kumbh mela yatra 2025 from kakinda and konaseema districts ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Apsrtc Special Packages : ప్రయాగరాజ్ మ‌హా కుంభమేళా - కోనసీమ, కాకినాడ జిల్లాల నుంచి Apsrtc టూర్ ప్యాకేజీలు

APSRTC Special Packages : ప్రయాగరాజ్ మ‌హా కుంభమేళా - కోనసీమ, కాకినాడ జిల్లాల నుంచి APSRTC టూర్ ప్యాకేజీలు

HT Telugu Desk HT Telugu
Jan 29, 2025 02:43 PM IST

మహా కుంభమేళాకు వెళ్లే భ‌క్తుల‌కు ఏపీఎస్ఆర్టీసీ శుభ‌వార్త చెప్పింది. వేర్వురు ప్రాంతాల నుంచి మరికొన్ని స్పెష‌ల్ స‌ర్వీసులను ప్రకటించింది. కాకినాడ‌, అంబేద్క‌ర్ కోన‌సీమ జిల్లాల‌ నుంచి ప్ర‌యాగరాజ్‌లో జ‌రిగే మ‌హా కుంభ‌మేళాకి సూప‌ర్ ల‌గ్జరీ, నాన్ ఏసీ స్లీప‌ర్ స్పెష‌ల్ బ‌స్ స‌ర్వీస్‌ను తీసుకొచ్చింది.

ఏపీఎస్‌ఆర్టీసీ
ఏపీఎస్‌ఆర్టీసీ

ప్రయాణికుల రద్దీ, డిమాండ్ బట్టి ఏపీఆర్టీసీ నిత్యం కొత్త స‌ర్వీసుల‌ను, ప్ర‌త్యేక స‌ర్వీసుల‌ను అందుబాటులో తీసుకువస్తోంది. అంతేకాకుండా యాత్రీకులు అత్య‌ధికంగా వెళ్లే మార్గాల‌కు అతి త‌క్కువ ధ‌ర‌కే ప్యాకేజీలను కూడా ప్రకటిస్తోంది. ఇందులో భాగంగా తాజాగా ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని మ‌హా కుంభ‌మేళాకు ప్రత్యేక సర్వీసులను ప్రకటించింది.

తాజా సర్వీసులు ఇవే…

కాకినాడ జిల్లాలోని కాకినాడ డిపో, అంబేద్క‌ర్ కోన‌సీమ జిల్లాలోని అమ‌లాపురం, రాజోలు నుంచి కుంభ‌మేళాకు ప్ర‌త్యేక బ‌స్సులు ఏర్పాటు చేశారు. కాకినాడ నుంచి వెళ్లే భ‌క్తుల‌కు ఆరు రోజులు, అమ‌లాపురం, రాజోలు నుంచి వెళ్లే భక్తుల‌కు ఎనిమిది రోజుల పాటు యాత్ర ఉంటుంది. మ‌హా కుంభ‌మేళా జ‌రిగే ప్ర‌యాగ‌రాజ్‌తో అయోధ్య‌, కాశీ పుణ్య‌క్షేత్రాల ద‌ర్శ‌నం కూడా ఉంటుంద‌ని డిపో మేనేజ‌ర్లు వేర్వురుగా ప్రకటించారు.

ప్యాకేజీ ఇలా….

  • అమ‌లాపురం, రాజోలు ఆర్టీసీ బ‌స్ కాంప్లెక్స్ నుంచి ఫిబ్ర‌వ‌రి 12 తేదీన మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు సూప‌ర్ ల‌గ్జ‌రీ బ‌స్సులు బ‌య‌లుదేరుతాయి.
  • భువ‌నేశ్వ‌ర్‌, పూరి, కోణార్క్, ప్ర‌యాగ‌రాజ్ (కుంభ‌మేళా), వార‌ణాసి, అయోధ్య‌, బుద్ధ‌గ‌య‌, అర‌స‌విల్లి, శ్రీకూర్మం, త్రివేణి సంగ‌మ స్నానం, విశ్వ‌నాథ ద‌ర్శ‌నం, గ‌య పిండ ప్ర‌ధాన ప్ర‌దేశాల సంద‌ర్శ‌న ఉంటుంది.
  • ఫిబ్ర‌వరి 20న బ‌స్సులు అమ‌లాపురం, రాజోలు చేసుకుంటాయి.
  • ఎనిమిది రోజులు పాటు యాత్ర కొన‌సాగుతుంది. ప్ర‌యాగ రాజ్, కాశీ క్షేత్రాల్లో ఒక రోజు బ‌స ఉంటుంది.
  • ఈ యాత్రలో పిల్ల‌లు, పెద్ద‌ల‌కు ఒక‌టే ఛార్జీ ఉంటుంది. టిక్కెట్టు ధ‌ర రెండు వైపుల క‌లిపి ఒక్కరికి సూప‌ర్ ల‌గ్జ‌రీ స‌ర్వీస్‌కు రూ.10,800గా ఆర్టీసీ నిర్ణ‌యించింది. ఉద‌యం టిఫిన్‌, మ‌ధ్యాహ్నం భోజ‌నం, రాత్రి టిఫిన్ అందిస్తారు.

కాకినాడ నుంచి ప్యాకేజీ వివరాలు…

  • కాకినాడ నుంచి జ‌న‌వ‌రి 31న ఉద‌యం 11 గంట‌ల‌కు రెండు నాన్ ఏసీ స్లీపర్ బ‌స్సులు బ‌య‌లుదేరుతాయి.
  • భువ‌నేశ్వ‌ర్‌, పూరీ, కోణార్క్, ప్ర‌యాగ‌రాజ్ ( కుంభ‌ మేళా ), వార‌ణాసి, బుద్ధ‌గ‌య సంద‌ర్శ‌ణ ఉంటుంది. అనంత‌రం బ‌స్సులు ఫిబ్రవ‌రి 5న కాకినాడకు చేరుకుంటాయి. మ‌ళ్లీ ఫిబ్ర‌వ‌రి 3న సూప‌ర్ ల‌గ్జ‌రీ బ‌స్సు బ‌య‌లుదేరుతుంది.
  • భువ‌నేశ్వ‌ర్‌, పూరి, కోణార్క్, ప్ర‌యాగ్ రాజ్ (కుంభ‌మేళా), వార‌ణాసి, బుద్ధ‌గ‌య సంద‌ర్శ‌ణ ఉంటుంది. అనంత‌రం బ‌స్సులు ఫిబ్రవ‌రి 8న కాకినాడకు చేరుకుంటాయి.
  • ఆరు రోజులు పాటు యాత్ర కొన‌సాగుతుంది. ప్ర‌యాగ రాజ్, కాశీ క్షేత్రాల్లో ఒక రోజు బ‌స ఉంటుంది.
  • ఈ యాత్రలో పిల్ల‌లు, పెద్ద‌ల‌కు ఒక‌టే ఛార్జీ ఉంటుంది. టిక్కెట్టు ధ‌ర రెండు వైపుల క‌లిపి ఒక్కరికి నాన్ ఏసీ స్లీప‌ర్‌ స‌ర్వీస్‌కు రూ.11,300గా ఆర్టీసీ నిర్ణ‌యించింది. అలాగే సూప‌ర్ ల‌గ్జ‌రీ స‌ర్వీస్‌కు రూ.9,300గా ఆర్టీసీ నిర్ణ‌యించింది. ఉద‌యం టిఫిన్‌, మ‌ధ్యాహ్నం భోజ‌నం, రాత్రి టిఫిన్ అందిస్తారు.
  • టిక్కెట్లు కావాల‌నుకునేవారు ఆన్‌లైన్‌లోనూ, స‌మీప బ‌స్సు స్టేష‌న్‌, ఆర్టీసీ టికెట్ బుకింగ్ ఏజెంట్లను సంప్ర‌దించాలి.
  • అద‌న‌పు స‌మ‌చారం కోసం 7013868687 (అమ‌లాపురం అసిస్టెంట్ మేనేజ‌ర్‌), 9959225538 (రాజోలు కేంద్రం), 9490887030 (కాకినాడ) నంబ‌ర్ల‌ను సంప్ర‌దించవచ్చు.
  • ప్ర‌యాణికుల‌కు ఎటువంటి అసౌక‌ర్యం క‌ల‌గ‌కుండా ఏపీఎస్ఆర్టీసీ సరికొత్త సేవలను తీసుకువచ్చింది.
  • what3wards///App స‌హాయంతో ప్రయాణీకులంద‌రూ ఎక్క‌డ ఉన్నా బ‌స్సు వ‌ద్ద‌కు చేరుకోవ‌చ్చు.
  • ఈ యాప్‌ను బ‌స్సు బ‌య‌లుదేరేన‌ప్పుడు ఇన్‌స్టాల్ చేస్తారు. ఈ యాప్ వ‌ల్ల ప్ర‌యాణికులు చాలా ప్ర‌యోజ‌నం క‌లుగుతోంది. బ‌స్సు ఎక్క‌డుందో అందులో స్ప‌ష్టం అవుతుంది. భ‌క్తులు త‌ప్పిపోకుండా ఉండేందుకు ఈ సాంకేతిక‌త‌ను తీసుకొచ్చిన‌ట్లు ఆర్టీసీ చెబుతోంది.

రిపోర్టింగ్ : జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌ర‌జాపు, హిందూస్తాన్ టైమ్స్ తెలుగు.

Whats_app_banner

సంబంధిత కథనం