APPSC Exams : ఏపీపీఎస్సీ రాతపరీక్షల తేదీలు విడుదల, ఓ నోటిఫికేషన్ రద్దు-appsc released exam dates for town planning non gazette aee exam dates survey department notification cancelled ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Appsc Exams : ఏపీపీఎస్సీ రాతపరీక్షల తేదీలు విడుదల, ఓ నోటిఫికేషన్ రద్దు

APPSC Exams : ఏపీపీఎస్సీ రాతపరీక్షల తేదీలు విడుదల, ఓ నోటిఫికేషన్ రద్దు

Bandaru Satyaprasad HT Telugu
Jul 29, 2023 01:45 PM IST

APPSC Exams : ఏపీలో పలు ఉద్యోగాల రాతపరీక్షల తేదీలను ఏపీపీఎస్సీ ప్రకటించింది. టౌన్ ప్లానింగ్, నాన్-గెజిటెడ్, ఏఈఈ పోస్టుల భర్తీకి పరీక్ష తేదీలు ఖరారు చేసింది. దీంతో పాటు గతంలో విడుదల చేసిన ఓ నోటిఫికేషన్ రద్దు చేసింది.

ఏపీపీఎస్సీ
ఏపీపీఎస్సీ

APPSC Exams : ఏపీపీఎస్సీ నిర్వహించే వివిధ ఉద్యోగాల రాత పరీక్షల షెడ్యూల్ విడుదల చేసింది. ఈ షెడ్యూల్ ప్రకారం...టౌన్‌ప్లానింగ్ అండ్ బిల్డింగ్ ఓవర్‌సీర్ ఉద్యోగాల భర్తీకి రాత పరీక్ష ఆగస్టు 18న నిర్వహించనున్నారు. నాన్-గెజిటెడ్ పోస్టులకు ఆగస్టు 19, 21 తేదీల్లో రాతపరీక్ష నిర్వహించనున్నారు. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (AEE) పోస్టుల భర్తీకి ఆగస్టు 21, 22 తేదీల్లో రాతపరీక్షలు నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది.

రాత పరీక్షల తేదీలు

టౌన్‌ ప్లానింగ్ అండ్ బిల్డింగ్ ఓవర్‌సీర్ ఉద్యోగాలకు ఆగస్టు 18వ తేదీ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్-1 (జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ), మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్-2 పరీక్షలు నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ తెలిపింది. ఆగస్టు 19న నాన్-గెజిటెడ్ ఉద్యోగాల భర్తీకి మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్-1 (జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ) ఎగ్జామ్ నిర్వహించనున్నారు. ఆగస్టు 21వ తేదీ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్-2 (అభ్యర్థి సబ్జెక్టు) రాత పరీక్ష నిర్వహించనున్నారు. ఏఈఈ ఉద్యోగాలకు ఆగస్టు 21న మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్-1 (జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ) రాత పరీక్ష, ఆగస్టు 22న ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్-2 (సివిల్, మెకానికల్, కామన్), అదే రోజు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్-2 (సివిల్, మెకానికల్) రాత పరీక్షలు నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది.

కంప్యూటర్ డ్రాఫ్ట్ మెన్ నోటిఫికేషన్ రద్దు

రాష్ట్ర సర్వే శాఖలో కంప్యూటర్‌ డ్రాఫ్ట్స్‌ మెన్‌ గ్రేడ్‌-2 పోస్టుల భర్తీ విడుదల చేసిన నోటిఫికేషన్‌ను ఏపీపీఎస్సీ రద్దు చేసింది. ఏపీ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ సబార్డినేట్ సర్వీస్‌లో ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ గత ఏడాది అక్టోబరు 17న నోటిఫికేషన్ విడుదల చేసింది. పదో తరగతితోపాటు ఐటీఐ అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి నవంబరు 10 నుంచి నవంబరు 29 వరకు అప్లికేషన్లు స్వీకరించింది. అయితే సర్వే శాఖలో కంప్యూటర్‌ డ్రాఫ్ట్స్‌మెన్‌ పోస్టుల భర్తీకి సాంకేతిక విద్యార్హతను అదనంగా చేర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో గతంలో ఇచ్చిన నోటిఫికేషన్‌ను రద్దు చేసింది. విదార్హతతో పాటు విధుల నిర్వహణ జాబితాలోనూ మార్పుచేర్పులు చేస్తున్నారు. ఈ మార్పుల కారణంగా పాత నోటిఫికేషన్‌ను రద్దుచేసినట్లు ఏపీపీఎస్సీ తెలిపింది.

టీ20 వరల్డ్ కప్ 2024