APPSC Group 2 Mains : ఏపీపీఎస్సీ గ్రూప్-2 మెయిన్స్ వాయిదా, కొత్త తేదీ ఇదే-appsc postponed group 2 mains exams new exam date feb 23rd ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Appsc Group 2 Mains : ఏపీపీఎస్సీ గ్రూప్-2 మెయిన్స్ వాయిదా, కొత్త తేదీ ఇదే

APPSC Group 2 Mains : ఏపీపీఎస్సీ గ్రూప్-2 మెయిన్స్ వాయిదా, కొత్త తేదీ ఇదే

Bandaru Satyaprasad HT Telugu
Nov 12, 2024 07:30 PM IST

APPSC Group 2 Mains : ఏపీపీఎస్సీ గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష వాయిదా పడింది. అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు 2025 జనవరి 5న నిర్వహించాల్సిన పరీక్షను ఫిబ్రవరి 23కు రీషెడ్యూల్ చేశారు.

ఏపీపీఎస్సీ గ్రూప్-2 మెయిన్స్ వాయిదా, కొత్త తేదీ ఇదే
ఏపీపీఎస్సీ గ్రూప్-2 మెయిన్స్ వాయిదా, కొత్త తేదీ ఇదే

APPSC Group 2 Mains : ఏపీపీఎస్సీ గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష వాయిదా పడింది. మెయిన్స్ రాత పరీక్షను వాయిదా వేయాలని అభ్యర్థుల నుంచి పెద్ద ఎత్తున వస్తోన్న విజ్ఞప్తుల మేరకు ఏపీపీఎస్సీ గ్రూప్-2 మెయిన్స్ ను రీషెడ్యూల్ వేసింది. 2025 జనవరి 5న నిర్వహించాలని నిర్ణయించిన పరీక్షను ఫిబ్రవరి 23కు వాయిదా వేశారు.

గ్రూప్-2 మెయిన్స్ రాత పరీక్షను వచ్చే ఏడాది జనవరి 05 నిర్వహించాలని ఏపీపీఎస్సీ ముందుగా నిర్ణయించింది. అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు గ్రూప్-2 మెయిన్స్ పరీక్షను ఏపీపీఎస్సీ రీషెడ్యూల్ చేసింది. ఫిబ్రవరి 23న మెయిన్స్ రాత పరీక్ష నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ తాజాగా ప్రకటించింది. ఇతర వివరాల కోసం కమిషన్ వెబ్‌సైట్‌ https://portal-psc.ap.gov.in/ సందర్శించాలని తెలిపింది.

గ్రూప్-2 మెయిన్స్ రీషెడ్యూల్

ఏపీ గ్రూప్-2 మెయిన్స్ రాతపరీక్షను ఏపీపీఎస్సీ మరో బిగ్ అప్డేట్ ఇచ్చింది. వచ్చే ఏడాది జనవరి 5న నిర్వహించాల్సిన గ్రూప్-2 సర్వీసెస్ మెయిన్స్ రాత పరీక్ష ఫిబ్రవరి 23కు వాయిదా వేసినట్లు ప్రకటించింది. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన చేసింది. మొత్తం 13 ఉమ్మడి జిల్లాల్లో ఫిబ్రవరి 23, 2025 గ్రూప్-2 మెయిన్స్ రాత పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ పరీక్షను రెండు సెషన్లలో నిర్వహిస్తారు. దాదాపు లక్ష మంది అభ్యర్థులు గ్రూప్-2 మెయిన్స్ పరీక్షకు హాజరు కానున్నారు.

2023 డిసెంబర్‌లో 899 పోస్టులతో ఏపీపీఎస్సీ గ్రూప్-2 నోటిఫికేషన్‌ జారీ చేసిన విషయం తెలిసిందే. 2024 ఫిబ్రవరిలో గ్రూప్-2 ప్రిలిమినరీ పరీక్షలు నిర్వహించారు. జులై నాటికి గ్రూప్ -2 మెయిన్స్ పూర్తి చేయాల్సి ఉండగా, వివిధ కారణాలతో వాయిదా పడింది. ఇటీవల ఏపీపీఎస్సీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన అనూరాధ... గ్రూప్-2 మెయిన్స్‌ నిర్వహణపై నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఏపీపీఎస్సీ షెడ్యూల్ ప్రకటించింది. తాజాగా ఈ పరీక్షను రీషెడ్యూల్ చేశారు. గ్రూప్ -2 ప్రిలిమినరీ పరీక్షలో 92,250 మంది అభ్యర్థులు మెయిన్స్ కు క్వాలిఫై అయ్యారు.

899 గ్రూప్-2 పోస్టులు

ఏపీపీఎస్సీ గ్రూప్-2 ప్రిలిమ్స్ పరీక్షను 2024 ఫిబ్రవరి 25న నిర్వహించారు. ఈ ఫలితాలను ఏప్రిల్ 10న ప్రకటించారు. గ్రూప్-2 మెయిన్స్ పరీక్షకు మొత్తం 92,250 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. వివిధ కారణాలతో 2557 మంది అభ్యర్థులను రిజెక్ట్ చేశారు. ఏపీపీఎస్సీ 899 గ్రూప్-2 పోస్టులకు ఫిబ్రవరి 25న ప్రిలిమినరీ పరీక్షను నిర్వహించింది. గ్రూప్-2 స్క్రీనింగ్ టెస్ట్ కు రాష్ట్ర వ్యాప్తంగా 4,83,525 మంది అభ్యర్థులు నమోదు చేసుకోగా, 4,63,517 మంది హాల్ టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకున్నారు. 4,04,037 మంది పరీక్షకు హాజరయ్యారు. ప్రిలిమినరీ పరీక్షకు 87.17% శాతం మంది హాజరయ్యారని ఏపీపీఎస్సీ తెలిపింది. ఏపీలోని 26 జిల్లాల్లోని 1327 కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించారు.

గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష విధానం

ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలను వచ్చే ఏడాది ఫిబ్రవరి 23న నిర్వహించనున్నట్లు కమిషన్ తాజాగా ప్రకటించింది. గ్రూప్ 2 మెయిన్స్ లో రెండు పేపర్లు ఉంటాయి. మొత్తం 300 మార్కులకు పరీక్షలను నిర్వహిస్తారు. ఒక్కొక్కటి 150 మార్కులు కేటాయించారు. పేపర్-1లో చూస్తే ఏపీ సామాజిక, సాంస్కృతిక చరిత్ర, భారత రాజ్యాంగం అంశాలు ఉన్నాయి. ఇక పేపర్-2లో చూస్తే భారతదేశ, ఏపీ ఆర్థిక వ్యవస్థ, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ అంశాల నుంచి ప్రశ్నలు ఉంటాయి. ప్రతి సెక్షన్ కు 75 మార్కులు కేటాయిస్తారు.

Whats_app_banner

సంబంధిత కథనం