APPSC Notification | నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల-appsc notification released for forest jobs see more details here ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Appsc Notification Released For Forest Jobs See More Details Here

APPSC Notification | నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల

HT Telugu Desk HT Telugu
Apr 27, 2022 10:15 PM IST

నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ గుడ్ న్యూస్ చెప్పింది. పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.

ఏపీపీఎస్సీ నోటిఫికేషన్
ఏపీపీఎస్సీ నోటిఫికేషన్

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఫారెస్ట్ సర్వీస్ విభాగంలో అసిస్టెంట్ కన్జర్వేటర్ల పోస్టులను భర్తీ చేస్తున్నట్టు ప్రకటన విడుదల చేసింది. మొత్తం 9 ఖాళీలను భర్తీ చేయనున్నట్టు ఏపీపీఎస్సీ ప్రకటించింది. ఆన్ లైన్ ఈ పోస్టులకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.

ట్రెండింగ్ వార్తలు

ఏపీపీఎస్సీ విడుదల చేసిన ఫారెస్ట్ సర్వీస్ విభాగం ఉద్యోగాలకు ఏప్రిల్ 20 నుంచి.. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. చివరి తేదీ మే 10గా ఉంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాలని ఏపీపీఎస్సీ తెలిపింది.

18 నుంచి 42 ఏళ్ల మధ్య వయసు వాళ్లు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదేళ్లు, Ex-Service Men, ఎన్ సీసీ అభ్యర్థులకు మూడేళ్లు వయో పరిమితిలో సడలింపు ఉంది. అభ్యర్థులు అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజుగా రూ.250 చెల్లించాలి. ఎగ్జామ్ ఫీజుగా రూ.120గా ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులకు ఎగ్జామ్ ఫీజులో మినహాయింపు ఉంటుంది. వైట్ రేషన్ కార్డు ఉన్న అభ్యర్థులకు కూడా మినహాయింపు ఉంటుంది.

అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ విద్యార్హత సాధించి ఉండాలి. అయితే అగ్రికల్చర్, బోటనీ, కెమిస్ట్రీ, కంప్యూటర్ అప్లికేషన్స్/కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్, ఎన్విరాన్మెంటల్ సైన్స్, ఫారెస్ట్రీ, హార్టికల్చర్, మాథ్స్, ఫిజిక్స్, స్టాటిస్టిక్స్, వెటర్నరీ సైన్స్, జువాలజి సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. ఏపీపీఎస్సీ నిర్దేశించిన శారీర ధారుడ్యం కలిగి ఉండాలి.

అప్లై చేసినవారు రాత పరీక్షకు హాజరుకావాలి. దీని ఆధారంగానే.. అభ్యర్థిని ఎంపిక చేస్తారు. ఇంగ్లిష్, తెలుగు యాబై మార్కుల చొప్పున నిర్వహించే ఎగ్జామ్ లో క్వాలిఫై కావాలి. జనరల్ స్టడీస్&మెంటల్ ఎబిలిటీ 150 మార్కులు, మాథ్స్-150, జనరల్ ఫారెస్ట్రీ-1లో 150 మార్కులు, జనరల్ ఫారెస్ట్రీ-2కు సంబంధించి 150 మార్కులు ఉంటాయి. మెుత్తంగా కలిపి.. 600 మార్కులకు పరీక్ష ఉంటుంది. అభ్యర్థులు సాధించిన మార్కులను ఆధారంగా చేసుకుని ఎంపిక ఉంటుంది.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్