APPSC group1 Pattern: గ్రూప్1 పరీక్షల్లో మార్పులకు సిద్ధమవుతోన్న కమిషన్
APPSC group1 Pattern: ఏపీపీఎస్సీ ఆధ‌్వర్యంలో జరిగే గ్రూప్ 1 పరీక్షల్లో కీలక మార్పులు చేయాలని కమిషన్ భావిస్తోంది. ప్రస్తుతం ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగాలకు ఎంపిక జరుగుతోంది. తాజాగా ప్రశ్నావళి విధానాన్ని మార్చాలని భావిస్తోంది.
APPSC group1 Pattern: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే గ్రూప్-1 పరీక్షల్లో కీలక మార్పులు చేయాలని ఏపీపీఎస్సీ భావిస్తోంది. ప్రిలిమ్స్, మెయిన్స్ రెండింటిలోనూ ప్రశ్నల సరళి మార్చాలని, అవసరమైతే కొన్ని పేపర్లు తగ్గించాలని కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం ప్రిలిమ్స్‌లో జనరల్ స్టడీస్, జనరల్ ఆప్టిట్యూడ్ ప్రశ్నపత్రాలున్నాయి. ఇందులో జనరల్ ఆప్టిట్యూడ్‌కు వెయిటేజ్ తగ్గించాలని భావిస్తోంది.
జనరల్ ఆప్టిట్యూడ్‌కు జనరల్ స్టడీస్‌తో సమానంగా ప్రశ్నలు ఉండటం వల్ల గణితం చదివిన వారికి ఎక్కువ మార్కులు సాధించే అవకాశం లభిస్తోందని, అందువల్ల జనరల్ ఆప్టిట్యూడ్‌కు వెయిటేజ్ తగ్గించాలని ఆర్ట్స్ అభ్యర్థులు డిమాండ్ చేస్తూ వస్తున్నారు.
విద్యార్ధుల డిమాండ్లతో పాటు ఇటీవల ర్యాంకుల సాధించిన వారి నేపథ్యం పరిశీలించిన అధికారులు ప్రిలిమ్స్‌లో ఒక పేపర్ తొలగించి ఎక్కువ జనరల్ స్టడీస్ ప్రశ్నలు ఉండేలా కొత్త తరహా ప్రశ్నావళిని రూపొందించాలని భావిస్తోంది. మెయిన్స్‌లో అర్హత పరీక్షలు కాకుండా ఐదు పేపర్లుంటాయి. ప్రస్తుతం ఇవన్నీ పూర్తిగా వ్యాసరూప విధానంలో ఉన్నాయి.
ఇకపై మెయిన్స్ పరీక్షల్లో కూడా కొన్ని సబ్జెక్టుల్లో ఇకపై ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలు పెట్టాలని ఏపీపీఎస్సీ భావిస్తోంది. ఏపీపీఎస్సీ త్వరలో 98 పోస్టులకు గ్రూపు-1 నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు సమాచారం.