APPSC Group 4 Exam : అలర్ట్... ఏప్రిల్ 4న ఏపీ గ్రూప్- 4 మెయిన్స్ పరీక్ష-appsc group 4 mains exam will be conducted on 4th april 2023 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Appsc Group 4 Mains Exam Will Be Conducted On 4th April 2023

APPSC Group 4 Exam : అలర్ట్... ఏప్రిల్ 4న ఏపీ గ్రూప్- 4 మెయిన్స్ పరీక్ష

HT Telugu Desk HT Telugu
Mar 24, 2023 01:47 PM IST

APPSC Group 4 Exam Updates: గ్రూప్ 4 అభ్యర్థులకు అలర్ట్ ఇచ్చింది ఏపీపీఎస్సీ. తుది పరీక్ష తేదీలను ఖరారు చేస్తూ ప్రకటన విడుదల చేసింది.

గ్రూప్-4 పరీక్ష తేదీ ప్రకటన
గ్రూప్-4 పరీక్ష తేదీ ప్రకటన (appsc)

APPSC Group 4 Exam Date: గ్రూప్ 4 ఉద్యోగాల భర్తీకి సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. రెవెన్యూ శాఖలోని 670 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి ఇప్పటికే స్క్రీనింగ్ పరీక్షను పూర్తి చేసిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలో అర్హత సాధించిన వారిని మెయిన్స్ కు ఎంపిక చేసింది. అయితే తాజాగా మెయిన్స్ పరీక్షకు సంబంధించిన పరీక్ష తేదీలను ప్రకటించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.

ట్రెండింగ్ వార్తలు

ఏప్రిల్ 4వ తేదీన పరీక్ష....

ఏప్రిల్ 4న గ్రూప్ 4 మెయిన్స్ పరీక్షను నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ వెల్లడించింది. ఆయా జిల్లా కేంద్రాల్లో రెండు షిఫ్టుల్లో నిర్వహిస్తామని తెలిపింది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ విధానంలో పరీక్షను నిర్వహిస్తారు. హాల్ టికెట్లను ఈ నెల 24వ తేదీ నుంచి పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది.

రెవెన్యూ శాఖలో గ్రూప్‌- 4 ఉద్యోగాలైన జూనియర్‌ అసిస్టెంట్‌ నియామకాల కోసం జులై 31న నిర్వహించారు. మెయిన్స్‌ పరీక్షకు ఎంపికైన వారి వివరాలను ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. స్క్రీనింగ్‌ పరీక్షకు 2,11,341 మంది హాజరుకాగా.. 11,574 మంది అభ్యర్థులు మెయిన్స్‌ పరీక్షకు అర్హత సాధించారు. ఈ నోటిఫికేషన్ ద్వారా… మొత్తం 670 గ్రూప్ 4 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. కొత్త జిల్లాల ప్రకారం వీటి భర్తీని చేపట్టారు. జూలై లో పరీక్ష నిర్వహించగా... ఆగస్టు 2న కీ ని విడుదల చేశారు.

హాల్ టికెట్లు ఇలా డౌన్లోడ్ చేసుకోండి…

అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారిక వెబ్‌సైట్‌ (www.psc.ap.gov.in)లోకి వెళ్లాలి.

వెబ్‌సైట్ హోమ్‌పేజీలో గ్రూప్ 4 మెయిన్స్ పరీక్ష హాల్ టికెట్ల ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

మీ వివరాలు నమోదు చేస్తే హాల్ టికెట్ డిస్ ప్లే అవుతుంది.

ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై క్లిక్ చేసి హాల్ టికెట్ ను పొందవచ్చు.

IPL_Entry_Point