AP Group 1 : రేపట్నుంచి గ్రూప్‌ 1 మెయిన్స్ పరీక్షలు - ఫేస్ రికగ్నైజేషన్ విధానం అమలు-appsc group 1 mains exams from june 3 check key instructions are here ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
Telugu News  /  Andhra Pradesh  /  Appsc Group 1 Mains Exams From June 3 Check Key Instructions Are Here

AP Group 1 : రేపట్నుంచి గ్రూప్‌ 1 మెయిన్స్ పరీక్షలు - ఫేస్ రికగ్నైజేషన్ విధానం అమలు

ఏపీ గ్రూప్‌ 1 మెయిన్స్ పరీక్షలు
ఏపీ గ్రూప్‌ 1 మెయిన్స్ పరీక్షలు

APPSC Group 1 Updates: జూన్ 3వ తేదీ నుంచి ఏపీ గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. జూన్ 10వ తేదీ వరకు ఈ పరీక్షలు కొనసాగనున్నాయి. ఇందుకోసం ఏపీపీఎస్సీ పకడ్బందీ ఏర్పాట్లు చేసింది.

Andhra Pradesh Public Service Commission: ఏపీ గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షలకు సర్వం సిద్ధమైంది. జూన్ 3వ తేదీ నుంచి ఈ ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే హాల్ టికెట్లు అందుబాటులో రాగా… జూన్ 10వ తేదీ ఈ పరీక్షలను నిర్వహించునున్నారు. ఉదయం 8:30 గంటల నుంచి 9:30 గంటలలోపు పరీక్షా కేంద్రాల్లోకి అభ్యర్థులకు అనుమతి ఇవ్వనున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష జరగనుంది. జూన్ 10 వరకు ఈ పరీక్షలు కొనసాగుతాయి. అభ్యర్థులు ఏపీపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ https://psc.ap.gov.in/ నుంచి తమ హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

ట్రెండింగ్ వార్తలు

ఈ సారి ఆఫ్ లైన్ లోనే గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఏపీపీఎస్సీ స్ఫష్టం చేసింది. ఇక ఎగ్జామ్ సెంటర్ల వద్ద పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేయటంతో పాటు... లీకేజ్ వంటి వాటికి ఆస్కారం లేకుండా చర్యలు చేపట్టింది. పరీక్షా కేంద్రాల్లోని సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్‌తో అనుసంధానం చేశారు. ఇక అభ్యర్థులకు బయోమెట్రిక్‌తో పాటు తొలిసారి ఫేస్ రికగ్నైజేషన్ విధానం అమలు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.

ఇలా డౌన్లోడ్ చేసుకోండి..

గ్రూప్ -1 అభ్యర్థులు మొదటగా ఏపీపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ https://psc.ap.gov.in/ లోకి వెళ్లాలి.

గ్రూప్ -1 హాల్ టికెట్లు అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి.

యూజర్ ఐడీ, పాస్ వర్డ్ ను ఎంట్రీ చేయాలి.

సబ్మిట్ చేయగానే మీ హాల్ టికెట్ డిస్ ప్లే అవుతుంది.

ప్రింట్ లేదా డౌన్లోడ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి హాల్ టికెట్ కాపీని పొందవచ్చు.

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 111 పోస్టుల భర్తీకోసం ఏపీపీఎస్సీ గతేడాది సెప్టెంబర్ 30న గ్రూప్ 1 నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకుగాను మొత్తం 1,26,449 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఏడాది జనవరి 8న... 18 జిల్లాల్లో 297 పరీక్షా కేంద్రాల్లో ఏపీపీఎస్సీ నిర్వహించిన ప్రాథమిక పరీక్షకు 82.38శాతం మంది హాజరయ్యారు. వీలైనంత త్వరగా ఫలితాలు వెల్లడిస్తామని ప్రకటించిన అధికారులు... అందరినీ ఆశ్చర్యపరుస్తూ... రికార్డు స్థాయిలో 20 రోజుల్లోనే ప్రిలిమ్స్ రిజల్ట్స్ వెలువరించారు. 1 : 50 పద్ధతిలో ఫలితాలు వెల్లడించిన ఏపీపీఎస్సీ... 6,455 మంది మెయిన్స్ కు అర్హత సాధించినట్లు తెలిపింది. మెయిన్స్ కు అర్హత సాధించిన వారి వివరాలను వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచింది.

భర్తీ చేసే పోస్టుల వివరాలు:

డిప్యూటీ రిజిస్ట్రార్ పోస్టులు - 1

అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ పోస్టులు - 1

డిప్యూటీ కలెక్టర్ పోస్టులు - 10

అసిస్టెంట్ కమిషనర్ పోస్టులు - 12

డిప్యూటీ సూపరింటెండెంట్‌ పోస్టులు - 13

డివిజనల్/డిస్ట్రిక్‌ ఫైర్‌ ఆఫీసర్‌ పోస్టులు - 2

అసిస్టెంట్‌ ట్రెజరీ ఆఫీసర్/అసిస్టెంట్‌ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులు - 8

రీజనల్‌ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసర్‌ పోస్టులు - 2

మండల పరిషత్ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ పోస్టులు - 7

జిల్లా రిజిస్ట్రార్ పోస్టులు - 3

జిల్లా గిరిజన సంక్షేమ ఆఫీసర్‌ పోస్టులు - 1

జిల్లా బీసీ సంక్షేమ ఆఫీసర్‌ పోస్టులు - 2

మున్సిపల్ కమీషనర్ గ్రేడ్-II పోస్టులు - 6

అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్/లే సెక్రెటరీ అండ్‌ ట్రెజర్‌ గ్రేడ్-II పోస్టులు - 18

అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ పోస్టులు - 4

గ్రూప్‌–1 పోస్టులు 92 ఉండగా ఇందులో 17 అసిస్టెంట్‌ మోటార్‌ వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్‌ జాబ్స్ ఉన్నాయి.

WhatsApp channel

సంబంధిత కథనం