AP Group 1 Results : ఏపీ గ్రూప్-1 తుది ఫలితాలు విడుదల-appsc group 1 final result declared on pscapgovin ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Appsc Group 1 Final Result Declared On Psc.ap.gov.in

AP Group 1 Results : ఏపీ గ్రూప్-1 తుది ఫలితాలు విడుదల

Maheshwaram Mahendra Chary HT Telugu
Aug 17, 2023 05:05 PM IST

APPSC Group 1 Results : ఏపీ గ్రూప్ - 1 ఫలితాలు తుది ఫలితాలు వచ్చేశాయ్. ఎంపికైన వారి జాబితాను ఏపీపీఎస్సీ ప్రకటించింది.

ఏపీ గ్రూప్ 1 ఫలితాలు
ఏపీ గ్రూప్ 1 ఫలితాలు

APPSC Group 1 Results : ఆంధ్రప్రదేశ్ గ్రూప్ - 1 తుది ఫలితాలు వచ్చేశాయ్. గురువారం సాయంత్రం ఏపీపీఎస్సీ చైర్మన్‌ గౌతం సవాంగ్‌ ఫలితాలను విడుదల చేశారు. https://psc.ap.gov.in/ వెబ్ సైట్ ఎంపికైన వారి వివరాలను పొందుపర్చినట్లు తెలిపారు. ఈ నోటిఫికేషన్ లో భాగంగా... 110 పోస్టులను భర్తీ చేస్తున్నారు.భానుశ్రీ లక్ష్మీ అన్నపూర్ణ ప్రత్యూష మొదటి ప్లేస్ లో నిలవగా…సెకండ్ ర్యాంకర్ గా అనంతపురం జిల్లాకు చెందిన భూమిరెడ్డి భవాని నిలిచింది. ఆ తర్వాత స్థానాల్లో లక్ష్మీ ప్రసన్న, ప్రవీణ్ కుమార్ రెడ్డి, భానుప్రకాష్ రెడ్డి వరసు స్థానాల్లో నిలిచినట్లు గౌతమ్ సవాంగ్ వెల్లడించారు.

ట్రెండింగ్ వార్తలు

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 111 పోస్టుల భర్తీకోసం ఏపీపీఎస్సీ గతేడాది సెప్టెంబర్ 30న గ్రూప్ 1 నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకుగాను మొత్తం 1,26,449 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఏడాది జనవరి 8న... 18 జిల్లాల్లో 297 పరీక్షా కేంద్రాల్లో ఏపీపీఎస్సీ నిర్వహించిన ప్రాథమిక పరీక్షకు 82.38శాతం మంది హాజరయ్యారు. వీలైనంత త్వరగా ఫలితాలు వెల్లడిస్తామని ప్రకటించిన అధికారులు... అందరినీ ఆశ్చర్యపరుస్తూ... రికార్డు స్థాయిలో 20 రోజుల్లోనే ప్రిలిమ్స్ రిజల్ట్స్ వెలువరించారు. 1 : 50 పద్ధతిలో ఫలితాలు వెల్లడించిన ఏపీపీఎస్సీ... 6,455 మంది మెయిన్స్ కు అర్హత సాధించారు. వీరికి మెయిన్స్ పరీక్షలు నిర్వహించిన కమిషన్.... కేవలం 34 రోజులలోనే ఫలితాలను ప్రకటించింది. ఎంపికైన అభ్యర్థులకు ఆగస్టు 2 నుంచి గ్రూప్-1 ఇంటర్వ్యూలు నిర్వహించిన అనంతరం… ఆగస్టు 17వ తేదీన ఫలితాలను ప్రకటించారు.

భర్తీ చేసే పోస్టుల వివరాలు:

డిప్యూటీ రిజిస్ట్రార్ పోస్టులు - 1

అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ పోస్టులు - 1

డిప్యూటీ కలెక్టర్ పోస్టులు - 10

అసిస్టెంట్ కమిషనర్ పోస్టులు - 12

డిప్యూటీ సూపరింటెండెంట్‌ పోస్టులు - 13

డివిజనల్/డిస్ట్రిక్‌ ఫైర్‌ ఆఫీసర్‌ పోస్టులు - 2

అసిస్టెంట్‌ ట్రెజరీ ఆఫీసర్/అసిస్టెంట్‌ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులు - 8

రీజనల్‌ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసర్‌ పోస్టులు - 2

మండల పరిషత్ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ పోస్టులు - 7

జిల్లా రిజిస్ట్రార్ పోస్టులు - 3

జిల్లా గిరిజన సంక్షేమ ఆఫీసర్‌ పోస్టులు - 1

జిల్లా బీసీ సంక్షేమ ఆఫీసర్‌ పోస్టులు - 2

మున్సిపల్ కమీషనర్ గ్రేడ్-II పోస్టులు - 6

అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్/లే సెక్రెటరీ అండ్‌ ట్రెజర్‌ గ్రేడ్-II పోస్టులు - 18

అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ పోస్టులు - 4

WhatsApp channel