APPSC Results: ఏపీపీఎస్సీ ఈవో తుది ఫలితాలు విడుదల - జాబితా ఇదే
APPSC EO Results 2023:ఎండోమెంట్ శాఖలోని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(ఈవో) గ్రేడ్-3 పోస్టుల ఫలితాలను విడుదల చేసింది ఏపీపీఎస్సీ. ఈ మేరకు వెబ్ సైట్ లో ఫలితాలను అందుబాటులో ఉంచింది.
APPSC Latest News Updates: ఏపీ దేవాదాయశాఖలోని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(ఈవో) గ్రేడ్-3 పోస్టుల భర్తీకి సంబంధించి తుది ఫలితాలు విడుదలయ్యాయి. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఓ ప్రకటన విడుదల చేసింది. మొత్తం 59 మంది ఉద్యోగాలకు ఎంపికైనట్లు ప్రకటించింది. కర్నూలు జిల్లాకు సంబంధించి సరైన అర్హతలు లేని కారణంగా ఒక పోస్టును భర్తీచేయలేదు. జిల్లాలవారీగా ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల రిజిస్ట్రేషన్ వివరాలను అధికారిక (https://psc.ap.gov.in) వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.
ఈ ఫలితాల్లో చూస్తే శ్రీకాకుళం జిల్లా నుంచి నలుగురు, విజయనగరం-04, విశాఖపట్టణం-04, తూర్పుగోదావరి-08, పశ్చిమగోదావరి-07, క్రిష్ణా-06, గుంటూరు-07, ప్రకాశం-06, నెల్లూరు-04, చిత్తూరు-01, అనంతపురం-02, కర్నూలు-05, కడప నుంచి ఒకరు ఎంపికయ్యారు. ఎంపికైన అభ్యర్థుల హాల్ టికెట్ నెంబర్లను కమిషన్ వెబ్ సైట్ లో ఉంచారు.
దేవదాయ శాఖలో ఈవో ఉద్యోగాలకు మొదటగా ప్రిలిమ్స్ నిర్వహించారు. ఇందులో 1,278 మంది క్వాలిఫై అయ్యారు. వీరంతా ఫిబ్రవరి 17వ తేదీన మెయిన్స్ పరీక్షలు రాశారు. సీబీటీ విధానంలో నిర్వహించిన పరీక్షలో మొత్తం 59 మంది ఎంపికయ్యారు. మెయిన్స్‌లో అర్హత సాధించిన అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన ఏప్రిల్ 26, మే 8 తేదీల్లో విజయవాడలోని ఏపీపీఎస్సీ కార్యాలయంలో నిర్వహించిన సంగతి తెలిసిందే.
గ్రూప్ 2లో మార్పులు….
APPSC Group 2 Syllabus: త్వరలోనే ఏపీ గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఇదే సమయంలో గ్రూప్-2 సిలబస్ కు సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. పలు మార్పులు చేస్తూ కొత్త సిలబస్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. మొత్తం 450 మార్కులకు గాను రెండు దశల రాత పరీక్షల ద్వారా భర్తీ ప్రక్రియను చేపట్టనుంది. మొదటగా స్క్రీనింగ్ పరీక్ష తర్వాత... రెండో దశలో మెయిన్స్ నిర్వహించనున్నారు.కొత్తగా ప్రకటించిన సిలబస్ ప్రకారం… 150 మార్కులకు ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది. స్క్రీనింగ్ టెస్టులో భారతదేశ చరిత్ర, భూగోళశాస్త్రం, భారతీయ సమాజం, కరెంట్ అఫైర్స్, మెంటల్ ఎబిలిటీ అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి.ఇందులో కొత్తగా భారతీయ సమాజం అంశాన్ని చేర్చారు ఒక్కో సెక్షన్ కు 30 మార్కులు కేటాయించారు. ఇందులో అర్హత సాధిస్తేనే మెయిన్స్ కు అర్హులు అవుతారు..మెయిన్స్‌లో మొత్తం 2 పేపర్లు ఉన్నాయి. ఒక్కొక్కటి 150 మార్కులు కేటాయించారు. పేపర్-1లో చూస్తే ఏపీ సామాజిక, సాంస్కృతిక చరిత్ర, భారత రాజ్యాంగం అంశాలు ఉన్నాయి. ఇక పేపర్-2లో చూస్తే భారతదేశ, ఏపీ ఆర్థిక వ్యవస్థ, సైన్స్ అండ్ టెక్నాలజీ అంశాల నుంచి ప్రశ్నలు ఉంటాయి. ప్రతి సెక్షన్ కు 75 మార్కులు కేటాయించారు.