APPSC FRO Exam: ఏపీపీఎస్సీ అలర్ట్‌… ఆన్‌లైన్‌లోనే ఫారెస్ట్‌ రేంజ్ ఆఫీసర్ స్క్రీనింగ్‌ పరీక్ష...-appsc alert forest range officer screening exam online ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Appsc Fro Exam: ఏపీపీఎస్సీ అలర్ట్‌… ఆన్‌లైన్‌లోనే ఫారెస్ట్‌ రేంజ్ ఆఫీసర్ స్క్రీనింగ్‌ పరీక్ష...

APPSC FRO Exam: ఏపీపీఎస్సీ అలర్ట్‌… ఆన్‌లైన్‌లోనే ఫారెస్ట్‌ రేంజ్ ఆఫీసర్ స్క్రీనింగ్‌ పరీక్ష...

Bolleddu Sarath Chandra HT Telugu
Nov 08, 2024 01:05 PM IST

APPSC FRO Exam: ఏపీపీఎస్సీ ఫారెస్ట్ రేంజ్‌ ఆఫీసర్‌ నియామక పరీక్షల్ని ఆన్‌లైన్‌లోనిర్వహించాలని కమిషన్ నిర్ణయించింది. ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో 37 ఫారెస్ట్‌ రేంజ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి గత మార్చిలో నోటిఫికేషన్‌ విడుదలైంది. స్క్రీనింగ్‌ పరీక్ష తొలుత ఆఫ్‌లైన్‌లో నిర్వహించాలని భావించినా దానిని మార్చారు.

ఏపీపీఎస్సీ నియామకాలు షురూ
ఏపీపీఎస్సీ నియామకాలు షురూ

APPSC FRO Exam: ఏపీపీఎస్సీ ఉద్యోగ నియామక పరీక్షల్లో కదలిక వచ్చింది. ఇప్పటికే వెలువడిన నోటిఫికేషన్లకు పరీక్షల నిర్వహణకు కమిషన్ సిద్ధం అవుతోంది. ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో చేపట్టిన ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్ల నియామక పరీక్షల్ని ఆన్‌లైన్‌లోనే నిర్వహిస్తారు. 37 పోస్టుల భర్తీకి గత మార్చిలో ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. గత మార్చి ఆరో తేదీన జారీ చేసిన 11/2024 నోటిఫికేషన్‌లో స్క్రీనింగ్ టెస్ట్‌ ఆఫ్‌‌లైన్‌లో నిర్వహిస్తారని పేర్కొన్నారు. నోటిఫికేషన్‌లో ఓఎంఆర్‌ షీట్ల ద్వారా ఆఫ్‌లైన్‌ పద్ధతిలో స్క్రీనింగ్ టెస్ట్‌ జరుగుతుందని పేర్కొన్నారు.మెయిన్ పరీక్షలను ఆన్‌లైన్‌ లో కంప్యూటర్ బేస్డ్‌ టెస్ట్ ద్వారా నిర్వహిస్తారని వెల్లడించారు.

ఏపీపీఎస్సీ ద్వారా చేపట్టే ఉద్యోగ నియామక పరీక్షల నిర్వహణలో మార్పులు చేసే అధికారం కమిషన్‌కు ఉంటుంది. నోటిఫికేషన్‌ ఈ విషయాన్ని స్పష్టం పేర్కొన్నట్టు కమిషన్ కార్యదర్శి ప్రదీప్‌ కుమార్‌ వివరించారు.ఏపీపీఎస్సీ ఛైర్మన్‌ ఇటీవల రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారిణి ఏఆర్‌ అనురాధ నిర్వహించారు.

పరీక్షల నిర్వహణలో పారదర్శకతకు పెద్దపీట వేయాలని ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో స్క్రీనింగ్ పరీక్షలను కూడా ఆన్‌‌లైన్‌ పద్ధతిలో కంప్యూటర్ బేస్డ్‌ విధానంలో నిర్వహించాలని నిర్ణయించారు. పాలనాపరమైన సౌలభ్యం కోసమే పరీక్షల్ని ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నట్టు కార్యదర్శి వివరించారు. మెయిన్స్‌ నిర్వహణలో ఎలాంటి మార్పులు లేవని తెలిపారు.

ఇప్పటికే స్క్రీనింగ్ పరీక్ష ఆలస్యం..

ఏపీ అటవీశాఖలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ (APPSC FRO Recruitment) పోస్టుల భర్తీకి ఇటీవల ఏపీపీఎస్సీ(APPSC) నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన కమిషన్‌ ఛైర్మన్ పదవికి గౌతమ్ సవాంగ్ రాజీనామా చేశారు. గత నెలలోనే కొత్త ఛైర్మన్‌ బాధ్యతలు స్వీకరించారు. పెండింగ్‌ పరీక్షల నిర్వహణపై దృష్టి సారించారు.

దాదాపు మొత్తం 37 పోస్టుల భర్తీకి ఏప్రిల్ 15 నుంచి ఆన్ లైన్ అప్లికేషన్లు స్వీకరణ పూర్తైంది.మే నెల 15 వరకు అభ్యర్థులు ఆన్‌లైన్ లో అప్లై (APPSC FRO Apply)చేసుకునే అవకాశం కల్పించారు.

సంబంధిత సబ్జెట్ లో డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత కలిగి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులుగా నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెల రూ.48,400 వేల నుంచి రూ.1,37,220 లక్షల వరకు వేతనం ఉంటుంది. రాతపరీక్షలు, కంప్యూటర్ ప్రొఫీషియన్సీ టెస్ట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. 01.07.2024 నాటికి 18 - 30 సంవత్సరాల వయస్సులోపు అభ్యర్థులు అర్హులు. రిజర్వేషన్ల ప్రకారం అభ్యర్థులు వయో పరిమితి సడలింపు ఉంటుంది.

జోన్ల వారీగా పోస్టులు(FRO Posts)

జోన్ -I : 08 ఖాళీలు

జోన్ -II : 11 ఖాళీలు

జోన్ -III : 10 ఖాళీలు

జోన్ -IV : 08 ఖాళీలు

పోస్టుల కేటాయింపు : ఓసీ-14, బీసీ-12, ఈడబ్ల్యూఎస్-11 పోస్టులు

ఫీజు వివరాలు

అర్హత కలిగిన అభ్యర్థులు ఏపీపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ లో అప్లికేషన్ ఫీజు రూ.250, పరీక్ష ఫీజు రూ.120 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు పరీక్ష ఫీజు రూ.120 చెల్లించాల్సిన అవసరంలేదు.

పరీక్ష విధానం ఇలా?

ఎఫ్ఆర్వో ప్రిలిమ్స్ (AP FRO Prelims)పరీక్షను మొత్తం 150 మార్కులకు నిర్వహిస్తారు. పార్ట్-ఎ జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ, పార్ట్-బిలో జనరల్ ఫారెస్ట్రీ అంశాలు ఉంటాయి. పరీక్షలో నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 1/3 వంతు మార్కులు కోత విధిస్తామని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.

మెయిన్ పరీక్షను(AP FRO Mains) మొత్తం 600 మార్కులకు నిర్వహిస్తారు. మెయిన్స్ లో మొత్తం నాలుగు పేపర్లను ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. వీటిల్లో ఒకటి క్వాలిఫైయింగ్ పేపర్ (జనరల్ ఇంగ్లిష్, జనరల్ తెలుగు) ఉంటుంది. మెయిన్స్ లో నెగెటివ్ మార్కులు(1/3) ఉంటాయి. మెయిన్స్ లో క్వాలిఫై అయిన అభ్యర్థులకు 100 మార్కులకు కంప్యూటర్ ప్రొఫీషియన్సీ టెస్ట్ నిర్వహిస్తారు. ఓసీలకు 40, బీసీలకు 35, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 30 మార్కులు కనీస అర్హతగా నిర్ణయించారు.

Whats_app_banner

సంబంధిత కథనం