Handloom Jobs: చేనేత స్మాల్ క్లస్టర్ డెవలప్ మెంట్ ప్రోగ్రామ్ లో ఖాళీల భర్తీకి దరఖాస్తు చేసుకోండి ఇలా..
Handloom Jobs: జాతీయ చేనేత అభివృద్ధి పథకం క్రింద ఏపీలో స్మాల్ క్లస్టర్ డెవలప్ మెంట్ ప్రోగ్రామ్ లో క్లస్టర్ డెవలప్ మెంట్ ఎగ్జిక్యూటివ్స్, టెక్స్ టైల్ డిజైనర్స్ గా పనిచేయుటకు ఆసక్తి గత అభ్యర్థుల నుండి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.
Handloom Jobs: జాతీయ చేనేత అభివృద్ధి పథకం క్రింద ఏపీలో స్మాల్ క్లస్టర్ డెవలప్ మెంట్ ప్రోగ్రామ్ లో క్లస్టర్ డెవలప్ మెంట్ ఎగ్జిక్యూటివ్స్, టెక్స్ టైల్ డిజైనర్స్ గా పనిచేయడానికి ఆసక్తి గల అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని చేనేత మరియు జౌళీ శాఖ కమిషనర్ జి. రేఖారాణి తెలిపారు.
అభ్యర్థులను అర్హత, అనుభవం, వయస్సు, నివాసం తదితర అంశాల ఆధారంగా ఎంపిక చేస్తామని తెలిపారు. క్లస్టర్ డెవలప్ మెంట్ ఎగ్జిక్యూటివ్స్, టెక్స్ టైల్ డిజైనర్స్ విభాగాల్లో ఒక్కో విభాగంలో 5 ఖాళీల చొప్పున మొత్తం 10 ఖాళీలు ఉన్నాయన్నారు.
క్లస్టర్ డెవలప్ మెంట్ ఎగ్జిక్యూటివ్స్ గా దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు హ్యాండ్లూమ్ టెక్నాలజీ లేదా టెక్స్ టైల్ టెక్నాలజీ నందు డిగ్రీ లేదా డిప్లోమా కలిగి ఉండాలని, కనీసం 2 సంవత్సరాల అనుభవం ఉండాలన్నారు. అలాగే కంప్యూటర్ నందు పరిజ్ఞానం, రికార్డులు, ఖాతా పుస్తకాల నిర్వహణపై పరిజ్ఞానం కలిగి ఉండాలన్నారు. టెక్స్ టైల్ డిజైనర్ పోస్ట్ కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు అవసరమైన డిజైన్లు అందించడానికి నిప్ట్ లేదా యన్ఐడీ లేదా ప్రఖ్యాత సంస్థ నుంచి ఉత్తీర్ణులై ఉండాలన్నారు.
చేనేత విభాగంలో టెక్స్ టైల్ డిజైనర్ గా కనీసం 2 సంవత్సరాలు పనిచేసిన అనుభవం ఉండాలన్నారు. అలాగే చేనేత రంగంలో డిజైన్లు, ఉత్పత్తుల యొక్క ఉన్నతి మరియు అభివృద్ధిలో అనుభవము కలిగి ఉండాలన్నారు. దరఖాస్తుదారులు తమ దృవపత్రాల కాపీలతో పాటు బయోడేటాను సమర్పించాలన్నారు.
ఈ పోస్టులలో నియామకాలు తాత్కాలక ప్రాతిపదికన 3 సంవత్సరాలు లేదా క్లస్టర్ అమలు కాలం ఏది ముందుగా అయితే అప్పటి వరకు నెలకు రూ. 30,000 స్థిర పారితోషకం ఉంటుందని వివరించారు. ఆసక్తి గల అభ్యర్థులు ప్రకటన ప్రచురించిన తేదీ నుండి 21 రోజుల లోపు కమిషనర్, జౌళి మరియు చేనేత శాఖ, 4వ అంతస్థు, ఐహెచ్ సి కార్పొరేట్ బిల్డింగ్, ఆటో నగర్, మంగళగిరి, అమరావతి, గుంటూరు జిల్లా-522503 కి దరఖాస్తును సమర్పించాలని సూచించారు.
క్లస్టర్ డెవలప్‌మెంట్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగ నియామకాలకు సంబంధించిన మార్గదర్శకాలు http://www.handlooms.nic.in/ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంటాయని తెలిపారు.