PM Internship: పీఎం ఇంటర్నెషిప్‌కు దరఖాస్తులు ఆహ్వానం...స్టైఫండ్‌తో అగ్రశ్రేణి కంపెనీల్లో శిక్షణ...
PM Internship: ప్రధానమంత్రి ఇంటర్నెషిప్‌కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. నెలవారీ స్టైఫండ్‌తో దేశంలోనే 12 అగ్రశ్రేణి కంపెనీల్లో శిక్షణ ఇస్తారు. దరఖాస్తును ఆన్‌లైన్‌లో చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు జనవరి 21 ఆఖరు తేదీగా ప్రకటించారు.
PM Internship: పీఎం ఇంటర్నెషిప్‌కు సంబంధించి రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఆయా జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారులు ప్రకటన విడుదల చేశారు. ఆసక్తి, అర్హత ఉన్న యువతీ, యువకులు ఆన్‌లైన్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులను ఎంపిక చేసి, వారికి పీఎం ఇంటర్నెషిప్ కింద శిక్షణ ఇస్తారు. ఇంటర్నెషిప్ పూర్తి చేసిన వారికి ఆయా కంపెనీలు ధ్రువీకరణ పత్రం అందజేస్తారు. ఈ ధ్రువీకరణ పత్రం భవిష్యత్తులు ఉద్యోగావకాశాలకు ఉపయోగపడుతుంది.
రాష్ట్రంలోని అర్హులైన యువత ప్రధాన మంత్రి ఇంటర్నెషిప్‌కు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి నోటిఫికేషన్ విడుదల అయింది. రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు జనవరి 21 ఆఖరు తేదీగా నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్ స్కిల్ డవలప్‌మెంట్ కార్పొరేషన్, నైపుణ్యాభివృద్ధి సంస్థ సంయుక్తంగా పీఎం ఇంటర్నెషిప్ కార్యక్రమం అమలు చేస్తున్నాయి. దీనికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
దరఖాస్తు చేసుకున్న యువతకు దేశంలోని అగ్రశ్రేణి కంపెనీల్లో 12 నెలల పాటు శిక్షణ ఇస్తారు. శిక్షణ సమయంలో నెలకు రూ.6,000 స్టైఫండ్ ఇస్తారు. అలాగే ఇతర సౌకర్యాలు కూడా కల్పిస్తారు. దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు వయస్సు 21 నుంచి 24 ఏళ్ల వయస్సు ఉండాలి. అలాగే పదో తరగతి, ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లొమా, బీటెక్, డిగ్రీ పూర్తి చేసిన యువకులు అర్హులు. బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు సైతం అర్హులే. వారు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు https://pminternship.mca.gov.in/login/ వెబ్‌సైట్‌లో ఈనెల 21లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇతర వివరాలకు కోసం ఆయా జిల్లాల నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారులను సంప్రదించాలని. అయితే చిత్తూరు, నెల్లూరు జిల్లాల నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారులు ఫోన్ నంబర్లను అందుబాటులోకి తీసుకుకొచ్చారు. సమాచారం కోసం ఆయా ఫోన్ నంబర్లను సంప్రదించాలని సూచించారు.
చిత్తూరు జిల్లాకు సంబంధించి ఇతర వివరాల కోసం 9505601887, 8465830771 ఫోన్ నంబర్లను సంప్రదించాలని చిత్తూరు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి గుణశేఖర్ రెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లాకు సంబంధించి పూర్తి వివరాల కోసం 8074634065, 7780750871 ఫోన్ నంబర్లను సంప్రదించాలని నెల్లూరు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి షేక్ అబ్దుల్ ఖయ్యూం తెలిపారు.
(జగదీశ్వరరావు జారజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)