Library Course Admissions: ఏపీలో ఐదు నెలల లైబ్రరీ సైన్స్ సర్టిఫికెట్ కోర్సుకు దరఖాస్తుల ఆహ్వానం
Library Course Admissions: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పౌర గ్రంథాలయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ఐదు నెలల సర్టిఫికెట్ ఇన్ లైబ్రరీ సైన్స్ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు సంస్థ డైరెక్టర్ ప్రకటించారు.

Library Course Admissions: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర గ్రంథాలయ శాఖ ఆధ్వర్యంలో ఐదు నెలల కాల వ్యవధి గల C.LI.Sc. కోర్సు కు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పౌర గ్రంథాలయ శాఖ డైరెక్టర్ ప్రసన్నకుమార్ తెలిపారు.
ఈ కోర్సుల శిక్షణా తరగతులు ఈ ఏడాది డిసెంబర్ నుండి 30 ఏప్రియల్, 2025 వరకు జరుగుతాయని ఉత్తీర్ణులైన విద్యార్థులకు సర్టిఫికెట్ అందిస్తారని తెలిపారు. కోర్సును పాతూరి నాగభూషణం స్కూల్ ఆఫ్ లైబ్రరీ సైన్స్, విజయవాడ, రాయలసీమ ఇనిస్టిట్యూట్ ఆఫ్ లైబ్రరీ సైన్స్, కడప, వావిలాల సంస్థ లైబ్రరీ సైన్స్, గుంటూరులో ఉన్న శిక్షణా సంస్థలో కోర్సులు చేయవచ్చన్నారు.
మూడు శిక్షణా సంస్థల్లో ఒక్కో శిక్షణా సంస్థలో ఇంగ్లీషు, తెలుగు మీడియంలలో 40, 40 సీట్లు అందుబాటులో ఉన్నాయి. మూడు శిక్షణా సంస్థల్లో మొత్తం 240 సీట్లు ఉన్నాయని వివరించారు. రెండు సంవత్సరాల ఇంటర్ లేదా యూజీసీ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నందు డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలని, అర్హత పరీక్షలలో అభ్యర్థి పొందిన మార్కుల ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
అర్హత పరీక్షలో పొందిన మొత్తం మార్కులకు అదనంగా డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులకు 5, పీజీ పూర్తి చేసిన విద్యార్థులకు 10 మార్కులు కలుపుతారు. బడును అని చెప్పారు. ప్రభుత్వ ఉత్తర్వుల ఆధారంగా రూల్ ఆఫ్ రిజర్వేషన్ వర్తింపచేయబడును అని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు శిక్షణా సంస్థ ప్రిన్సిపల్ వారి పేరున రూ. 2 పోస్టల్ ఆర్డర్స్ ను సమర్పించి దరఖాస్తును పొందాలని సూచించారు. నవంబర్ 1 నుండి నవంబర్ 15 వరకు దరఖాస్తులు ఆయా కళాశాలల్లో విక్రయిస్తారని, పూర్తి చేసిన దరఖాస్తులు నవంబర్ 18 సాయంత్రం 5గంటల లోపు అందించాలని సూచించారు. పోస్టల్ వారి ఆలస్యమునకు సంస్థకు ఎటువంటి సంబంధం లేదు అని పౌర గ్రంథాలయ శాఖ సంచాలకులు ఎంఆర్. ప్రసన్న కుమార్ తెలిపారు.