TTD SV Music College: ఎస్వీ సంగీత కళాశాల, నాదస్వర పాఠశాలలో పార్ట్‌టైమ్, ఫుల్ టైమ్ కోర్సులకు దరఖాస్తులు
TTD SV Music College: తిరుపతిలోని ఎస్వీ సంగీత, నృత్య కళాశాల, నాదస్వర పాఠశాలలో పార్ట్‌టైమ్, ఫుల్ టైమ్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు.
TTD SV Music College: టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర సంగీత, నృత్య కళాశాల, ఎస్వీ నాదస్వరం, డోలు పాఠశాలలో 2024-25 విద్యా సంవత్సరాలకు గాను రెగ్యులర్ కోర్సుల్లో ప్రవేశాలకు అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. మే 25వ తేదీ నుండి కళాశాలలో దరఖాస్తులు జారీ చేస్తారు. పూర్తిచేసిన దరఖాస్తులను మే 25వ తేదీ వరకు జూన్ 12వ తేదీలోపు సమర్పించాలి.
ఎస్వీ సంగీత, నృత్య కళాశాలలో గాత్రం, వయోలిన్, వీణ, ఫ్లూట్, నాదస్వరం, భరతనాట్యం, హరికథ, మృదంగం, డోలు, ఘటం విభాగాల్లో ఫుల్‌టైమ్ విశారద(డిప్లొమా), ప్రవీణ(అడ్వాన్డ్స్ డిప్లొమా) కోర్సులు ఉన్నాయి. ఎస్వీ నాదస్వరం, డోలు పాఠశాలలో ఫుల్‌టైమ్ సర్టిఫికేట్, డిప్లొమా కోర్సులు ఉన్నాయి. ఇతర ప్రాంతాల విద్యార్థులకు కళాశాలలో హాస్టల్ వసతి కల్పిస్తారు.
ఆసక్తి గల అభ్యర్థులు కళాశాలలో రూ.50/- చెల్లించి దరఖాస్తులను పొందొచ్చు. ఇతర వివరాలకు 0877-2264597, 7330811173, 9848374408, 9440793205 నంబర్లలో సంప్రదించగలరు.
పార్ట్ టైమ్ కోర్సులు…
మే 25 నుండి ఎస్వీ సంగీత, నృత్య కళాశాలలో పార్ట్‌టైమ్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. తిరుపతి శ్రీ వేంకటేశ్వర సంగీత, నృత్య కళాశాలలో 2024 - 25 విద్యా సంవత్సరానికి సంబంధించి సాయంత్రం పార్ట్‌టైమ్ సర్టిఫికేట్, డిప్లొమా, కళాప్రవేశిక కోర్సుల ప్రవేశానికి మే 25వ తేదీ నుండి దరఖాస్తులు స్వీకరిస్తామని ప్రిన్సిపల్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
సాయంత్రం 5.30 నుండి 7.30 వరకు పార్ట్‌టైమ్ కోర్సుల్లో గాత్రం, భక్తి సంగీతం, వీణ, వయొలిన్, వేణువు, మృదంగం , ఘట్టం, భరతనాట్యం, కూచిపూడి నృత్యం విభాగాల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.
ఈ కళాశాలలో హైదరాబాదులోని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ గుర్తింపుపొందిన సర్టిఫికెట్ కోర్సు(4 ఏళ్లు), డిప్లొమా కోర్సు (2 ఏళ్లు) ఉన్నాయి. టీటీడీ నిర్వహించే కళాప్రవేశిక (రెండేళ్ల ఫౌండేషన్ కోర్సు) అప్లికేషన్ రూ 50 చెల్లించి కార్యాలయ పని వేళల్లో పొందవచ్చునని చెప్పారు.
పూర్తి చేసిన దరఖాస్తులను మే 25వ తేదీ నుండి అన్ని జిరాక్స్ కాపీలతో కలిపి జూన్ 12వ తేదీ లోపు సమర్పించాలని ప్రిన్సిపల్ తెలిపారు. ఇతర వివరాలకు 0877-2264597 / 7330811173 / 9848374408 / 9440793205 ఫోన్ ద్వారా లేదా టీటీడీ వెబ్‌సైట్ www.tirumala.org ను సంప్రదించగలరు.